విష్ణు ప్రయాగ

(IPLTOURS)

నందప్రయాగ నుండి 71 కి.మీ. దూరములో నున్న విష్ణుప్రయాగ ఉన్నది. బదరీనాధ్ నుండి అలకనందవివిధ ఉపనదులతో కలియు సంగమప్రదేశములు వరుసగా విష్ణుప్రయాగ, నంద ప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ మరియు దేవప్రయాగ ఒక వరుసక్రమములో నున్నవి. విష్ణు ప్రయాగ లేదా కృష్ణ ప్రయాగ బదరీనాధ్ నుండి మొదటి సంగమస్థానము. ఇది నంద ప్రయాగకు 71 కి.మీ. దూరములో ఉన్నది.ఈ సంగమ ప్రదేశములో అలకనందనదితో ధౌలిగంగానది కలుస్తుంది. అలకనంద సముద్రమట్టమునకు 4402 అడుగుల ఎత్తున కల సతోపంత్ అను ముక్కోణపు సరస్సు పాదభాగమునుండి ఉధ్బవించియున్నది. అలాకనంద త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పేరుమీద నందాదేవి శిఖరమువద్ద భగీరధ ఖారక్ నుండి జన్మించి 229 కి.మీ. అయిదుప్రయాగలద్వారా ప్రవహించి దేవప్రయాగవద్ద భగీరధి నదితో కలసి గంగానదిగా పరివర్తన చెంది దక్షణ దిక్కుగా ఋషీకేశ్  హరిద్వార్ ద్వారా వారణాశి వైపు ప్రవహించుచున్నది.

Vishnu-Prayag-Sangam-near-Joshimath

విష్ణుప్రయాగ నివాసిత గ్రామము కాదు కానీ ఇచ్ఛటికి 12 కి.మీ. దూరములో బదరీనాథ్ మార్గములో జోషీమట్ ఉన్నది. నంద ప్రయాగ వలెనే విష్ణు ప్రయాగనందుకూడా యాత్రికులు సంగమప్రాంతము సందర్శించి వసతి సౌకర్యములు లభ్యమగు జోషీమఠ్ చేరవలయును.