జోషిమఠ్
(IPLTOURS)
(IPLTOURS)
విష్ణుప్రయాగ నివాసిత గ్రామము కాదు కానీ ఇచ్ఛటికి 12 కి.మీ. దూరములో బదరీనాథ్ మార్గములో జోషీమఠ్ ఉన్నది. చామౌళి జిల్లాలో జోషీమట్ ఒక మునిసిఫల్ పట్టణము. జోషీమఠ్ సముద్రమట్టమునకు 9150 అడుగుల ఎత్తున ఉన్నది. అనేకమైన హిమాలయ శిఖరముల అదిరోహణ మరియు సాహసయాత్రలకు నదీవిహారాలకు మరియు బదరీనాధ్ తదితర పుణ్య క్షేత్రముల దర్శనమునకు ముఖః ద్వారమై యున్నది. జోషీమఠ్ ను జ్యోతిర్మత్ అనికూడా పిలిచేదరు. ఇది జగద్గురు ఆది శంకరాచార్యులువారిచే 8వ శతాబ్దములో భారతావనిలో స్థాపితమైన సుమారు 90 మఠములలో ముఖ్యమైన నాలుగు మఠములలో ఒకటి. ఈ జోషీమఠ్ మఠములో 1200 ఏండ్లు వయసుగల కల్పవృక్షము మిగిలిన మఠములలో వలెనే ఉన్నది.
ఇచట ఇతర క్షేత్రములలోవలెనే విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడు, హనుమంతుడు, గౌరీశంకర్, గణేశుడు, నందాదేవి మరియు సూర్యుని ఆలయములు ఉన్నాయి. జోషీమఠ్ చార్ ధామ్యాత్రనందు ఒక వసతి స్థానముగా రూపొందినది. శీతా కాలమునందు బదరీనాధ్ ఆలయము మూసివేయు సందర్భములో బదరీనాథ్ భగవాన్ విగ్రహము జోషీమఠ్ తీసుకువచ్చి ఇచటగల వాసుదేవుని ఆలయమందు ఉంచెదరు. మంచువర్షము చూడవలేనను కోరికకలిగిన యాత్రికులు శీతాకాలమునందు జోషీమట్ దర్శించవచ్చును. మరియు నౌకావిహారమునకు ప్రకృతిసౌందర్యము దర్శించువారికి వేసవికాలమునందు జోషీమట్ దర్శించవచ్చును.
జోషీమఠ్నందు కల నరసింహ ఆలయం నరసింహ బద్రి అనబడు సప్తబద్రీ ఆలయములలో ఒకటి మరియు ముఖ్యమైన ఆలయం. ఇచట పూజింపబడు నరసింహుడు విష్ణుమూర్తి అవతారములలో నాలుగవది మరియు సగభాగము సింహరూపములోనూ సగభాగము మనిషి రూపములోనూ ఉండును. బదరీనాథ్ ఆలయమూర్తి సీతాకాలమునందు ఆలయము మూసివేసినప్పుడు ఇచ్చటికి తీసుకు వచ్చేదరు.
జోషీమఠ్నందలి భవిష్య కేదార్ ఆలయం శివునికి పార్వతి కొలువబడు ఒక చిన్న ఆలయం. ఇది భవిష్యత్తులో కేదార్నాథ్ లోని కేదారేశ్వరునికి నివాసమని భావించబడుచున్నది. ఈ ఆలయమునందు ఒక చిన్న శివలింగము మరియు చిన్న పార్వతిపఠము మాత్రమే యుండును. భవిష్యత్తులో హిమాలయములందు సంభవించు భూకంపమునందు బదరీ కేదార్నాధ్ నందలి బదరీ నకు మార్గము నిరోధించబడినప్పుడు బదరీ భగవానుని భవిష్య కేదార్ నకు తీసుకు వచ్చేదరని భావించబడుచున్నది.
వేదములు, ఉపనిషత్తులు మరియు బ్రహ్మ సూత్రమునందు నిర్వచించబడిన ధర్మ మార్గ ప్రాముఖ్యతను ప్రభోధించుటకు జగద్గురు ఆది శంకరాచార్యులుచే స్తాపించపడిన నాలుగు మఠములలో ఒకటి జోషీమఠ్నందున్నది. బదరినారాయణ్ మరియు రాజేశ్వరీదేవి విగ్రహములు ఈ మఠం నందు అంతర్భాగములో గల లక్ష్మీనారాయణుని ఆలయమందు అందముగా ప్రతిషించబడినవి.
జోషీమఠ్ నకు 20 కి.మీ. దూరములో గల నందాదేవి పర్వత శిఖరము చుట్టూ నందాదేవి జాతీయ పార్కు విస్తరించి యున్నది. ఈ పార్కు నందా దేవి పేరు మీదుగా ప్రాచుర్యము చెంది అనేక జంతువులకు నివాసముగా యున్నది. మరియు ఇచట హిమాలయ పర్వత శిఖరాగ్రములు ఒక రింగు(వృత్తము) వలె గోచరించును.
జోషీమఠ్ నకు 46 కి.మీ.దూరములో గల ఈ సరస్సు కాకులు చేరకుండా శపించ బడినది. ఈ సరస్సు పై ఎగురు కాకులు చనిపోవు నట్లుగా చెప్పేదరు. ఈ సరస్సు చుట్టూ అనేక కాకుల కలేబరములు చూడవచ్చును.
జోషీమఠ్ నకు 20 కిలో మీటర్ల దూరములో హేమాలయములలోని పడమర బాగమున ఈ వాలీ ఆఫ్ ఫ్లవర్ జాతీయ పార్కు ఉన్నది. ఇక్కడ అనేకముగా విస్తరించిన alpine పూవులు మరియు అనేక రకములైన fauna పుస్పములు కనిపించును. ఇది అరుదుగా కనిపించు జంతువులు ఆసియా నల్ల ఎలుగుబంటి, మంచుచిరుత, లేళ్ళు మొదలగువాటికి నివాసము.
IPLTOURS – Indian Pilgrim Tours