బద్రీనాథ్

(IPLTOURS)

బద్రీనాథ్ హిమాలయపర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు చామోలిజిల్లానందు చార్ ధామ్ పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్, గంగోత్రి, యమునొత్రి మరియు బధ్రీనాథ్ లలో ఒకటిగానున్న నగరపంచాయితీ. బద్రి, నీలకంఠతదితర పర్వతారోహణములకు ముఖద్వారమువంటిది. బద్రిఅనునది ఈప్రాంతమునందుపెరుగు ఒకచిన్నమరియు తినుటకు ఉపయోగపడు రుచికరమైనపండు (రేగుపండు) మరియు నాథ్ అనగా భర్త. స్థలపురాణం ప్రకారం విష్ణుభగవానుడు నర నారాయణ అవతారము నందు బదరీనాథ్ నందు బహిరంగ ప్రదేశమునందు తపస్సు చేసినాడు. లక్ష్మీ దేవి ఆయనకు వ్యతిరేక వాతా వరణ పరిస్థితులు తట్టుకొనుటకుగాను బదరివృక్షము రూపములో  ఆశ్రయము కల్పించినది. మహావిష్ణువు జీవరాశులన్నిటి క్షేమముకోరి తపస్సుచేయ నారంభించినాడని ప్రతీతి. విష్ణువు తపస్సు చేసినప్పుడు ఎండ తగులకుండా లక్ష్మీదేవి బద్రి (రేగు) వృక్షము రూపములో స్వామికి రక్షణగా ఉండుటవలన లక్షీదేవి భర్త కావున స్వామి బద్రినాధ్ అయినాడు. 

పూర్వపురోజులలో బదరీనాథ్ నడచి వెళ్లవలసి వచ్చేడిది. జగత్ గురు ఆది శంకరాచార్య 7వ శతాబ్దమునందు బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించినారు. అటుపిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రల వలననూ ఈప్రాంతములో తరచూ సంభవించు భూకంపముల వలన ఈఆలయము దెబ్బతినుట పిమ్మట అనేకమార్లు తిరిగి నిర్మించుట జరిగియున్నది. బదరీనాధ్ పుణ్యక్షేత్రము సముద్రమట్టమునకు సుమారు 12 వేల అడుగుల ఎత్తున ఉన్నది. ఇచటగల తప్తకుండం మరియు సూర్యకుండం అను రెండు ఉష్ణకుండములవలన ఇచ్చట సమఉష్ణోగ్రత సంవత్సర మంతయు ఉండును. నారద మహర్షి “ఓం నమో నారాయణాయ” అనబడు అష్టాక్షరీ మంత్రము లేదా  జపించి తపస్సు చేసినాడు. 

బ్రహ్మయొక్క అయిదవ తలనరకి అలాకానందనదిలో పడవేయుటద్వారాబ్రహ్మహత్యాపాతకమునకు గురికాబడిన శివుడు ఆపాపము నుండి విముక్తిపొందుటకుగాను తపస్సుచేయుటకు ప్రధమముగా ఈస్థలమునుఎంచుకొని తపముప్రారంభించినాడు. విష్ణుమూర్తి ఈప్రదేశమునుపొందగోరి బాలునిరూపముపొంది ఏడ్చుట ప్రారంభించినాడు. అప్పుడుపార్వతి లాలించబోగా శివుడువలదని వారించినాడు. అయిననూ పార్వతి ఆబాలుని తామునివసించు గృహములోనుంచి ఇరువురు స్నానముచేయుటకు అలకనందనదికివెళ్ళినారు. తిరిగివచ్చిచూచుసరికి బాలుడు ఆగృహము తలుపులువేసి నాలుగుచేతులతో (చతుర్భుజములతో) నారాయణతూపములో దర్శనము ఇచ్చిఆప్రదేశము కావలెనని తెలిపినాడు. అందువలన శివుడు ఆప్రదేశమును విడచి తపస్సు కొనసాగించుటకు కేదార్నాధ్ వెడలినాడు. ఆప్రకారముగా బద్రినారాయణుడు స్వయంభూః గాఇచ్చట వెలసినాడు. బదరీనాధ్ పవిత్రక్షేత్రము పూర్తి సమాచారముకొరకు బదరీనాథ్ , బద్రి విశాల్ పేజీలు దర్శించవలయును.