సంగమేశ్వర ఆలయం

(IPLTOURS)

శ్రీశైల పుణ్యక్షేత్రమునకు వాయువ్యద్వారముగా కర్నూలుజిల్లానందు కృష్ణ, వేణి, తుంగబద్ర, భీంరాధి, మలపాహిని, సంగమేశ్వర మరియు భవనాశనిఅను ఏడునదులు కలియు సంగమప్రదేశములో నీటిలో మునిగిఉండి అరుదుగా దర్శనమిచ్చు పవిత్రఆలయం  సంగమేశ్వరఆలయం. సంవత్సరంలో ఎక్కువకాలం కృష్ణానదిలోమునిగి ఉండుటవలన కొద్దినెలలుమాత్రం ప్రయాసతో చేరవచ్చును. భక్తులు ఆవిధముగానే ఆలయము సందర్శిస్తారు. శ్రేశైలం జలాశమునకు వరదతాకిడి తగ్గినప్పుడు మాత్రమేకనిపించు సంగమేశ్వర ఆలయం కర్నూలుజిల్లాలో కొత్తపల్లి మండలంనందు ఆత్మకూరుపట్టణానికి సుమారు 20 కి.మీటర్ల దూరంలో ముచ్చుమర్రిగ్రామం వద్దనున్న చారిత్రకఆలయం. ఈపవిత్రక్షేత్రం ఏడునదులు కలియు సంగమప్రదేశం ఆగుటవలన ఈదివ్యక్షేత్రము సంగమేశ్వరమని ప్రసిద్ధిచెందింది. సంవత్సరములో ఎనిమిదినెలలు నీటిలోఉండి కేవలం నాలుగునెలలు భక్తులకు దర్శనభాగ్యంకలిగించు ఆలయం. వేలసంవత్సరాల చరిత్రకలిగి ఎందరో మునులతపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్రస్థలం. 

Sangameshwara Swamy Temple

తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలప్రభ, భవనాసి అను ఏడునదులందు భవనాసినది మాత్రమే పురుషుడి పేరుకలిగినది. భవనాసి తూర్పునుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిననదులు పశ్చిమంనుంచి తూర్పుకు ప్రవహించి అన్నికలసి ద్వాదశజ్యోతిర్లింగములలో రెండవజ్యోతిర్లింగమైన మల్లిఖార్జున జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠములలో ఆరవశక్తిపీఠమైన బ్రమరాంబికదేవి శక్తిపీఠం ఉన్న శ్రీశైల పుణ్యక్షేత్రాన్నితాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. నీటిప్రవాహంలోనే అర్చకులు ఆలయంచేరి స్వామికి పూజలు చేస్తారు. జలాశయమునకు పూర్తిస్తాయి నీరువచ్చినప్పుడు మాత్రం ఆలయం ప్రతిసంవత్సరము మునిగిపోతుంది. సుమారు పన్నెండువందల సంవత్సరములకు పూర్వం చాళుక్యులు తుంగబద్ర నదీతీరమున అలంపురంనందు  అష్టాదశశక్తి పీఠములలో 5వ శక్తిపీఠము జోగులాంబదేవి మరియు నవబ్రహ్మఆలయ సముదాయం నిర్మించారు. నిర్మాణం నిమిత్తము బండ్లపైరాళ్ళు తరలించునపుడు బండ్లు సులువుగా నీటిలోనడచుటకు బండిచక్రములలో వేసినకందెనలు (నూనె) తయారుకు ఇచట ఒకగ్రామము వెలిసింది ఆగ్రామము కందెనవోలుగాను కాలక్రమేణా కర్నూలుగా రూపాంతరము చెందింది.

ప్రస్తుతము కర్ణాటకరాష్ట్రములోనున్న బాదామిరాజధానిగా పాలనచేసిన చాళుక్యులకాలంనాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. కానీ చాళుక్యులు మాత్రము హిందూమతం అవలంభించారు. బాదామిలో బౌద్ధ, జైన ఆలయాలాలతోపాటు ఎన్నోఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. ఈరాజులు తమపట్టాభిషేకాలు కృష్ణానది ఉపనది మలప్రభఒడ్డున నిర్వహించేవారు. ఇక్కడ పాపనాధ, గులాకానాధ, సంగమేశ్వర ఆలయాలతోపాటుగా అనేకఆలయాలు నిర్మించారు. వీరు మలప్రభ కృష్ణతో కలియు ‘కూడలి’ లో సంగమేశ్వరాలయం నిర్మించారు. వీరిఏలుబడిలోని మహబూబ్ నగర్, కర్నూలుజిల్లాల భూభాగంలో శిధిలాలయాలను పునర్నిర్మించారు. సంగమేశ్వరాలయములో పదిఆడుగుల ఎత్తైన వేదికచుట్టూ ఏనుగుతల ఆకృతిశిల్పాలతో నిర్మించారు. ఆలయ ద్వారంప్రక్కగా శంఖనిధి, పద్మనిధివిగ్రహాలు, గంగ, యమున, అర్ధనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్టదిక్పాలకుల విగ్రహాలెకాక, ఎన్నోలతలను, హంసలను చేక్కారు. మొసలి పట్టుకున్న మనిషిముఖంలో మూడువైపులనుండి బాల్య, యౌవన,వృద్ధాప్యదశలు ప్రతిభింబించేలా చెక్కినశిల్పం మిక్కిలిరమ్యంగా ఉంటుంది. సంగమేశ్వరాలయం నిర్మాణంపిమ్మట తుంగబద్రనది ఉత్తరవాహిని ప్రాంతంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబక్షేత్రం వుండటం వల్ల, జమదగ్నిఆశ్రమప్రాంతలో అలంపురంనందు నవబ్రహ్మాఆలయాల సముదాయాన్ని నిర్మించారు. ఎల్లోరాగుహల్లో కొండనుతొలిచి కైలాశనాధ ఆలయాన్ని నిర్మించారు.                                      

ఈపుణ్యక్షేత్రం ఆవిర్భావంపై విభిన్నకధనములు ఉన్నవి. ఒకకధనం ప్రకారం అహోబిలం కొండల్లో పుట్టిన ఏడవనది భవనాశిని కృష్ణలో కలియు సంగమప్రదేశం సప్తనదీ సంగమంగా క్షేత్రం సప్తనది సంగమేశ్వరంగా ప్రసిద్ధి. ప్రజల పాపప్రక్షాళనచేయు గంగానదికి జనుల పాపములవలన కాకిరూపురాగా, సంగమప్రదేశంనందు స్నానంచేసి హంసగా మారిందని, జనులవలన ఆమెకుకలిగిన పాపములు నివృత్తికాబడినందున క్షేత్రమునకు నివృత్తి సంగమేశ్వరమని పేరొచ్చిందని స్థానికకథనం.పూర్వం ఈప్రాంతంలో దక్షయజ్ఞం జరిగినదని,  ఆసమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలోపడి మరణించిందని స్థలపురాణం చెబుతోంది. సతీదేవి శరీరనివృత్తి జరిగినప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది అణిమరియొక కధనం ప్రాచుర్యంలో ఉన్నది.  ప్రాచుర్యంలోఉన్న మరియొక కధనం ప్రకారం సంగమేశ్వరఆలయం మహాభారత కాలంనాటిది. తమరాజ్యము కౌరవులవలన పోగొట్టు కొనిన పిమ్మట పాండవులు బహిష్కరణకు గురికాబడి, ఆరణ్యవాససమయంలో నల్లమల ఆటవీప్రాంతము విస్తరించియున్న ప్రస్తుత కర్నూలు పరిసరములలో కొంతకాలము నివశించవలెనని తలచారు. పాండవాగ్రజుడైన యుధిష్టరుడు ఆతని సోదరుడైన భీముని కాశీనుండి శివలింగముతెమ్మని ఆదేశించాడు. భీముడు ప్రతిష్ఠ సమయానికి రాకపోవుటవలన ధర్మరాజు ఋషుల సూచనమేరకు వేపమొద్దును శివలింగంగామలిచి అయిదు ఉపనదులతోపాటుగా కృష్ణ మరియు తుంగబధ్రనదుల సంగమ ప్రదేశం నందు శుద్ధిచేసి ప్రతిష్ఠించి పూజలుచేశాడు. ఏడునదుల సంగమప్రదేశమునందు స్థాపించినందున ఈక్షేత్రము సంగమేశ్వరమని పిలువబడుచున్నది. అందుకు ఆగ్రహంచెందిన భీముడు తానుతెచ్చిన శివలింగాన్ని నదిలోవిసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతనుతెచ్చిన శివలింగాన్నినదీతీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

కోస్తాతీరప్రాంతంలో గుంటూరుజిల్లాలో అమరావతినందు అమరేశ్వరుడు, పశ్చిమగోదావరిజిల్లా భీమవరమునందు సోమేశ్వరుడు, పాలకొల్లునందు క్షీరారామలింగేశ్వరుడు, తూర్పుగోదావళిజిల్లాలో ద్రాక్షారామనందు భీమేశ్వరుడు మరియు సామర్లకోటనందు కుమారభీమేశ్వరుడుఅను పంచారామ క్షేత్రములు ఉండగా, ఇచట మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ భీముడుతెచ్చిన శివలింగాలతో వెలిశాయని మరొకకథనం. సంగమేశ్వరఆలయం ప్రారంభంలో నదిఒడ్డున ఉండేది. శ్రీశైలండ్యామ్ నిర్మాణంతరువాత ఆలయం ఇరవైసంవత్సరములు నీటిలోనే మునిగిపోయింది. ఆలయవిషయాన్ని ప్రజలుకూడా మర్చిపోయారు. 

శ్రీశైలజలాశయం నిర్మించినపిమ్మట సంగమేశ్వర, అలంపురరం ఆలయాలన్నీ ముంపుకుగురయ్యే ప్రమాదంఏర్పడే పరిస్థితిరాగా, పురాతత్వశాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరుప్రాంతాలలో పునర్నిర్మించారు. సంగమేశ్వరమరియు పాపనాశన ఆలయాలను అలంపురం మార్గములో పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవబ్రహ్మాల ఆలయాలకు కృష్ణానదికి అడ్డుగా ఒకపెద్దగోడ నిర్మించారు. మరియొక సంగమేశ్వరాలయాన్ని కర్నూలువద్ద జగన్నాధగట్టుపై నిర్మించారు. పల్లవసాంప్రదాయంలో నిర్మితమైన రథంకూడా ఇచ్ఛటికి తరలించారు. భుజంగేశ్వరాలయాన్ని నందికొట్కూరువద్ద నిర్మించి త్రివేణి సంగమశిల్పం మాత్రం హైదరాబాద్ లోని పురాతత్వశాఖవారి ఆధీనంలో పబ్లిక్ గార్డెన్స్ నందుఉంచినారు. ప్రధానఆలయమైన నివృత్తి సంగమేశ్వరాలయం ఇప్పటికినీ నీటిలోమునిగిఉంది. ప్రతిసంవత్సరము వేసవికాలమందు శ్రీశైలంజలాశయంలో నీటిమట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపించు మార్చి, ఏప్రిల్, మే మరియు జూన్ మాసములలో భక్తులు ఆలయానికివెళ్లి పూజలు జరుపుతారు. ఆలయాలను కర్నూలునందు బసచేసి  దర్శించవచ్చును. 

ఒకప్పుడు ఉన్నతస్థితిలోఉన్న సంగమేశ్వరఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాలకు పూర్వము స్ధానికప్రజలు నిర్మించారు. ఆలయంచుట్టూ ప్రాకారశిథిలాలనుచూస్తే గతంలో అతిపెద్ద విస్తీర్ణంలో నిర్మించినట్లు అర్ధమవుతుంది. ప్రాకారానికి ఉత్తరముగా గోపురద్వారం, పశ్చిమ దక్షిణద్వారాలపై నిర్మింపబడిన మండపాలు నీటిలో మునిగిపోవుటవల్ల శిధిలమైనవి. ప్రస్తుతంకనిపించే ప్రధానఆలయం సాధారణముగా ఉండి ముఖమండపం శిథిలమై, అంతరాలయం, గర్భాలయాలు మాత్రం కనపడతాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజింపబడున్నాడు. సంగమేశ్వరునివెనుక ఎడమభాగంలో శ్రీలలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. పూర్వపు ఆలయాలు శిథిలమైపోవడంతో మూర్తులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం ఎక్కువరోజులు శ్రీశైలంప్రాజెక్టు నీటిలో మునిగివుండటం వలన నిత్యపూజలు జరుగవు. సంగమేశ్వరాలయంలో వేల సంవత్సరమలకు పూర్వం ప్రతిష్ఠించిన వేపలింగం సంవత్సరములో సుమారు 8 నెలలు నీటిలోమునిగి ఉన్ననూ ఇప్పటికీ చెక్కుచెదరక ఉండటం సంగమేశ్వరుని మహత్తుకదా. సంగమేశ్వర ఆలయము వద్ద కృష్ణానదీ తీరమున కొండపైనున్న విశ్వామిత్రగుహ నందు త్రేతాయుగములో విశ్వామిత్ర మహర్షి తపస్సుచేసినప్పుడు గోమాతరూపములో గాయత్రీదేవి దర్శనం ఇచ్చినట్లు ఆమెపాదముద్ర ప్రస్తుతము కనపడగా ఆపాదముద్రకు పూజచెయుచున్నారు.

కర్నూలునుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరునుంచి 20 కిలోమీటర్ల దూరంలోవున్న ఈక్షేత్రానికి వివిధ మార్గాలద్వారా  చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలోవున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సులద్వారా చేరుకుని, అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలోవున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలుజిల్లా ఆత్మకూరునుంచి కపిలేశ్వరము బస్సులోచేరుకుని అక్కడినుంచి 5 కిలోమీటర్ల దూరంలోవున్న ఈక్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏదారిలోనైనా సరాసరి ఆలయంవరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రినాటికి ఈక్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిలవరకు బస్సులోప్రయాణించి అక్కడినుంచి బోటుద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

IPLTOURS Indian Pilgrim Tours