కంక్రోలి ద్వారకాదీష్

(IPLTOURS)

శ్రీ ద్వారకాధీష్ దేవాలయం కంక్రోలి

అహమ్మదాబాద్ నుండి ఉదయపూర్ మార్గములో శ్రీకృష్ణుని రూపమైన ద్వారకాదీష్ నివాసమైన కంక్రోలి ఆను చిన్న పట్టణము కలదు. కంక్రోలినందు ప్రఖ్యాత టైర్ల ప్లాంట్అయిన జె.కె.టైర్ తయారీ కేంద్రమునకు ప్రసిద్ధి. ఈమొత్తం గ్రామమును జె.కె.గ్రామ్ పేరుతోకూడా పిలిచేదరు. వల్లభాచార్యుల వంశములోనివారికి ఈప్రదేశము యాత్రాస్థలము. ఈఆలయమునందలి దేవుని విగ్రహము మొఘలులు ద్వంశము చేయకుండా రక్షించుటకు శ్రీగిర్ ధర్జీమహరాజ్ శ్రీకృష్ణుని స్వస్థలము మధురనుండి అహమ్మదాబాద్ తీసుకువచ్చినట్లు పిమ్మట దానిని మహారాణా రాజ్ సింగ్ కోరికమేరకు నాలుగువందల సంవత్సరములకు పూర్వము కంక్రోలి తీసుకువచ్చి ఆలయానిర్మాణము పూర్తిఅగువరకు అసోతియా గ్రామమునందు ఉంచినట్లు తెలియుచున్నది. ఈఆలయము చిన్నసరస్సు ఒడ్డున హవేలీతరహాలో నిర్మించబడినది.                  

ఈఆలయము ఒకచిన్న కొండపైనున్నది. ఆలయమునకు అవతల రాజ్సమండ్ అనబడు కోనేరు ఉన్నది. ద్వారకాదీష్ దర్శనము పిమ్మట ఈసరస్సును చూడవచ్చును. ఆలయప్రాంగణములో మథురాదీష్ జీ మరియు ఛోటా ద్వారకాదీష్ జీ ఆలయములుకూడా కలవు. ఈపూరాతనఆలయమునందుకల శ్రీకృష్ణుడు శ్రీద్వారకాదీష్ అనిప్రసిద్ధి. ఆలయముకలభవనము పెద్దదిగానుండి హవేలి మాదిరిగా కనపడును. ఆలయమునందుకల ఎర్రరాతితో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహము అందముగానుండి మధురనుండి తీసుకువచ్చినట్లు తెలియుచున్నది. రాజ్సమండ్ ప్రాంతములో మేవార్ నందుకల పవిత్రస్థలములలో ద్వారకాదీష్ ఒకటి. ప్రతిసంవత్సరము స్థానిక పర్యాటకులతో గుజరాత్ సందర్శించు యాత్రికులు అందరూ ఈఆలయము దర్శించేదరు. ద్వారకాదీష్ దర్శనము అయినపిమ్మట మెట్లద్వారా కుడివైపునకు వెళ్ళిన రాయిసాగర్ సరస్సుననకు వెళ్లవచ్చును. ఇది అతిపెద్ద కుత్రిమమైన సరస్సు. ఇచ్చట కొద్దిసేపు సమయము గడిపిన మంత్రముగ్ధులను వాతావరణం చేస్తుంది. ఇచట ఫోటోలు తీసుకొని పావురములు మరియు చేపలకు ఆహారము వేయవచ్చును.

River in Kankroli

ప్రపంచవ్యాప్తముగా వృందావన్ నుండి రాజస్థాన్ తీసుకువచ్చి ప్రతిస్టించిన శ్రీద్వారకాదీష్ స్వరూపముగల ఈఆలయము ప్రసిద్ధి. మొఘలుల దండయాత్రలు జరిగిననూ ఆలయమునకుకాని స్వామికికాని ఏవిధమైనహాని జరిగియుండలేదు. ఆలయమందు జరుగుఉత్సవములకు దేశమునలుమూలలనుండి వైష్ణవులు స్వామిదీవనలుపొందుటకు అధిక సంఖ్యలో పాల్గొనెదరు. వల్లభాచార్యస్థాపిత ఆలయములన్నిటిలోనూ ఈఆలయమునకు ప్రత్యేకత ఉన్నది. ఈఆలయము నాథ్ ద్వారా ఆలయమును జ్నప్తికి తెచ్చును. ఆలయము శీతాకాలము దర్శించుటకు అనువైనది. చల్లగాఉండి ఇచ్చటకల కొనేరునందు అనేకమైన వలస పక్షులు కనిపించును. ఇతర ఆలయములలోవలెనే ఈఆలయమందుకూడా పౌర్ణమిరోజున, హోలీ, దీపావళి, శ్రీరామ నవమి, జన్మాష్టమి మరియు అక్షయ తృతీయలు ముఖ్యమైనవి.

గుడిచుట్టూ బ్రహ్మాండమైన బజారు కలదు. కంక్రోలి ద్వారకాదీష్ ఆలయ సందర్శనకు అహమ్మదాబాద్ నుండి యాత్రికులు వారికి అవసరమైన వంటింటి సామాగ్రి, ఆడవారి వస్తుసామగ్రి, బట్టలు మరియు శ్రీనాధ్ జీకిసమర్పించు పూజాసామాగ్రిలతోపాటుగా రాజస్తాన్ సంప్రదాయ తినుబండారములు ఈబజారునందు కొనుగోలు చేయవచ్చును. ఆలయమువెలుపల టీ మరియు బిస్కెట్ దుకాణములుకలవు. కంక్రోలిఆలయము ఉదయం 7 నుండి మధ్యాహ్నం 11 వరకు తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 7 వరకు తెరచి ఉంటుంది. ఉదయం మంగలహారతి, శ్రింగర్, రాజభోగ్ సాయంత్రం ఊతం మరియు శయన సేవలు జరిపేదరు. రాత్రీయంతయూకూడా జరుపు జన్మాస్టమి ప్రత్యేకముగా చూడతగిన ఉత్సవము.