దేవ ప్రయాగ

(IPLTOURS)

రిషికేశ్ నుండి దేవ ప్రయాగకు దూరం 68 కి.మీ. దూరంలో ఉన్నది. ప్రయాగ అనగా వాడుక భాషలో కలియు స్థలము లేదా సంగమం. పంచ ప్రయాగలలో ప్రతి ప్రయాగనందు గంగా నడితో ఒక్కొక్క ఉప నది కలసి అది ఋషీకేష్ వచ్చుసరికి గంగా నది పూర్తి స్థోమత కలిగి కొంచెము ఇంచుమించుగా ఋషీకేశ్ మరియు హరిద్వార్ లలో ఉగ్ర రూపముగా యుండి వారణాశి వచ్చు సరికి శాంతించి ప్రవాహము సాఫీగా ఉండును. ఋషీకేశ్ నుండి ప్రయాణములో ఒక ప్రక్క ఎత్తైన పర్వతములు ఒక ప్రక్క గంగానది ప్రవహించుచూ నదిపై నుండి వచ్చు చల్లటి గాలులు ఆస్వాదించుచూ చేయుటవలన ప్రయాణము మిక్కికి ఆహ్లాదకరముగా యుండి మనము ఈ పట్టణ ప్రాంతములో గల కాలుష్యమునుండి కొద్ది రోజులైనాను ప్రశాంతముగా ఉండవచ్చును.

దేవ ప్రయాగ ఉత్తరాఖండ్ రాస్త్రములో గెహర్వాల్ జిల్లా నందు కల ఒక చిన్న పట్టణము. దేవప్రయాగ అలకనంద మరియు భాగీరధి నదులు కలియు పుణ్య క్షేత్రము దేవశర్మ అను ఋషి పేరుదేవ ప్రయాగ కు వచ్చినది. హిమాలయములలో గల అయిరు పుణ్య నదీ సంగమ ప్రదేశములందు దేవ ప్రయాగ ఒకటి. అలకానంద మరియు భాగమతి నదుల సంగమ ప్రదేశము దేవప్రయాగ. బదరీనాధ్స మీపమునందు మాన గ్రామము నుండి బయలు దేరిన  సరస్వతి కూడా ఈ సంగమములో కలియును. ఈ నది రఘునాధ్ దేముని పాదముల చెంతనుండి ఉద్భవించినది. దేవప్రయాగ బదరీనాధ్ పూజారుల నివాస స్థలము. వీరిని పండాలు అని అందురు. 8వ శతాబ్ధామునందు దక్షణాది నుండి వచ్చిన ఆది గురు శంకరాచార్యులతో వచ్చిన దక్షణాది బ్రాహ్మణులు వచ్చి యున్నారు. అప్పటినుండి బద్ధరీనాధ్ ధాం మరియు ఇతర పుణ్య ప్రదేశములకు వచ్చిన బ్రాహ్మణులను పండాలు అని వ్యవహరించు చున్నారు. గార్హ్ వాల్ మహారాజు వీర్కి దేవ ప్రయాగ లోని రఘునాధ మందిరములో స్వామిని అర్చించు భాధ్యత వప్పగించినారు. 

Devprayaga-uttarkhand-india

రఘునాధ దేవాలయం

దేవప్రయాగనందు విష్ణు భగవానునకు రఘునాధ మందిరం/ఆలయం ఉన్నది. ఇది ఋషేకేష్ నుండి బదరీనాధ్ పోవు హైవే రూడుపై నున్నది. ఇది విష్ణు భగవానునికి చెందిన 108 దివ్య దేశములలో ఒకటి. ఇచట రఘునాధుని పేర విష్ణు భగవానుడు భార్య లక్ష్మి సీతాపేరిట కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఆది శంకరాచార్యులువారిచే  8 వ శతాబ్దములో స్థాపించ బడినది. అలాకానంద భాగమతి నదుల సంగమ ప్రదేశమునకు ఎగువ భాగమున మొండపై నిర్మించబడినది. రఘునాధుడు రావణుని వధించినందువలన కలిగిన శాపమునుండి విముక్తికొరకు స్వయం శ్క్ష అనుభవించిన ప్రదేశము. ఉత్తరాఖండ్ ప్రభుత్వమువారి ఉత్తరాఖండ్ టూరిజం కార్పొరేషను వారిచే ఈ అలయము నిర్వహించబడుచున్నది.

Raghunathji-Temple-devaprayag

చంద్రబాదాని ఆలయం 

చంద్రబాదాని ఆలయం శివుని భార్య సతీదేవి యొక్క torso (మొండెం) పడిన ప్రదేశము. ఆమె యొక్క ఆయుధములు మరియు త్రిశూలములు ఆలయము లోపల బయట చెల్లా చెదురుగా పాత రూపములలో కనపదును. ఇచ్చటినుండి సిరికాండ, కేదానాధ్ మరియు బదరీనాధ్ శిఖరాగ్రములు చూడవచ్చును.

chandrabandi Devi-devaprayag

 దశరధ శిల

ఇచట రాముని తండ్రి దశరధుడు స్వయముగా శిక్ష అనుభవించిన ప్రదేశము. దశరధుని కుమార్తె శాంత పేరిట ఇచట చిన్న నీటి ప్రవాహమున్నది.

ఇవి కాక బైటల్ కుండ్, బ్రహ్మ కుండ్, సూర్య కుండ్, వశీస్థ కుండ్, బైటల్ శిల మొదలైన ఇతర ఆలయములు ఉన్నవి. బైటల్ శిల తాకిన కుస్టురోగ నివారణ చేయునని తెలిపేదరు. దేవప్రయాగనందు ఆలయ సందర్శనము పిమ్మట ఆచటికి 75 కి.మీ. దూరమునందు గల రుద్రప్రయాగకు ప్రయాణము చేయవలయును.