గంగోత్రి

(IPLTOURS)

ఉత్తరాక్షికి సుమారు 100 కి.మీ.దూరములో గంగానదికి పుట్టుక అయి భాగమతీ నదీ తీరమునందు గంగోత్రి ఆలయమునకు చుట్టూ విస్తరించిన హిందూ యాత్రా పట్టణము గొంగోత్రి. హిమాలయ పర్వత శ్రేణులలోసముద్ర మట్టమునకు 3700 మీటర్ల ఎత్తులో చార్ ధామ్ లలో ముఖ్య మైనదిగాను గంగానదిని దేవతగా కొలుచు ముఖ్యమైన ఆలయము కల ప్రదేశము గంగోత్రి. భగీరధుని ముత్తాత అయిన సాగరమహారాజు అశ్వమేధయాగము చేసి యాగశ్వమును విడువగా ఆ అశ్వముసాగుచుండగా కపిలమహర్షి ఆశ్రమమునందు దానిని కట్టివేసినారు. సాగరమహారాజు కుమారులు ఆశ్రమమునకు వచ్చి కట్టియున్న అశ్వమును విడిపించినారు. ఆ సమయమునందు ధ్యానముద్రనందున్న కపిలమహర్షికి ధ్యాన భంగమువలన కోపముకలిగి సాగరమహారాజు కుమారులు 60000 మందిని తనచూపులతో కాల్చిబూడిద చేసివేసినాడు. అంతేకాక దివినుండి గంగను తీసుకువచ్చి ఆ గంగతో శుద్ధిచేసిన పిమ్మట మాత్రమే వారిఆత్మలకు మోక్షము కలుగునట్లుగా శపించినాడు.

Gangotri Temple Top View

గంగను దివినుండి భువికి తీసుకువచ్చుటకు భగీరధుడు ఘోరతపస్సు చేసినాడు. గంగప్రసన్నురాలై శివుని జటాఝూటమునుండి గంగోత్రి వద్దనే భువికి దిగివచ్చినది. గంగోత్రికి 19 కి.మీ. దూరంలో గల ఒక చిన్న పర్వతసానువువద్ద ప్రారంభమగు ఈనది అసలుపేరు గరుముక్త్. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా ఉద్భవించిన గంగ 18 కి.మీ., దూరం ప్రయాణించి గోముఖం అనేచోట నేల మీదకు దూకుతుంది.

గంగోత్రి దగ్గర గంగానది సుమారు 50 లేక 60 అడుగుల వెడల్పు ఉంటుంది. నిజానికి గంగ మొట్టమొదట నేలమీదకు దిగింది ఈ గంగోత్రి దగ్గరే. కానీ, కలియుగంలో మానవుల పాపం పెరిగిపోయిన కొద్దీ, గంగ కొద్దికొద్దిగా వెనుకకు జరుగుతూ పోతుంటుందని, అలా ఇప్పటికి గోముఖ్ అని పిలవబడే స్థలం వరకూ వెనుకకు వెళ్ళినదని, కలియుగం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా కనిపించకుండా పోతుందని పండితుల మాట. గోముఖం నుంచి గంగోత్రి చేరే వరకూ ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. గంగోత్రి నుంచి తీసుకువెళ్ళిన నీటితోనే రామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం చేస్తారు. నది ఒడ్డున గంగామాత పవిత్ర ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని మొదట అమర్ సింగ్ థాపా అనే నేపాలీ సైనికాధికారి నిర్మిచిన పిమ్మట కొద్ది కాలానికి శిధిలమవ్వగా జైపూర్  సంస్థాన వంశస్థులు వెన్నలాంటి తెల్ల చలువరాయితో నిర్మించారు. ఈ ఆలయములో ఒక మండపం, మూడు గర్భాలయాలు, గంగామాత, యమున, సరస్వతి, లక్ష్మీ, పార్వతి, అన్నపూర్ణల విగ్రహమూర్తులు ఉన్నాయి.