భీమశంకర్
(6వ జ్యోతిర్లింగం)
IPLTOURS
యం డాకినిశాకినికాసమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి
(6వ జ్యోతిర్లింగం)
IPLTOURS
యం డాకినిశాకినికాసమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి
ద్వాదశజ్యోతిర్లింగములలో ఆరవదిఅయిన భీమశంకర్ మహారాష్ట్రలో పూణేకుదగ్గరలోఉన్నది. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రరాష్ట్రములో పుణెకు 110 కి.మీ మరియు అహమ్మద్ నగర్ నకు 166 కి.మీ దూరములోనున్నది. పూణే మరియు అహమ్మద్ నగర్ రెండునూ ప్రధాన రైల్వేస్టేషన్లు ఆగుటవలన మరియు దేశములోని అన్ని ప్రధాననగరములనుండి రైల్వే సదుపాయము ఉండుటవలన రైలునందు పూణే కానీ అహమ్మద్ నగర్ కానీ చేరి ఆచటి నుండి టాక్సీ పై గాని బస్సులోగాని భీమశంకర్వెళ్లవచ్చును. భీమశంకర్ భీమానది ఒడ్డునఉన్నది. భీమానది పేరు టోనీ భీమశంకర్ నానుడిలోనికి వచ్చినది. మహారాష్ట్రలో ఖేడ్ తాలూకాలో భీమశంకర్ నకు చేరువలో పశ్చిమకనుమలలో పుట్టిన భీమానది ఆగ్నేయముగా ప్రవహించి కర్ణాటకలోని రాయచూర్ వద్ద కృష్ణానదినందు భీమానది కలియుచున్నది. సముద్రమట్టమునకు 3500 అడుగుల ఎత్తునగల భీమశంకరం తక్కువ ఉష్ణోగ్రతలు మరియు ఎక్కువ వర్షపాతము కలిగిఉంటుంది.
భీమశంకర్ గురించి రెండు కధనములున్నవి. కుంభకర్ణుని కుమారుడైన భీమఅనువాడు తనతండ్రి కుంభకర్ణుని మరణమునకు రాముని రూపములో విష్ణువేకారణము అనితెలుసుకొని విష్ణువుపై ప్రతీకారము తీర్చుకొనవలెనని తలంచి బ్రహ్మగురించి తీవ్రతపస్సు చేసినాడు. బ్రహ్మవలన వరము పొంది శివుని పరమభక్తుడైన కామరూపేశ్వర్ అనువానిని ఓడించి లోకమును బాధించ సాగినాడు. శివునికి ఆగ్రహముకలిగి లోకమునురక్షించి భీముని అకృత్యములకు తుదముట్టించుటకు భీముని భస్మము చేసినాడు. దేవతలందరు శివుని ఆప్రదేశములో నివసించమని కోరగా శివుడు భీమశంకరరూపములో వెలసినాడు. ఆ యుద్ధములో శివుని శరీరమునుండి వెలువడిన స్వేడ భీంధువులే భీమానది అని నమ్మకం.
మరియొక కధనముప్రకారము త్రేతాయుగములో త్రిపురాసురుడు అనురాక్షసుడు భీమశంకర్ అరణ్యములో శివునిగురించి తీవ్ర తపస్సుచేసినాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వరముకోరు కొమ్ము అనిచెప్పగా త్రిపురాసురుడు అమరత్వము కోరుకొనినాడు. శివుడు జనక్షేమము కొరవలెకానిఎడల యుద్ధమునకు సిద్ధపడవలెనని నిభంధనతో వరము ఇచ్చినాడు. త్రిపురాసురుడు నిభంధనుమరచి జనులను, ఇతరదేవతలను హింసించుట మొదలు పెట్టినాడు. అప్పుడు శివుడు, పార్వతి (కమలరాజ మాత) సహాయముకోరినాడు. పార్వతి సహాయముతో శివుడు అర్ధనారీశ్వరరూపములో త్రిపురారిపౌర్ణిమ అనబడు కార్తీకపౌర్ణమి నాడు త్రిపురాసురుని సంహరించినాడు. త్రిపురాసురుని మరణానంతరము త్రిపురాసురుని భార్యలు శాఖిని మరియు ఢాఖిని తమ భర్త మరణానంతరము తమపరిస్తితి గురించి మొరపెట్టుకోగా శివుడు వారివురికీ అమరత్వము ప్రసాదించినాడు. అప్పటినుండి భీమశంకరమును ఢాకినీ భీమశంకరంగా పిలుచుచున్నారు. మరాటారాజైన నానాసాహెబ్ పేష్వామేనమామ మరియు బాలాజీరావు పేష్వాసోదరుడు అయిన చిమాజీఅప్ప అనువారు పోర్చుగీసువారినుండి సేకరించిన అయిదు పెద్దగంటలలో ఒకగంట ఈఆలయమునకు సమర్పించినాడు. ఆగంట ఇప్పటికినీ ఈఆలయమునందుఉన్నది. మకరరాశికిచెందిన స్త్రీ పురుషులు ఈభీమశంకర్జ్యోతిర్లింగము దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది.
భీమశంకరఆలయమునకు దగ్గరలో కల్మజఅనుఅమ్మవారి విగ్రహము కలదు. ఈదేవత కలంబ్ అనువృక్షముపేరున పిలువబడుతున్నది. ఈమెస్థానికముగా గిరిజనులదేవత. ఈ ఆలయమునకు దగ్గరలో బౌద్ధమతసంప్రదాయములో అంబ అంబిక అనుపేర్లతో గుహలు ఉన్నవి. భీమశంకరఆలయము వెనుకభాగమున ఋషికుండ తీర్ధముచేర్చి మోక్షకుండ తీర్ధముకలదు. భీమశంకర్ నందు దత్తమందిరం,కమలజమాత మందిరం, రామమందిరం చూడతగిన ఆలయములు.
IPLTOURS – Indian Pilgrim Tours