పంచబద్రి
(IPLTOURS)
(IPLTOURS)
విష్ణు భగవానుడు అయిదు విభిన్న పవిత్ర క్షేత్రములలో విశాల బద్రి (బదరీనాథ్), యోగధన్ బద్రి, భవిష్య బద్రి, వృద్ధ బద్రి మరియు ఆది బద్రి పేరులతో పంచబద్రి క్షేత్రములుగా భారతదేశము నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షించుచూ హిమాలయములలో బదరీనాధ్ మరియు జోషీమఠ పరిసరప్రాంతములలో వెలుగొందుచున్నాడు. ఈఅయిదుక్షేత్రములు బదరీనాధ్ పుణ్య క్షేత్రముతో ప్రారంభమై బదరీనాధ్ నకు ఉత్తరముగా 24 కి.మీ. దూరములో కల సతోపంత్హి మానీనదము దక్షణమునందు కల నందప్రయాగ వరకు విస్తరించినవి. సతోపంత్ అను పదము సత్ అనగా సత్యము పాత్ అనగా త్రోవ అను రెండు పదముల నుండి ఉద్భవించినది. మంచుతో కప్పబడిన పర్వత శిఖరముల మధ్య ఈ సతోపంత్ హిమనీనదము ఉన్నది. ఇది సముద్ర మట్టమునకు 12000 అడుగుల ఎత్తున ఉన్నది. ఈ హిమనీనదము ప్రాంతీయముగా మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఇచ్చటి నివాసులు మరణించిన వారి ఆస్తికలు ఈ హిమానీనదములో విసిరివేయుదురు. బదరీ నారాయణుడు ఈ అయిదు పుణ్య క్షేత్రములలో అయిదు విభిన్న రూపములతో కొలువబడుచున్నాడు. వేసవి వర్షాకాలములు అనగా జూన్ నెల నుండి అక్టోబరు నెల మాసములు ఈ ఆలయములు సందర్శించు టకు వీలుగా ఉండును.
బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు చామోలిజిల్లానందు చార్ ధామ్ పేరుతో ప్రసిద్ధ మైన కేదార్నాథ్, గంగోత్రి, యమునొత్రి మరియు బధ్రీనాథ్ లలో ఒకటిగా నున్న నగర పంచాయితీ. బద్రి నీలకంఠ తదితర పర్వతారోహణములకు ముఖద్వారము వంటిది. బద్రి అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న మరియు తినుటకు ఉపయోగపడు రుచికరమైన పండు మరియు నాథ్ అనగా భగవంతుడు. పూర్వపురోజులలో బదరీనాథ్ నడచి వెళ్లవలసి వచ్చేడిది. జగత్ గురు ఆది శంకరాచార్య 7వ శతాబ్దమునందు బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించినారు. అటుపిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రల వలననూ ఈప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈఆలయము దెబ్బతినుట పిమ్మట అనేకమార్లు తిరిగి నిర్మించుట జరిగియున్నది. బదరీనాధ్ పుణ్యక్షేత్రము సముద్రమట్టమునకు సుమారు 12 వేల అడుగుల ఎత్తున ఉన్నది. ఇచటగల తప్త కుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండములవలన ఇచ్చట సమఉష్ణోగ్రత సంవత్సర మంతయు ఉండును. స్థలపురాణం ప్రకారం విష్ణుభగవానుడు నర నారాయణ అవతారము నందు బదరీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేసినాడు. లక్ష్మీ దేవి ఆయనకు వ్యతిరేక వాతా వరణ పరిస్థితులు తట్టుకొనుటకుగాను బదరి వృక్షము రూపములో ఆశ్రయము కల్పించినది. నారద మహర్షి “ఓం నమో నారాయణాయ” అనబడు అష్టాక్షరీ మంత్రము లేదా జపించి తపస్సు చేసినాడు. మహా విష్ణువు జీవరాశులన్నిటి క్షేమకు కోరి తపస్సు చేయ నారంభించినాడని ప్రతీతి.
యోగధాన్ బద్రి కర్ణ ప్రయాగకు 22 కి.మీ. దూరంలోనూ హనుమాన్ చత్తి మరియు గోవింధ్ ఘాట్ నకు దగ్గరలో పండుకేశ్వర్ గ్రామమునందు కలదు. విష్ణు భగవానుడు ధ్యానము నిమిత్తము ఇచటనివసించి దీనికి యోగధాన్ పండుకేశ్వర్ అని పేరు పెట్టినాడు. ఈ ఆలయము గుప్తుల కాలము నాటిది మరియు సముద్రమట్టమునకు 6000 అడుగుల ఎత్తున ఉన్నది. స్థలపురాణము ప్రకారము వేదవ్యాస మహర్షి శ్రీమధ్ భాగవతమును ఇచ్చటనే రచించినాడు. జగత్ గురు ఆదిశంకరాచార్య ఈ ఆలయములను ప్రపంచవ్యాప్తముగా హిందూమత అభివృద్ధికి అనువైనవిగా ఆమోదించి యున్నారు. శీతాకాలములో ఆలయము మూసివేయు సందర్భమునందు బదరీనాధ్ ఉత్సవమూర్తిని ఈ ఆలయము నందు ఉంచెదరు. ఈ ప్రదేశమునందు ప్రార్ధనలు చేయనిదే యాత్ర సంపూర్ణము అవదని ప్రజలు నమ్ముతారు. స్థల పురాణము ప్రకారము పాండు రాజు తాను సంగమములో నున్న రెండు లేళ్ళను చంపినందువలన కలిగిన పాపమునుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్ధించుటకు తపస్సు చేసినాడు. పాండవులు జన్మించిన పిమ్మట పాండురాజు మరణానంతరము విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహము ఇచట ప్రతిష్టించినారు. మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులను ఓడించిన పిమ్మట ప్రత్యాత్తాపాన్ని ప్రకటించుటకు పాండవులు ఇచటికి వచ్చినారు.
జోషీమఠ్ నకు 17 కి.మీ. దూరములో తపోవన్ నకు దగ్గరగాకల సుభైన్ గ్రామమునదు దట్టమైన ఆటవీప్రాంతములో ఈభవిష్యబద్రి ఉన్నది. భవిష్యత్తులో చెడు ప్రబలి నరనారాయణ పర్వతములు మూసుకు పోయి బదరీనాధ్ మార్గము నిరోధించబడినప్పుడు ఈ భవిష్యబద్రి బద్రినాధ్ గా పరిగణింప బడునని తెలుపబడినది. భవిష్య బద్రి అందమైన మరియు ఆహ్లాదకరమైన దృశ్యములు వీక్షించకలిగిన లోయ మరియు ఆటవీప్రాంతముతో ముఖ్యమైన పర్యాటక ప్రదేశము. సల్హధార్ వరకు రోడ్డు ప్రయాణము చేసి ఆచటినుండి 6 కి.మీ. పర్వతారోహణము తో నరసింహుని విగ్రహము రక్షకుడిగా యున్న బదరీ నారాయణుడు కల ఈ ఆలయము చేరవచ్చును.
వృద్ధబద్రి లేదా బృధబద్రి ఆలయము జోషీమఠ్ నకు 7 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు 13500 అడుగుల ఎత్తులో అనీమత్ వద్దనున్న పురాతన దేవాలయము. స్థలపురాణము ప్రకారము విష్ణు భగవానుడు రూపము వృద్ధ మానవుని రూపములో వెలసినాడు. అందువలన వృద్ధ మానవ రూపములో నున్న విష్ణు భగవానుని భక్తులు సంవత్సర మంతయూ ఈ వృద్ధబద్రి నందు కొలిచేదరు. బద్రీనాథ్ చార్ ధామ్ నందు ఒక పుణ్య క్షేత్రముగా పరిగణింపబదేవరకు విశ్వకర్మచే సృస్థించబడిన ఇచట కల ఈ విగ్రహము అర్చించ బడినది. సంవత్సర కాలమంతయు తెరువబడి యుండేడి వృద్ధబద్రి ఆలయము తీర్ధ యాత్ర చేయుటకు వీలుగా యుండును.
కర్ణప్రయాగకు 17కి.మీ దూరములో పంచబద్రి ఆలయములలో మొదటిది అయిన ఈ ఆదిబద్రి ఆలయము ఉన్నది. శీతా కాలమునందు బదరనాధ్ ఆలయము మూసివేసినప్పుడు విష్ణుభక్తులు ఇచ్చటనే ప్రార్ధన చేసేదరు. ఆది శంకరాచార్య ఏడు ఆలయములతో కూడిన ఆలయ సముదాయము ఇచట ప్రారంభించి నాడని గుప్తరాజుల కాలములో ఈఆలయములు నిర్మించబడినట్లు నమ్మకము. ఈఆలయ సముదాయములో పిరమిడ్ ఆకారము లోని వేదికపై విష్ణు భగవానునికి అంకితం చేయబడిన ప్రధాన ఆలయము నిర్మించిన బడినది. నల్ల రాతితో చెక్క బడిన విష్ణుభగవానుని విగ్రహము చేతులలో కమలము, చక్రము మరియు గద ధరించియుంటుంది. భవిష్యత్తులో బదరీనాధ్ నకు సమాజములో కల ఉన్నతస్థాయి భవిష్యబద్రి నకు కలిగినప్పుడు ఈ ఆలయమును యోగిబద్రి అని పిలిచేదరు.
IPLTOURS – Indian Pilgrim Tours