గంగేశ్వర మహదేవ్

(IPLTOURS)

గంగేశ్వరమహదేవ్ ఆలయం గుజరాత్ రాష్ట్రములో సోమనాథ్ జ్యోతిర్లింగమునకు సుమారు 80కిలోమీటర్ల దూరములో నున్నది. ప్రయివేటు వాహనమునందు సుమారు 3 గంటలు ప్రయాణించి చేరవచ్చును. మరియు అరేబియాసముద్ర తీరమున ఫూడమ్ గ్రామమునందు కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ నకు 3కి.మీ దూరములో ఉన్నది. అరేబియాసముద్రములో ఈఆలయము దర్శించుటకు అపూర్వముగా ఉండును. సముద్రతీరమున రాళ్లమధ్య ఉన్నటువంటి గుహఆలయం. యాత్రికులు ఈగుహాలయము ప్రవేశించినంతనే గణేశుడు, విష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహములు పిమ్మట అయిదు శివలింగములు విభిన్నపరిమాణములలో సముద్రపునీటికి మధ్యలో దర్శనము ఇచ్చును. మరియు శేషనాగు శిల్పము కొండరాళ్లపై శివలింగములను చూచుచున్నట్లు చెక్కబడినది. సముద్రమునకు అధిక ఆటుపోట్లు వచ్చుసమయము నందు శివలింగములు సముద్రపునీటిలో కలసిపోయి అలలుతగ్గినప్పుడు మాత్రము కనపడును. సముద్రపు తీరమున నుండుటవలనదీనిని  సముద్రతీర ఆలయము అనికూడా పిలిచేదరు.  

gangeshwar mahadev

సుమారు 5000 సంవత్సరములకు పూర్వము మహాభారత కాలమునందు పంచపాండవులైన ధర్మరాజు (యుధిష్టర), భీముడు, అర్జున, నకుల మరియు సహదేవులచే అయిదు శివలింగములు స్థాపించబడి వారి అజ్ణాతవాసకాలములోవారిచే పూజించబడినవి. గంగేశ్వర్ అను పదము గంగ మరియు ఈశ్వరుడు కలయిక. గంగ దీవి నుండి భువికి వచ్చునప్పుడు ఆమె ఉధృతినుండి లోకములను కాపాడుటకు శివుడు ఆమెను తన జటాఝూటమునందు బంధించినాడు. అందువలనే శివుని గంగాధరుదని గంగేశ్వరుడు అని పిలుస్తారు.  

ఈఆలయము సందర్శించుటకు అక్టోబరునెలనుండి మే నెలవరకు అనువైన మాసములు.ఉదయం 6 నుండి రాత్రి 8 లేదా 9గంటలవరకు ఆలయము తెరచియుండును. దేల్వాడరైల్వే స్టేషన్ గంగేశ్వర్ ఆలయమునకు 13 కి.మీ దూరములోనున్నది డయ్యూ దగ్గరలోని విమానాశ్రయము.