కర్ణ ప్రయాగ

(IPLTOURS)

కేదార్నాధ్ యాత్ర తదుపరి రుద్రప్రయాగనందు విశ్రమించి మరుసటిరోజు బదరీనాధ్ యాత్ర కొన సాగింపుగా కర్ణప్రయాగ బయలుదేరవరచ్చును. రుద్ర ప్రయాగనుండి 33 కి.మీ. దూరములో కర్ణప్రయాగ ఉన్నది.

కర్ణప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రము చామౌళి జిల్లాలోగల ఒకమునిసిఫల్ పట్టణము. ప్రయాగ అనగా రెండు లేదా అంతకంతే ఎక్కువ నదులసంగమం అనగా కలియు చోటు. అలకనందనది తన ప్రవాహప్రాంతములో అయిదుచోట్ల వేర్వేరునదులతో సంగమమవుతాయి ఆసంగమస్థానములే  పంచప్రయాగలు. అలకనందనదితో పిందర్ నది కలియు సంగమప్రాంతము కర్ణప్రయాగ. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చటనే కర్ణునికి మరణానంతరము కర్మకాండలు చేసియున్నాడు. మహాభారత యుద్ధంలో కర్ణుని రధచక్రము భూమిలోనికి క్రుంగిపోయినప్పుడు కర్ణుడు రధముదిగి చక్రము భూమిపైకి తెచ్చుటకు ప్రయత్నించుచుండగా కర్ణుడు ఇంకనూబ్రతికియున్నట్లు కర్ణునికి ఆతని జీవితకాలములో చేసిన దానధర్మములవలన ధర్మధేవత కర్ణునికి మృత్యువురాకుండా కాపాడుచున్నదని తెలిసిన శ్రీకృష్ణుడు ఆవిషయము అర్జునునికి చెప్పి రధముదిగి బ్రాహ్మణరూపములో కర్ణుని వద్దకువచ్చి కర్ణుడు చేసిన దానధర్మములపుణ్యము దానము ఈయవలసినదని కోరగా కర్ణుడు వచ్చినది వాసుదేవుడని గ్రహించి అందుకు అంగీకరించుచూ తనమరణానంతరము తన కర్మకాండ శ్రీకృష్ణుడే స్వయముగా నిర్జనప్రాంతములో చేయవలసినదిగా కోరినాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించినపిమ్మట కర్ణుడు తన పుణ్యఫలమంతా రక్తము రూపములో శ్రీకృష్ణునికి దానము ఇచ్చినాడు. అప్పుడు కర్ణునిని కాపాడుచున్న ధర్మదేవత అదృశ్యమైనది. అర్జునుడు వదలిన బాణమువలన కర్ణుడు పరమపదించినాడు. శ్రీకృష్ణుడు అప్పుడు కర్ణుని ఉత్తర క్రియలు ఈ ప్రదేశములో నిర్వర్తించినాడు.

కర్ణుని ఆలయం

మహాభారతయుద్దములో కర్ణుడు పరమపదించినపిమ్మట కృష్ణునిచే కర్ణుని పార్ధివ     శరీరమునకు ఉత్తరక్రియలు చేసిన ప్రదేశము.

ఉమాదేవి ఆలయం

కర్ణప్రయాగనందు హిమవంతునికుమార్తె అయిన పార్వతీదేవికి నిర్మించబడిన ఆలయము. ఈఆలయమునందు పార్వతీదేవిమూర్తి స్వయంభూగా కొన్ని వందల సంవత్సరములపూర్వము వెలసిన విగ్రహము. ఈఆలయము అలకనంద మరియు పింధర్ నదుల సంగమప్రాంతము వద్దనున్నది. ఈఆలయము 20 వ శతాబ్దమునందు ప్రాచుర్యములోనికి వచ్చినది.