బెట్ ద్వారక

(IPLTOURS)

బెట్ ద్వారక

పంచ ద్వారకలందు బెట్ ద్వారక ఒకటి. శ్రీకృష్ణుడు చిన్నతనమునందు తన స్నేహితుడైన సుధాముని ఇచ్చటనే కలిసినట్లు చెపుతారు మరియు ద్వారకనందు ఇదిఒకభాగము మాత్రమే.  శ్రీకృష్ణుని అసలు నివాసముగా నిర్ధారింపబడిన బెట్ ద్వారక అనునది అరేబియాసముద్రములో ద్వారక దగ్గరఉన్న చిన్నద్వీపము. కృష్ణుని కాలములో బెట్ ద్వారక నౌకాశ్రయము. దర్మిలా ద్వారక అభివృద్ధిచెంది సమీపములోని ఒక్కా నౌకాశ్రయముగా రూపుదిద్దుకొన్నది. రుక్మిణీడేవి కొలచిన శ్రీకృష్ణుని విగ్రహముతో వాస్తుశిల్పి వల్లభాచార్యులు సుమారు 500 సం.లకు పూర్వము ఈఆలయము నిర్మించినాడు. ఈఆలయమునందలి కృష్ణుని విగ్రహము రుక్మిణిచే తయారుచేయబడినదై అని నానుడి. చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు కృష్ణునికిపేలాలు (బియ్యమునుండి తయారు) ఇచ్చియుండుటవలన, పేలాలు సంప్రదాయకానుకగా కృష్ణునికి సమర్పింతురు. బెట్ ద్వారకనందు ఇంకనూ శివ,విష్ణు, హనుమాన్ మరియు దేవి ఆలయములు కలవు. 

స్థలపురాణముప్రకారము విష్ణువు శంకాసురుడు అనురాక్షసుని ఈద్వీపమునందు సంహరించినాడు. శంఖాసురుడు అను రాక్షసుడు శంఖమును పోలిన ఆభరణము తలపై కలిగి గర్వముతో ఉండేదివాడు. వాడుతనకు కల ధనమువలన స్త్రీలు తనను ఇష్టపడుదురని భావించెడివాడు. వాడు శ్రీకృష్ణుడు సాధారణ పశువులకాపరి అయిననూ నిత్యమూ గోపికలతో వినోదించు చున్నాడని కృష్ణునియందు అసూయ పడినాడు. ఒకరాత్రి శ్రేకృష్ణుడు మరియు బలరాముడు అందమైన యువతులతో రాసలీలనృత్యము చేయుచుండగా శంఖాసురుడు చూసి అసూయపడినాడు. అందుఅందమైన యువతులను శంఖాసురుడు నృత్యమునుండి బయటకులాగుట మొదలుపెట్టినాడు. అపుడు ఆయువతులు సహాయము కొరకుఅరవగా, కృష్ణుడు శంఖాసురుని ఆపినాడు. కృష్ణుడు వారినికాపాడి బలరామునికి వారిని ఆప్పగిందినాడు. కృష్ణుని శక్తిచూసి శంఖాసురుడు ప్రాణభయముతో పరుగెత్తినాడు. అయిననూ కృష్ణుడు వదలకపట్టుకొని ఒకముష్టిఘాతముతో క్రిందపడవేసినాడు. శంఖాసురుడు అలసిపోగా శ్రీకృష్ణుడు ఆతనినుండి శంఖమునుపోలిన ఆఆభరణము తీసుకొని బలరామునికిఇచ్చి శంఖాసురుని వధించినాడు.

మత్యరూపములోనున్న విష్ణుభగవానుని, రుక్మిణీ, త్రివిక్రముడు, దేవి, రాధ, లక్ష్మి, సత్యభామ, జాంబవతి, లక్ష్మీనారాయణ్ తదితరదేవతల ఆలయములుకూడా బెట్ ద్వారకలోయున్నవి. బెట్ ద్వారకలోకల మరియొక ఆలయం హనుమాన్ దండి. ఈఆలయములో హనుమంతుడితోపాటు హనుమకుమారుడైన మకరధ్వజుని చిత్తరవులు అనేకంఉన్నవి. హనుమంతుడు తిని వదలిన ఫలముతిని ఒకమొసలి మకరధ్వజునికి జన్మనిచ్చినట్లు చెపుతారు. బెట్ అనగా గుజరాతీ భాషనందు దీవి అనిఅర్ధము. కావున ఈదీవిని బెట్ ద్వారకగా పిలుస్తారు.

యాత్రికులు ఓక్కారేవునుండి లాంచీద్వారా బెట్ ద్వారకా చేరవలయును. శ్రీకృష్ణుడు చిన్నతనమునందు తన స్నేహితుడైన సుధాముని ఇచ్చటనే కలిసినట్లు చెపుతారు మరియు ద్వారకనందు ఇదిఒక భాగము మాత్రమే. ఆలయము తెరచిఉండు సమయములు ఉ 9 నుండి మ 1గంట, సా 3 నుండి 6వరకు. బెట్ ద్వారకనందు ఆలయసందర్శనముపిమ్మట మరలా ద్వారక చేరవలయును.

సముద్రములో ద్వారక

పురాణములప్రకారము ద్వాపరయుగము తరువాత ప్రస్తుతకలియుగము. భగవద్గీతనందు మౌసలపర్వమునందు అర్జునునికి భగవాన్ శ్రీకృష్ణుదూతనచే నిర్మించబడిన ద్వారక మహానగరము గురించి వివరిస్తూ ద్వారక సముద్రతీరమునందు నిర్మింపబడుట వలన తననిర్యాణముపిమ్మమ ద్వారకనందలి పెద్ద పెద్దభవంతులన్నియు కేవలము కొద్ది సమయములో సముద్రములో కలసిపోవునని, సముద్రము తనఉనికిని కోల్పోయి కేవలము ఒకసరస్సువలే ఇచట ఉండునని తెలిపినట్లు తెలియుచున్నది. శ్రీకృష్ణుడు ద్వారకను కొన్ని చదరపుమైళ్ళ విస్తీర్ణములో నిర్మించినాడు. ప్రస్తుతముకల ద్వారక మరియు బెట్ ద్వారక మధ్యలోఉన్న సముద్రము ఒకసరస్సువలెనే కనపదును. సుమారు 1600 సంవత్సరములకు పూర్వం ద్వారక సముద్రములో కలసిపోయినట్లు కనుగొనినారు. పురావస్తుశాఖవారు రెండుపర్యాయములు ఇందలివాస్తవికను కనుగొనుటకు ప్రయత్నించి చాలాభాగము కృతకృత్యులు అయినారు. 1963 సంవత్సరములో గుజరాత్రా ష్ట్రపురావస్తుశాఖ మరియు పూణే డెక్కన్ కాలేజీవారు జరిపిన పరిశోధనయందు పురాతన కాలమునాటి వస్తువులను కనుగొనినారు.  

1979 సంవత్సరములో కేంద్ర ప్రభుత్వ పురాస్తు శాఖ వారు నౌకా సంబంధ పురావస్తు యూనిట్ వారు సంయుక్తముగా ద్వారకనందు ద్వారకాదీష్ ఆలయపరిసరములలో జరిపిన పరిశోధన యందు 3000 సంవత్సరముల క్రిందటి కుమ్మరి కొలిమి (కుండలు కాల్చే చోటు) కనుగొనినారు. అందువలన 1981 సంవత్సరములో మొదలుపెట్టి 20 సం లు తరుపరి పరిశోధనలు చేసినారు. 1984 సంవత్సరములో మూడుసంవత్సరములు పరిశోధనచేయుటకు ప్రాజెక్టు మంజూరు కాబడినది. సముద్రములో అన్వేషణకు నవంబరునుండి ఫిబ్రవరివరకు మాత్రమే అనువుగానుండుటవలన ఆసమయము లోనే పరిశోధన జరిగినది. సముద్రములో కొన్నిభవంతులకు చెందిన అవశేషములను 2007 సంవత్సరములో కనుగొనినారు. దర్మిలా జరిపిన పరిశోధనయందు ద్వారక పట్టణమునకు చెందిన అనేక అవశేషములను కనుగొనినారు. బెట్ ద్వారక నందు జరిపిన పరిశోధనలో కోటగోడలకు సంబంధించిన ఆనవాళ్ళు కనుగొనినారు. జరిపిన పరిశోధనల ప్రకారము భారతమునందు పేర్కొనిన ద్వారకా పట్టణము ఊహాజనితంకాదని ఆపట్టణము వాస్తవాముగా ఉండేడిదని దర్మిలాసముద్రము లోనికిక్రుంగి కలసిపోయినట్లు నిర్ధారణ అయినది.