ముక్తినాధ్
(IPLTOURS)
హిమాలయన్ యాత్ర పురస్కరించుకొని హరిద్వార్ వద్ద ఆగి ఆచటి నుండి మరలా పశుపతినాధ్ ద్వారా ముక్తినాథ్ దర్శించుటకు ప్రయాణము ఆరంభించవలెను.
ముక్తినాథ్ ఆలయం
ముక్తినాథ్ ను ముక్తి క్షేత్రము అని పిలిచెదరు. ఈ విశిష్ణ క్షేత్రము నేపాల్ లోని ముస్తాఙ్గ్ వద్ద తోరోంగ్ లా పర్వత పాదము వద్ద ముక్తినాథ్ లోయవద్ద నున్నది. ఈ ఆలయము హిందువులకే కాక బౌద్ధులకు కూడా పరమ పుణ్య క్షేత్రము. సముద్ర మట్టమునకు 3800 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన ఈ ఆలయము ప్రపంచములో ఎత్తైన ప్రదేశములో నిర్మించబడిన క్షేత్రములలో ఒకటి. ఈ క్షేత్రము ముక్తినాధ్ గా పిలువబడు రాణిపౌవా గ్రామమునకు అతి సమీపములో నున్నది. ఈ ఆలయము విష్ణువుయకు సంబంధించిన 108 దివ్యదేశములలో 106వ దివ్యక్షేత్రము. తిరుశాలిగ్రామ్ అనునది బౌద్ధ ఆరామముగా పిలువబడుటకు ముందుగా దీని వైష్ణవ సాంప్రదాయము నందు దీని నామము అయి ఉన్నది. ఈ ఆలయము ముందుగా విష్ణు క్షేత్రమైనను దర్మిలా గురు పద్మసంభవుడు ఇచట కొంత కాలము ధ్యానము చేయుట వలన ఇది బౌద్ధులకు కూడా దివ్యక్షేత్రము అయినది. టిబెట్బౌ ద్ధులకు ముక్తినాధ్ ఒక ముఖ్య పుణ్య క్షేత్రము.
ఈ ముక్తినాధ క్షేత్రము మహాదేవి లేదా దేవీభగవతిగా పిలువబడు 108 శక్తి సిద్ధిపీఠములలో ఒకటి. శివుడు సతీ దేవి దేహమును ఖండించినప్పుడు ఆ భాగములు పడిన ప్రదేశములు శక్తిపీతములు. సతీదేవి నుదుటి భాగము ఇచట పడినట్లునమ్మేదరు. ముక్తినాధ్ నందలి శక్తి గండకిచండీ గాను మరియు భైరవుడు చక్రపాణిగాను పిలువ బడుచున్నారు.
ముక్తినాధ్ చేరుటకు రెండు మార్గములున్నవి
మొదటి మార్గము
ఖాట్మండూ నుండి పోఖ్రా | బస్సు/టాక్సీ |
పోఖ్రా నుండి జాన్సన్ | టాక్సీ |
జాన్సన్ నుండి ముక్తినాథ్ | టాక్సీ |
ముక్తినాధ్ నుండి వెనుకకు ఖాట్మండూ పై తీరున ⇐
ఖాట్మండూ నుండి పోఖ్రా విమానం | (రూ.12,000/- ఒక్కొక్కరికి ఒక వైపు) |
పోఖ్రా నుండి జాన్సన్ | టాక్సీ |
జాన్సన్ నుండి ముక్తినాథ్ | టాక్సీ |
ముక్తినాధ్ నుండి వెనుకకు ఖాట్మండూ పై తీరున ⇐
రెండవ మార్గము
భారత దేశంలో ఎచ్చటి నుండైనా గొరక్ పూర్ | రైలు/విమానం |
గొరక్ పూర్ నుండి సోనాలీ (నేపాల్ బోర్డర్) 90 కి.మీ | టాక్సీ/బస్సు |
సోనాలీ నుండి ఫోక్రా 250 కి.మీ.(విడిది) టాక్సీ/బస్సు | టాక్సీ/బస్సు |
పోఖ్రా నుండి జాన్సన్ | టాక్సీ /విమానం |
జాన్సన్ నుండి ముక్తినాథ్ | టాక్సీ |
ముక్తినాధ్ నుండి వెనుకకు ఇదే రూట్ ⇐