అమరారామం
(IPLTOURS)
అమరారామముగా పిలువబడు అమరలింగేశ్వరస్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్రా ష్ట్రములో గుంటూరుజిల్లా అమరావతి నందు నెలకొనిఉన్నది. పురాణముల ప్రకారము కుమారస్వామి (కార్తికేయుడు) తారకాసురుని వధించుటకు ముందుగా ఆతనికి రక్షాగాఉన్న మెడలోని శివలింగమును ఆగ్నేయాస్త్రముప్రయోగించి అయిదుముక్కలు (శకలములు) చేసినప్పుడు అందులో ప్రధమ శకలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధానిగానున్న అమరావతినందు పడినది.
పురాణకధ ప్రకారము భూమిమీద పడిన ఆత్మలింగాశకలాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించాయిఅని, అవిపెరిగి కైలాసం చేరుకున్నకలియుగంలో మానవులకు పూజించుటకు స్వామి దర్శనం ఉండదని ఆత్మలింగాశకలాలకు అవి ఎదిగిపోకుండా ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు మరియు కార్తికేయునిచేత ప్రతిష్టించబడి అభిషేక మరియు అర్చనలుచేయబడినవి. ఈఆలయములందు శివుడు స్వయంభూః ఆగుటవలన, ఆలయములు ఇంద్ర, సూర్య, చంద్ర, విష్ణు మరియు కుమారస్వామిచే (కార్తికేయునిచే) నిర్మించబడి యుండుటవలన ఈఆలయములు దేవతలచే నిర్మించబడిన స్వయంభూః ఆలయములు.
ఈఆలయములు దర్శించిన ఆలయములను ఒకెరోజురాత్రి నిర్మించినట్లు అట్లునిర్మించుట మానవమాత్రులకు సాధ్యముకాదుఅన్నది సుస్పస్టమగుతుంది. అమరావతినందు అమరలింగేశ్వరుడు బాలచాముండితో, భీమవరం సోమేశ్వరస్వామి శ్రీరాజరాజేశ్వరితో, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరుడు పార్వతితో, ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్టాదశశక్తిపీఠమైన మాణిక్యాంబతో మరియు సామర్లకోట కుమారభీమేశ్వరుడు బాలాత్రిపురసుందరితోను భక్తులను అనుగ్రహించుచున్నారు.
అమరావతి పూర్వనామము “ధాన్యకటకం”. కృష్ణానదిఒడ్డునకల ఈపవిత్ర ప్రదేశము చాలా మహిమాన్వితమైనది. దేవేంద్రుడు అమరేశ్వరలింగమును ఇంచట ప్రతిస్టించినాడు. ఇంద్రుడు అమరుడు. అందువలననే శివుడు ఇచట అమరేశ్వరునిగా ఖ్యాతి కాంచినాడు. స్కంద, బ్రహ్మ, పద్మ పురాణములందు ఈఆలయము ప్రాముఖ్యత తెలుపబడినది. ఈఆలయమునందుకల ప్రత్యేకతలలో నాలుగు దిక్కులందు ధ్వజస్తంభములు, ఆలయమండపము దక్షణదిక్కుగా ఉండుట, కృష్ణవేణినది తూర్పువైపు గేటుకు ఎదురుగ ప్రవహించుట చెప్పుకోతగినవి. ఈక్షేత్రమును పంచాయతనక్షేత్రము అనికూడా అందురు. ఇచట క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పన్నెండు అడుగుల శివలింగములో క్రింది అంతస్తునందు మూడు అడుగులు మొదటి అంతస్తులో తొమ్మిది అడుగులు దర్శనము ఇచ్చును. ఇంద్రుడు అమరేశ్వరుని స్థాపించి పూజించి నమొదటి భక్తుడు. అమరేశ్వరలింగం స్తాపన జరిగినపిమ్మట ఆకాశమువైపుకు పెరుగుచుండగా ఇంద్రుడులింగము పైభాగమున మేకుకొట్టినట్లు, అప్పుడు లింగము పెరుగుట ఆగినట్లు, అప్పుడు శివలింగమునకు రక్తశ్రావము జరిగినట్లు, శివలింగముపై కనపడుచారలు ఆరక్తపుగుర్తులేయని భక్తుల నమ్మకం. శాతవాహనులకాలములో ధాన్యకటకం అనియు ధరణికోటగాను పిలువబడిన అమరావతి రాజధానిగా పాలించి వారుఆలయమును అభివృద్ధి చేసినారు. ఈఆలయం దత్తాత్రేయుడు పూజింపబడుచున్న దత్తక్షేత్రములలో ఒకటి. పూజ మరియు అభిషేకములు స్వామిలింగాగ్రము ఎత్తులోనుండుట వలన మొదటి అంతస్తునుండి మాత్రమే జరుగును. అమ్మవారు బాలచాముండిక నామధేయముతో ఇచట కొలువబడుచున్నది.
అమరలింగేశ్వర ఆలయ సమయాలు & అమరారామం చేరుకోవడం ఎలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాసంస్థ వారు కాకినాడ బస్సు డిపోనుండి అయిదు పంచారామ క్షేత్రములు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ మరియు సామర్లకోట) యాత్ర 24 గంటలలో పూర్తి అగునట్లు కార్తీకమాసములోనూ మరియు శివరాత్రి పర్వదినము రోజున సర్క్యులర్ టూర్లూ ఏర్పాటుచేయుడురు. యాత్ర రాత్రి 8 గం లకు ప్రారంభమై సుమారు 700 కి.మీ ప్రయాణించి మరుసటిరోజు సాయంత్రం సుమారు 7 గం లకు ముగుస్తుంది ఆలయము ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటలవరకు తెరచి ఉంటుంది.