భైధ్యనాధ్
(5వ జ్యోతిర్లింగం)
IPLTOURS
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే
సదా వసం తం గిరిజాసమేతమ్
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం తమహం నమామి
(5వ జ్యోతిర్లింగం)
IPLTOURS
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే
సదా వసం తం గిరిజాసమేతమ్
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం తమహం నమామి
ద్వాదశ జ్యోతిర్లింగములలో అయిదవది అయిన వైధ్యనాధ్ లేదా భైధ్యనాధ్ జ్యోతిర్లింగము జార్ఖండ్ రాస్త్రములో జైషీద్ రైల్వే జంక్షను నకు 7 కి.మీ దూరములో డియోఘర్ నందు విలసిల్లు చున్నది. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
జార్ఖండ్ రాష్ట్రములో జైషీద్ రైల్వేజంక్షనుకు 7 కిలోమీటర్లదూరములో డియోఘర్ నందు బాబా భైధ్యానాథ్ ధామ్ అనిపిలువబడు భైధ్యానాథ్ జ్యోతిర్లింగముపై భిన్నాభిప్రాయములున్నవి. నాందేడ్ వద్ధ పర్లీభ్యైద్యనాధ్ జ్యోతిర్లింగమని చెపుతున్ననూ వాస్తవముగా లభ్యమైన సమాచారము ప్రకారము మరియు జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ద్వాదశజ్యోతిర్లింగస్త్రోత్రము ప్రకారము ద్వాదశజ్యోతిర్లింగములలో 5వది అయిన వైధ్యానాధ్ లేదా భైద్యనాధ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రములో జైషీద్ రైల్వేజంక్షను నకు సుమారు 7 కి.మీ. దూరములో కలదు. దీనికి రైల్వే స్టేషన్ డియోఘర్. కానీ రైల్వేసౌకర్యముకల జైషీద్ రైల్వేజంక్షనునుండి ప్రయాణించుట శ్రేయస్కరము.
భైద్యనాధుని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయిన అన్ని భాధలనుండి విముక్త్తిపొందుదురని ప్రసిద్ధి. భైద్యనాధుని పూజించుటవలన మోక్షము పొందేదరు. బీహార్ రాష్ట్రములో గంగానది దక్షణతీరములో నున్న సుల్తాన్ గంజ్ పట్టణమునుండి శ్రావణమాసములో లక్షలకొలదిభక్తులు 40 రోజుల పాటు గంగాదీక్ష ధరించి కావిళ్లపై గంగానీటిని బిందెలలోనూ కేన్లలోనూ తీసుకొని 108 కిలోమీటర్లు కాలినడకపై పయనించి భైద్యనాధ్ చేరి భైద్యనాధుని గంగాజలముతో అభిషేకముచేసేదరు. ఈయాత్రికులను Dak Bam అని పిలిచేదరు మరియు వీరు సుల్తాన్ గంజ్ నుండి బయలుదేరి పాదరక్షలులేకుండానే 108కి.మీ. ఎచ్చటను ఆగకుండా ప్రయాణించి భైధ్యానాధ్ చేరేదరు. సోమనాధ్, రామేశ్వరం మరియు శ్రీశైలంలలో వలెనేకాక ఇచట భైధ్యానాధునికి భక్తులే పాండాలసహయముతో స్వయముగా అభిషేకము చేయవచ్చును. ఈఆలయమునకు ఒకే ద్వారముందుటవలన ఆలయప్రవేశము మరియు నిష్కమణ బహుకస్టతరము. కావున శ్రావణమాసమునందు పర్యటించుట శ్రేయస్కరముకాదు. సింహారాశికి చెందిన స్త్రీపురుషులు ఈభైద్యనాధ్ జ్యోతిర్లింగముల దర్శించి అర్చించిన దోషములుతొలగునని చెప్పబడినది.
భైధ్యానాధ్ ఆలయసముదాయములో 22 ఉపఆలయములు ఉన్నవి. ప్రధానభైధ్యానాద ఆలయమునకుచేర్చి పార్వతీదేవి ఆలయము పవిత్రమైన ఎర్రటితాళ్ళతో కట్టబడి శివ మరియు శక్తియొక్క ఐక్యతతెలుపుతూ ఉంటుంది. ఇంకనూ మహాకాళి, జగజ్జననీమాత, కాలభైరవ మరియు లక్ష్మీనారాయణ తదితర ఆలయములున్నవి.
ఆలయము అన్నిసాధారణ రోజులలోనూ ఉదయం 4 గంటలకు తెరువబడుతుంది. ఉ4 నుండి 5-30 వరకు ప్రధానఅర్చకునిచే షోడపచారపూజ జరుపబడుతుంది. అటుపిమ్మట భక్తులు శివలింగమును ఆర్చించుటకు అనుమతింపబడతారు. అర్చకులు లింగముపై జలముచిలుకరించి పిమ్మట యాత్రికులు లింగముపై జలమును, పూవులు మరియు బిల్వదళములు ఉంచుటకు అనుమతింపబడతారు. ఆలయము మధ్యాహ్నం 3-30 నుండి 6-00 గంటలవరకు మూయబడి అటుపిమ్మట తిరిగి తెరువబడుతుంది. మరలా రాత్రి 9-00లకు మూసివేయబడుతుంది. శ్రావణమాసములో రాత్రి ఆలయముమూసివేయు సమయము పొడిగింపబడుతుంది.
IPLTOURS – Indian Pilgrim Tours