ఓంకారేశ్వర్ & అమలేశ్వర్
(4వ జ్యోతిర్లింగం)
IPLTOURS
కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకారమీశం శివమేకమీడే
(4వ జ్యోతిర్లింగం)
IPLTOURS
కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకారమీశం శివమేకమీడే
హిందువులకు అతిపవిత్రమయిన శివునికి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగములలో నాలుగవ జ్యోతిర్లింగఆలయము మధ్యప్రదేశ్ రాష్ట్రమునందు ఖాండ్వాజిల్లానందు మొగార్థనుండి 12 కి.మీ మరియు ఉజ్జయినికి సుమారు 140 కి.మీ దూరములో పవిత్రమైన నర్మదా నదిఒడ్డునకుదక్షణము వైపున అమలేశ్వరముగాను మరియు ఈ ఆలయమునకు ఉత్తరముగా నర్మదానదికి ఆవలిఒడ్డున హిందూ “ఓం” గుర్తునుపోలిన మాంధాత దీవినందు ఓంకారేశ్వర్ గాను జ్యోతిర్లింగముఉన్నది. నర్మదానదికి ఉపనది కావేరీ అయిఉన్నది.
కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
ద్వాదశజ్యోతిర్లింగములలో నాలుగవజ్యోతిర్లింగము ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ జ్యోతిర్లింగము. ఉజ్జయిని నుండి అమలేశ్వర్ వరకు రాష్ట్రరవాణాసంస్థ బస్సులు ఉన్నవి. బస్సుపై అమలేశ్వర్ నందు అమలేశ్వరుని దర్శించుకొని ఆచటినుండి నర్మదా నదిపై నిర్మించబడిన బ్రిడ్జిపైనుండి కాలినడకననదికి ఆవలివైపుననున్న ఓంకారేశ్వర్ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొనవచ్చును. ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ కలిపి ఒకజ్యోతిర్లింగము. అమలేశ్వర్ నుండి ఓంకారేశ్వర్ సుమారు 1 ½ కి.మీ. ఉంటుంది.
ఒకకధనముప్రకారము వింధ్యాచల్ పర్వతదేవతఅయిన వింధ్యుడు తానుచేసిన పాపములనుండి విముక్తి పొందుటకుగాను శివుని పూజించినాడు. పవిత్రముగా గణిత సంబంధమైన చిత్రముతోపాటు ఇసుక మరియు మట్టితోచేసిన లింగము సృష్టించినాడు. శివుడు ఆఆరాధనకు సంతోషించి ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ రూపములలో ప్రత్యక్షమైనాడు. మట్టిదిబ్బ ఓంరూపములో ఏర్పడినందున ఈద్వీపము ఓంకారేశ్వర్ అని ప్రాచుర్యములోనికివచ్చినది. ఇచ్చటి ఆలయములో పార్వతి మరియు అయిదు ముఖముల గణపతి విగ్రహములుకలవు.
మరియొకకధనము ప్రకారము శివుడు దేవ దానవయుద్దములో ఓటమిచెంది తనను ప్రార్ధించిన దేవతల కోరికపై ఓంకారేశ్వర రూపములో దానవులతో యుద్ధము చేసి ఓడించెననిచెపుతారు. కర్కాటకరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ ఓంకారేశ్వర్ మరియు అమలేశ్వర్ జ్యోతిర్లింగములు దర్శించి అర్చించిన దోషములు తొలగుననిచెప్పబడినది.
ఆలయము అన్నీరోజులలోనూ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గం వరకు తెరచి ఉంటుంది. దర్శన సమయము ఉదయం 5 గంనుండి మధ్యాహ్నం 3-50 వరకు మరలా 4-15 నుండి రాత్రి 10 వరకు. హారతి ఉదయం 5.00 నుండి 5-30 వరకు సాయంత్రం 8-20 నుండి 9-05 వరకు జలాభిషేకం ఉదయం 5-30 నుండి 12-25 వరకు.
ఇచట ఓంకారేశ్వరఆలయమునకు కొద్దిదిగువ ప్రాంతములో ఒకగుహ ఉన్నదని ఆ గుహనందు ఆదిశంకరాచార్యుని చిత్రము ఈ గుహలోనున్నదని ఆది శంకరాచార్యులు వారు తన గురువైన గోవిందపాదుల వారిని ఇచ్చటనే కలిసినాడని స్థానికులు తెలుపుతారు.
IPLTOURS – Indian Pilgrim Tours