శివ నంది
(IPLTOURS)
శివనంది నంద్యాల నుండి మహానంది వెళ్లే మార్గంలో నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినపిమ్మట ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా గుర్తుగా చెప్పవచ్చు. శివనంది అతిపురాతనమైనది. ప్రశస్తమైన రాతికట్టడము మరియు మహానంది పిమ్మట మిగిలిన 8 నంది ఆలయాలలోనూ పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా హుందాగా ఉంటుంది. ఈదేవస్థానం పూజారి శ్రీదేవగుడి భవానీ శివశంకర్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం గుడి గోపురం లోపలివైపున ఒక రంద్రము ఉంది. ఆరంద్రము వద్దనే పంచముఖ నాగేంద్రుని బొమ్మ ఉంటుంది. శివరాత్రినాడు అర్ధరాత్రి 12 గంటలకు ఆలయమునందు జాతరహడావుడి నిలుపుదల చేస్తారని, ఆసమయంలో ఆరంద్రము ద్వారా అయిదుతలల నాగేంద్రుడు లోపలికివస్తాడని శివలింగాన్ని చుట్టుకొని సుమారు 2నిమిషాలు దర్శనంఇచ్చి మరలా అదే రంద్రముద్వారా వెలిపోతాడని పిమ్మట శివరాత్రి ఉత్సవం యధావిధిగా చేస్తారని తెలిపారు.
అంతేకాక ఈ శివలింగానికి తైలాభిషేకం చేసుకొంటే రాహు మరియు కేతుగ్రహ శాంతి జరుగుతుందని, రాహుగ్రహశాంతికి శ్రీకాళహస్తిలో పూజచేస్తారని అక్కడేకాకుండా శివనందిలో పూజ మరియు తైలాభిషేకంచేసుకొని రాహు మరియు కేతుగ్రహ శాంతి చేసుకొనవచ్చునని తెలిపారు. అంతమహిమ కలిగినది ఈఆలయం. ఇచ్చట పంచపాడవులు ప్రతిస్టించిన శివలింగాలు ఉన్నాయి మహానంది సమీపములోనుండి నవనందులలో మహానంది తరువాత అత్యంతమహిమాన్వితము అయిననూ ఆలయఅభివృద్ధి అశ్రద్ధ చేయబడినది. ఇటీవలనే ధ్వజస్తంభము కొద్దిపాటి అభివృద్ధి గోచరించుచున్నది.
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours