కుమారారామం

(IPLTOURS)

కుమారస్వామి (కార్తికేయడు) రుద్రగణములకు నాయకత్వంవహించి తారకాసురుడితో యుద్ధం చేసినాడు. ఆయుద్ధము నందు కుమారస్వామి వదలినబాణంవలన తారకాసురుడు మెడలొధరించిన ఆత్మలింగము అయిదు శకలములుగా భూమిపై అయిదుచోట్లపడి పంచారామక్షేత్రములుగా అవతరించాయి. ఆఅయిదు క్షేత్రములలోనూ తూర్పుగోదావరిజిల్లా సామర్లకోటనందున్న ఒకటి కుమారరామక్షేత్రము. ఈక్షేత్రము సామర్లకోట రైల్వేస్టేషను నుండి సుమారు 1కి.మీ దూరములో నున్నది. పురాణములందు ఈపవిత్ర ప్రదేశమును యోగక్షేత్రముగా పేర్కొనినారు. అనగా ఈపవిత్రక్షేత్రమును దర్శించుకొను యోగము ఉన్నట్లయిన దర్శించుకొనగలము. 

పురాణ కధప్రకారము భూమిమీద పడిన ఆత్మలింగాశకలాలు కైలాసాన్నిచేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయిఅని, అవిపెరిగి కైలాసం చేరుకున్నకలియుగంలో మానవులకు పూజించుటకు స్వామిదర్శనం ఉండదని ఆత్మలింగాశకలాలు ఎదగకుండా ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు మరియు కార్తికేయునిచేత ప్రతిష్టించబడి అభిషేక మరియు అర్చనలు చేయబడినవి. ఈఆలయములందు శివుడు స్వయంభూః ఆగుటవలన, ఆలయములు దేవతలైన ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామిచే (కార్తికేయునిచే) నిర్మించబడి యుండుటవలన ఈఆలయములు దేవతలచే నిర్మించబడిన స్వయంభూః ఆలయములు. ఈఆలయములు దర్శించిన ఒకరాత్రిలో నిర్మించినట్లు అట్లునిర్మించుట మానవమాత్రులకు సాధ్యముకాదు అన్నది సుస్పస్టమగుతుంది. అమరావతినందు అమరలింగేశ్వరుడు బాలచాముండితో, భీమవరం సోమేశ్వరస్వామి శ్రీరాజరాజేశ్వరితో, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు పార్వతితో, ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశ శక్తి పీఠమైన మాణిక్యాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు బాలాత్రిపురసుందరితోను భక్తులను అనుగ్రహించుచున్నారు.     

కుమారస్వామి ప్రతిస్టితము ఆగుటవలన కుమారరభీమేశ్వరునిగా స్వామి ప్రసిద్దిచెందినాడు. సున్నపురాయి శివలింగము ఈక్షేత్రమునందు ప్రతిస్టించబడినది. క్రిందిఅంతస్తులో పీఠంపై నున్న 16 అడుగుల పొడవైన శివలింగము పైకిఎదుగుచూ మొదటిఅంతస్తు దాటి రెండవ అంతస్తులోనికి ప్రవేశించినది. ఇచ్చటనే శివలింగమునకు రుద్రాభిషేకము చేయదురు. ఆలయ మండపము నూరుస్తంభములు మరియుఅందమైన శిల్పాకృతులతో నిర్మితమైనది. ఆలయ ప్రవేశద్వారమువద్ద ఏకశిలతో చెక్కబడిన నంది శివలింగమునకు రక్షగాయున్నది. ఈఆలయము భీమేశ్వరఆలయముగా పిలువబడు మరియొక పంచారామ క్షేత్రము అయిన ద్రాక్షారామఆలయమును పోలి ఉంటుంది. తూర్పువైపుకల మండపమునుండి తూర్పువైపు కనపడు పుష్కరిణిఅను కోనేరుకలదు. సుమారు వేయి సంవత్సరములకు పూర్వము నిర్మితమైన ఈఆలయమునందు శివలింగము సున్నపురాయితో తయారుకాబడుటవలన లింగముతెల్లగా కనిపించును. ఇచట పార్వతి అమ్మవారు బాలాత్రిపురసుందరిగా ప్రసిద్ధము.                                                                                                                                  

Sri Chalukya Kumararama Bhimeswara Swamy Temple

పంచారామక్షేత్ర శివలింగములన్నిటిలోనూ కుమారభీమేశ్వర శివలింగం అత్యంతపొడవు అయినది. ఆకారణముగానే ఈశివలింగమునకు మూడవ అంతస్తులో అభిషేకములు జరుపబడును. ఆలయనిర్మాణము సుమారు 9వ శతాబ్దమునందు వంద సంవత్సరములపాటు నిర్మాణము జరిగియున్నది. నవంబరు డిసెంబరు మాసములలో అనగా కార్తీకము మరియు మార్గశిరమాసములలో ప్రతిరోజూ అభిషేకములు చేయుదురు. ఫిబ్రవరి మార్చినెలలలోవచ్చు మాఘబహుళ ఏకాదశినాడు కళ్యాణమహోత్సవము జరిపేదరు. మహాశివరాత్రి అత్యంత వైభవముగా నిర్వహించేదరు.         

శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయ సమయాలు & కుమారరామం చేరుకోవడం ఎలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ వారు కాకినాడ బస్సు డిపోనుండి అయిదు పంచారామక్షేత్రములు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ మరియు సామర్లకోట) యాత్ర 24 గంటలలో పూర్తి అగునట్లు కార్తీకమాసములోనూ మరియు శివరాత్రి పర్వదినము రోజున సర్క్యులర్ టూర్లూ ఏర్పాటు చేయుడురు. యాత్ర రాత్రి 8 గం లకు ప్రారంభమై సుమారు 700 కి.మీ ప్రయాణించి మరుసటిరోజు సాయంత్రం సుమారు 7 గం లకు ముగుస్తుంది

ఆలయము ఉదయం 7నుండి 12వరకు మరలా సాయంత్రం 4 నుండి 8 వరకు తెరచి ఉంటుంది.