సోమనాథ్
(1వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే
జ్యోతిర్మయం చంద్రకళా వసంతం
భక్తప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే
(1వ జ్యోతిర్లింగం)
IPLTOURS
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే
జ్యోతిర్మయం చంద్రకళా వసంతం
భక్తప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే
జ్యోతిర్లింగములలో సోమనాధ్ జ్యోతిర్లింగం మొదటిది. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
సోమనాధ్ పురాతన కాలమునుండి ఒకగొప్ప పర్యాటక పవిత్ర పుణ్యక్షేత్రము. పవిత్ర కపిల, హిరణి మరియు సరస్వతి నదుల సంగమప్రదేశము. శివపురాణము ప్రకారము చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలు (నక్షత్రములు) 27 మందిని వివాహమాడినట్లు, వారిలో రేవతిని అమితముగా ప్రేమించినట్లు, మిగిలినవారిఎడల నిర్లక్షముగా ప్రవర్తించినందుకు దక్ష ప్రజాపతి కోపించి అందవిహీనుడు కావలెనని చంద్రుని శపించినట్లు, అందవిహీనుడైన చంద్రుడు తన భార్య రోహిణితో సోమనాధ్వచ్చి స్పర్శలింగమును సేవించినట్లు, పిమ్మట శివుని అనుగ్రహమువలన చంద్రుడు తనఅందమును తిరిగిపొందినట్లు, చంద్రుని కోరికపై శివుడు సోమచంద్ర పేరుతో ఇచట నివిసించినట్లు. అదే పేరుతో సోమనాధునిగా ప్రాచుర్యము పొందుట జరిగినది. సోమ అనగా చంద్రుడు ఇచ్చటనే తన శాపమునుండి విముక్తుడు అయి పోగొట్టుకొనిన అందమును సరస్వతినదినందు స్నానము చేయుటద్వారా తిరిగి పొందినాడు. సోమనాధ్ అనగా సోముని (చంద్రుని) నాధ్ (ప్రభువు). ఇచట ప్రస్తుత ఆలయమునకు ఎదురుగా ఉన్న పురాతన సోమనాధ్ఆలయం చాళుక్యరాజైన మూలరాజపాలనలో సుమారు రెండువేల సంవత్సరముల క్రిందట నిర్మాణము జరిగినది.
దర్మిలా ఈపురాతన సోమనాధ్ ఆలయం అనేకపర్యాయములు ముస్లిములవలన మరియు పోర్చుగీసు వారివలన ద్వంసము చేయబడి పలుపర్యాయములు పునః నిర్మించ బడినది అయినను శివలింగమునకు ఎటువంటిహాని జరుగలేదు. ఇప్పటికినీ ఈఆలయమునందు అభిషేకములు పూజలు నిర్వహించుటకు పూజారులు కలరు. ప్రస్తుత ఆలయం భారతదేశ మొదటి హోమ్ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కాలములో చాళుక్యులరీతిలో నిర్మాణము మొదలుపెట్టి 1951 సంలో పూర్తికాబడి భారతదేశ మొదటిరాస్త్రపతి డాక్టర్ బాబూరాజేంద్రప్రసాద్గారిచే ప్రారంభించ బడినది. ఇచట సముద్రపు ఒడ్డున శివలింగాలు కడురమ్యముగా ఉండును. సోమనాధ్ సముద్ర తీరమునుండి అంటార్కిటికా ఖండమువరకు సూటిగాచూసిన అడ్డుగా నిలుచుటకు భూమి లేని ప్రదేశములో సోమనాధ్ ఆలయము నిర్మించబడినది. మరియు సముద్రమునుండి రక్షణార్ధము నిర్మించబడిన గోడపై నెలకొల్పబడిన బాణస్తంభమునందు సదరుదిక్చూచి ఏర్పాటు చేయబడింది. వృషభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ సోమనాద్ జ్యోతిర్లింగము దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది.
సోమనాథ్ రైల్వేస్టేషనువెనుక ధర్మశాలఉన్నది. అద్దెచెల్లించు ప్రాతిపదికపై గదులు మరియు భోజనఏర్పాటుఉన్నది దీనికి ఎదురుగా హోటల్ సుఖ్ సాగర్ రెస్టారెంటు ఉన్నది (849631838, 02876-232311) ఇందు ఏ.సి. రూమ్స్, కాఫీ, టిఫేన్, భోజనము దొరకును. సోమనాధ్ నందు దేవస్థానము వారి అతిధి గృహమునందు ఏ.సి. రూములు లభ్యమగును. రైల్వేరిటైరింగ్ రూములు అందుబాటులోఉన్న కేటాయించేదరు. హోటళ్లు ప్రయివేటు అతిధి గృహములు ఉన్నవి.
ప్రతిరోజూ ఉదయం 6 గం నుండి రాత్రి 9 గం వరకు స్వామిని దర్శించ వచ్చును. స్వామికి ఉదయం 7 గం మధ్యాహ్నం 12 గం సాయంత్రం 7 గం లకు హారతి నిచ్చేదరు. రాత్రి 8 గం నుండి 9 గం వరకు లైటింగ్ షో ఉండును.
యాత్రికులు దేశంలోని వాయువ్య మూలలో ఉన్న శివుడు మరియు కేశవుల పవిత్ర స్థలాలను సందర్శించవచ్చు. ఈ పవిత్ర స్థలాలు అరేబియా సముద్రం ఒడ్డున ఉండడం విశేషం. ద్వాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలలో 1వది అయిన సోమనాథ్ నుండి తీర్థయాత్ర ప్రారంభమవుతుంది మరియు శ్రీ కృష్ణ భగవానుని గమ్యస్థానమైన వరేవల్, ప్రసిద్ధ మరియు పాత శివాలయాలు బావ్నగర్లోని నిష్కలంక మహాదేవ్, గంగేశ్వర మహాదేవ్ మరియు ద్వారక మరియు బెట్టతో సహా పంచ ద్వారక వరకు కొనసాగుతుంది. ద్వారక, విష్ణువు బాల్యం నుండి తన విధి వరకు తన ప్రధాన జీవితాన్ని గడిపిన పవిత్ర స్థలాలు.
వరేవల్ 5 కి.మీ దూరంలో ఉన్న పట్టణం మరియు రైల్వే స్టేషన్ కలిగి ఉంది. ప్రియంగా భావించి ఒక వేటగాడు వదిలిన బాణం శ్రీకృష్ణుని పాదాలకు తగిలి కృష్ణుడు ఈ ప్రదేశంలోనే కన్నుమూశాడు. బల్క్ తీర్ద్ పేరుతో ఒక ఆలయం ఉంది. శ్రీకృష్ణుని జ్ఞాపకార్థం ఆ స్థలంలో తులసి చెట్టును నాటారు. ఈ ఆలయంలో శ్రీ వల్లభాచార్యులు ఏడు రోజుల పాటు భగవద్గీతను ప్రతిష్టించారు. బిర్లాస్ 1970లో గీతా మందిరాన్ని నిర్మించారు. వేణువు వాయిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుని విగ్రహం ఉంది. బలదేవ గుహ అనే పేరుతో ఒక గుహ ఉంది మరియు శేషనాగు యొక్క అవతారమైన బలదేవ ఆ గుహలో ప్రయాణించి అదృశ్యమయ్యాడని చెబుతారు. ఈ ఆలయానికి సమయాలు లేవు మరియు యాత్రికులు ఎప్పుడైనా సందర్శించవచ్చు.
IPLTOURS – Indian Pilgrim Tours