బధ్రీనాధ్

(IPLTOURS)

పవిత్ర హిందూదేశమున మహిమాన్విత ఆలయాలు అనేకం ఉన్నాయి. ఋషిప్రతిష్ట, మానవప్రతిష్ట ఆలయములకన్నాస్వయంభూః ఆలయములు ప్రధమము. మహావిష్ణువు ఎనిమిది దివ్యస్వయంభూఃక్షేత్రములు తమిళనాడునందు శ్రీరంగనాధ స్వామిఆలయం, ఆంధ్రప్రదేశ్ నందు తిరుమల శీవెంకటేశ్వరఆలయం, కడలూర్ వద్ద శ్రీభూః వరాహస్వామిఆలయం, తిరునల్వేలివద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ ఆలయం, నేపాల్ గందకినది తీరమున ముక్తినాధ్ ఆలయం, రాజస్థాన్ పుష్కర్ నందు వరాహ ఆలయం, ఉత్తరప్రదేశ్ నందు నైమిశారణ్యం మరియు ఉత్తరాఖండ్ నందు బదరీనాధ్.

చార్ ధామ్ యాత్రలోభాగంగా ద్వారకనుండి వారణాశి, హదీద్వార్ మరియు హృషీకేశ్ మీదుగా జోషీమత్ చేరుకొని విశ్రాంతితీసుకొని మరునాడు ఉదయం బధ్రీనాధ్ ప్రయాణించుట శ్రేయస్కరము. బధ్రీనాధ్ చామోళీ జిల్లాలో నగరపంచాయితీ. మరియు చార్ ధామ్ నాలుగింటిలో ద్వారక, పూరీ మరియు రామేశ్వరంలతో పాటునాలుగవది. సముద్రమట్టమునకు సుమారు పన్నెండువేల అడుగుల ఎత్తులోనున్న బదరీనాధ్ నందలి తప్తకుండం మరియు సూర్యకుండంఅను వేదినీటికుందములు సమఉష్ణోగ్రత ఉండునట్లుచేస్తాయి. బదరీ అనునది వాడుకలో రేగుపండు ఈప్రాంతములో బదరీ విస్తారముగా ఒక చిన్నఅధికరుచికల ఫలము మరియు నాధ్ అనిన భర్త లేక భగవంతుడు. ఇచట జూబీ (రేగు) చెట్లు అధికము. పూర్వంఇచట ఆలయ పూజారులుమాత్రం నివసించెడివారు. తరచు సంభవించు భూకంపాలవలన ఆలయము దెబ్బతిన్నది. సుమారు పద్నాలుగువందల సంవత్సరములకు పూర్వము జగద్గురు శ్రీఆది శంకరాచార్యులువారు బదరీనాధ్ ఆలయం పునరుద్ధరించారు. దర్మిలా ఈపుణ్యక్షేత్రమును సందర్శించు యాత్రికులు ప్రతి సంవత్సరము పెరిగి ప్రస్తుతం లక్షలలో ఉండుటవలన బదరీనాధ్ అభివృద్ధి చెందినది.

బదరీనాధ్ నీలకంఠ తదితర మహాపర్వతములకు ముఖద్వారము వంటిది. బదరీనాధ్ ఆలయము నగరము మధ్యభాగములో ముఖ్యఆకర్షణగా ఉన్నది, మహాశివుడు ఇచట అలకనంద నదిఒక్క్దున ఒకనల్లనిరాయిపై (శాలిగ్రామముపై) బదరీనారాయణుని కనుగొని దానిని వేడినీటి ఊటకల తప్తకుండ్ దగ్గరలో ఒకగృహనందు ప్రతిస్టించినాడు. ఘర్వాల్ రాజు ఆచటినుండి ప్రస్తుతము ఆలయముకల ప్రదేశమునకు ఆమూర్తిని తరలించినాడు. ప్రస్తుతము ఆలయముకల ప్రదేశము 50 అడుగుల ఎత్తులో బంగారు తాపడము చేయబడిన పైకప్పుతో అందముగా నిర్మించబడింది. గోపురము రాతితో మరియు వెదురుకిటికీలతో నిర్మించబడినది. వెడల్పుఅయిన మెట్లుకల మేడ యాత్రికులను ప్రవేశద్వారమువద్దకు తీసుకువెళ్ళును. నిర్మాణమంతయూ బౌద్ధఆలయమును పోలిఉండును. పెద్దపెద్ద స్తంభములతోకూడిన హాలు యాత్రికులను ప్రధాన ఆలయభాగమునకు తీసుకువెళ్ళును. మహాభారతమునందు తెలిపినట్లుగా బదరీనాధ్ చుట్టూకల పర్వతములకు అధిక ప్రాముఖ్యమున్నది. పాండవులు స్వర్గప్రయాణం బదరీనాధ్ నకు 4 కి.మీ. దూరమునందుగల మానాగ్రామమునుండి ప్రారంభించినారు.

స్వర్గారోహణనిమిత్తము బదరీనాధ్ నుండి పర్వతప్రాంతమందు ప్రయాణించుచున్నప్పుడు పర్వతసానువులయందు ఒక్కొక్కరుగా పరమపదించినారు. మానా గ్రామము చేరువలోనే వేదవ్యాసుడు మహాభారతమును రచించిన గుహకలదు. హిమాలయములను గౌరీశంకర్, కైలాష్, బద్రినాథ్, నందా, డ్రోగ్రీ, నారాయణ్, నర మరియు త్రిశూల్ నామములుకల ఎనిమిది ఆస్టపదులపేర్లతో పిలిచెదరు.

 బదరీనాధ్ ఆలయం 

జోషీమఠ్ నకు 46 కి.మీ దూరములోనున్న బదరీనాధ్ ఆలయం హిందువులకు అతిపవిత్రమైన యాత్రాస్థలము. ఈ ఆలయము విష్ణుభగవానునికి అంకితమైనది. వేదములు మరియు శ్రీహరితో పాటుగా బదరి సృస్థిప్రారంభమునుండి ఉద్భవించి నారదుడు తదితరమునులతో కీర్తించబడుచూ వారినివాసమై చార్ ధామ్ లలో ఒకటిగా పవిత్రస్థలముగా వెలుగొందుచున్నది. 

క్షేత్రసమాచారము ప్రకారం బదరీనాధ్ అందమైన ప్రకృతిదృశ్యములతో అలరారుభూలోకస్వర్గము. బదరీనాధ్ ఆలయం ప్రతిసంవత్సరము అధికహిమపాతము వలన శీతాకాలమునందు దీపావళి గడచినపిమ్మట ఆరునెలలు మూసివేయబడును. మూసివేయు సమయమునందు నేతితో అఖండదీపము వెలిగించి ద్వారము మూసివేయుడురు. 

ఈజ్యోతికి అవసరమైన ఒత్తిని సమీప మానాగ్రామమువారు భక్తిశ్రద్ధలతో తయారుచేయుదురు. ద్వారములు మూసివేసిన పిమ్మట ఆరునెలలు గడచినపిమ్మట అనగా ఏప్రియల్ లేదా మే మాసములందు బదరీ కేదార్ ఆలయకమిటీవారు ఆలయపూజారులను సంప్రదించి నిర్ణయించిన తేదీలలో తిరిగి ద్వారము తెరిచెదరు. ఆలయము మూసివేసి మరలతెరుచు ఆరునెలలకాలమునందు బదరీనాధునికి దేవతలచే దేవతలపంచాయతన పాలకసంస్థ సహకారముతో పూజలు నిర్వహించబడుననిప్రసిద్ధి. ఆలయముతెరుచు సమయమువరకు ఆలయము మూసివేయు సమయమునందుఉంచిన అఖండదీపము జ్వలించుతూఉండుట బదరీనాధ్ ఆలయదివ్యశక్తికి నిదర్శనం. బదరీనాధ్ ఆలయపూజారి కేరళనంబూద్రి కుటుంభమునకు చెందినవారు. వీరిని Ravalji అనిపిలిచేదరు.

ఆలయగర్భగృహములో యాత్రికులు పంచాయతనసభ్యులైన కుబేర, ఉద్ధవ, నరనారాయన్, నారద మరియు గరుడమూర్తులు దర్శించవచ్చును. బదరీనాధుడు ఈపంచాయతన్ పర్యవేక్షణాధికారి. బడరీనాధుడు మధ్యలోచతుర్భుజములు కలిగి పై రెండు చేతులలో శంఖము, చక్రము ధరించి క్రింది రెండుచేతులు ఒడిలోనుంచుకొని పద్మాసనముద్రలో కూర్చొనియుండగా గణేశుడు మరియు కుబేరుడు స్వామికి కుడివైపు నరనారాయణులు ఎడమవైపుకూర్చొని దర్శనము ఇస్తారు. ఉద్ధవుడు స్వామికి కుడిప్రక్క లక్ష్మీదేవిఎడమప్రక్క నిలబడియుంటారు. గరుడుడు కుడిప్రక్క, నారదుడు ఎడమప్రక్క స్వామిపాదముల చెంతకూర్చొని దర్శనం ఇస్తారు. విశ్వమునకు మేలుకలుగుటకు తీసుకొనవలసినచర్యలపై స్వామిపంచాయతనసభ్యులతో సంప్రదించినిర్ణయిస్తారని వేదములు చెపుతున్నాయి. కుబేరుడు ఇక్కడ ప్రముఖముగా కొలువబడతాడు.        

ఉద్ధవుడు శ్రీకృష్ణునికిమిత్రుడు మరియుసలహాదారు. శ్రేకృష్ణునితండ్రి వసుదేవునిసోదరుడు దేవభాగునికుమారుడు. భాగవత పురాణమునందు ఉద్ధవుడు ముఖ్యభూమికనిర్వహించాడు. ఉద్దవుడు శ్రీకృష్ణుని పోలికలతోఉండి కొన్నిసార్లు శ్రీకృష్ణుడుఅని  బ్రమించేలాఉండేడివాడు.  శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతభోధించినట్లు ఉద్ధవగీతనందు ఉద్ధవునికి యోగము మరియుఉపాసన తెలియచేసినాడు ఉద్ధవుడు. యదువంశనిర్మూలనము చెందుటకుముందుగా శ్రీకృష్ణుడు ఉద్ధవుని బదరీనాధ్ వెళ్ళి అచట జీవితకాలము నివసించమని సలహాఇచ్చినాడు. 

మోక్షము సాధించుటకు బదరీనాథ్ క్షేత్ర దర్శనముతో మార్గము సుగమము అయినది. బదరీనాథ్ క్షేత్రములో తప్త కుండము ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపములో నివసించుచున్నాడు. ఇచట భక్తులు ఆదికేదార్ శివలింగ రూపములో శివుని అర్చించు చున్నారు. బదరీనారాయణని యొక్క పాద పద్మముల చేత నున్న ఆదికేదార్ శివలింగమును పూజించేది భక్తులు పరమపదం పొందేదరనినానుడి. బ్రహ్మశిరస్సు పడినప్రదేశమైన బ్రహ్మకపాలమునకు మరియు బదరీనాధ్ ధామ్ నకు అట్టిప్రాశస్యమున్నది. పాండవులు కురుక్షేత్ర యుద్ధములో మరణించిన తమబంధువులకు సద్గతులు ప్రాప్తించుటకు శ్రీకృష్ణుని సలహామేరకు వారు స్వర్గారోహణమునకు వెల్లునప్పుడు ఇచ్చటఆగి వారిపూర్వీకులకు పిండప్రధానము చేయుటవలన వారు మోక్షము పొందారుఅని మహాభారతమునను లిఖించబడినది.

బ్రహ్మకపాలం    

స్కంధపురాణమునందు గయనందు వంశములోని పూర్వీకులకు చేసిన శ్రాద్ధ కర్మలు ఫలితముకంటే బ్రహ్మకపాలమునందు చేసిన ఎనిమిదిరెట్లు ఎక్కువఫలితము కలుగునని చెప్పబడియున్నది. అంతేకాక బ్రహ్మకపాలమునందు పెద్దలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే వారుముక్తిని పొందుతారని తెలుపబడుటయేకాక పెద్దలు ఇచట శ్రాద్ధకర్మలు ఆచరించిన ఆపెద్దలకు ప్రతిసంవత్సరం నిర్వహించు శ్రాద్ధకర్మ ఆచరించ నవసరములేదని చెబుతున్నారు. ఆవిషయం నిజంఅయినా కాకపోయినా బ్రహ్మకపాలంలో పెద్దలకు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే యాత్రికులమనస్సు నిర్మలమై పెద్దలఋణము తీర్చుకొనినామను తృప్తీకలుగుతుంది అనుటలో సందేహంలేదు. అందులకే బదరీనాధ్ క్షేత్రధర్శనము చేసినభక్తులు బ్రహ్మకపాలఘాట్ నందు పూర్వీకులకు శ్రాద్ధఖర్మలుచేసి పూర్వీకులకు ఆత్మశాంతి మరియు వారు ఉత్తమగతులు పొందుటలో మార్గంనుగమం చేయుటకు అమితముగా శ్రద్ధచూపెడుతారు. 

బ్రహ్మకపాల్ ఘాట్ బదరీనాధ్ ఆలయమునకు ఉత్తరముగా సుమారు 300 మీటర్ల దూరములో అలకనంద నదిఒడ్డుననున్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైనస్థలము. ఇచట కల నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయతఉన్నది. ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేమునితలగా భావించబడుచున్నది.

పురాణాలయందు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరులను సృష్టి, స్థితి, లయకారకులుగా పేర్కొనబడింది. బ్రహ్మ అయిదు ముఖములవాడు. నాలుగుతలలు నలుదిక్కులు చూచుచుండగా ఐదోతల పైకిచూస్తూ ఉండేది. అందువలననే బ్రహ్మను పంచముఖుడని అంటారు. ఒకసారి బ్రహ్మకు విపరీతమైన అతిశయంకలిగి త్రిమూర్తులు ముగ్గురిలో తానేగొప్పవాడను అనేభావన కలిగింధి. తనసృష్టిలేనిచో విష్ణువునకూ శివుడికి నిర్వర్తించువిధులు ఉండవని బ్రహ్మ తనచుట్టూఉన్న దేవతలు, మునులతోఅన్నాడు. బ్రహ్మకు విధేయులైన దేవుళ్లు, ఋషులు బ్రహ్మచెప్పినది అక్షరసత్యంఅని బ్రహ్మనుపొగిడారు. బ్రహ్మగర్వంతోనుండగగా, బ్రహ్మవిధేయులందు విష్ణువును అభిమానించువారు వైకుంఠానికివెళ్లి ఈవిషయాన్ని విష్ణువుతో చెప్పారు. దానితో బ్రహ్మ మరియు విష్ణు భక్తులమధ్య తీవ్రవాగ్వాదం చెలరేగింది. విష్ణువు బ్రహ్మకు ఎంతసర్థిచెప్పినా ప్రయోజనం లేకపోయింది. త్రిమూర్తుల్లో ఒకరుఎక్కువ ఒకరుతక్కువ అనేభేదభావం ఉండదని ముగ్గురూ సమానమనిచెప్పినా బ్రహ్మవినిపించుకోక పోవడంవల్ల అన్యమనస్కంగా విష్ణువు త్రిమూర్తుల్లో బ్రహ్మగొప్పవాడని ఒప్పుకొన్నాడు. విజయగర్వంతో బ్రహ్మ కైలాసానికివెళ్లి త్రిమూర్తుల్లో తానేగొప్పవాడని వాదనకుదిగేడు. ఇందువల్ల కైలాసవాసులకు, బ్రహ్మవిధేయులకు గొడవ ప్రారంభమయింది. పరమశివుడు బ్రహ్మతో వాదనకుదిగి త్రిమూర్తుల్లో ఎక్కువ, తక్కువఅన్నభేదం ఉండదని ఒప్పించాడు. బ్రహ్మ త్రిమూర్తులు ముగ్గురూ సమానమేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తనఐదోతలలోమాత్రం తానుగొప్పవాడని అనితతలచేవాడు.ఈవిషయాన్ని పరమశివుడు పసిగట్టి, ఆఆలోచనఆలాగే కొనసాగితే సృష్టిలోఅల్లకల్లోలం జరుగుతుందని భావించాడు. రానున్న ఉపద్రవంతప్పడంకోసం పరమశివుడు తనత్రిశూలంతో బ్రహ్మ ఐదోతలను ఖండించివేశాడు. ఆతల బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలోఉన్న అలకనందనదీతీరంలోపడి మోక్షం పొందిందని పురాణకథనం. పిమ్మటబ్రహ్మకు గర్వము తగ్గినదని పురాణకధనం. అదేబ్రహ్మకపాలం పేరుతో ప్రసిద్ధిచెందింది. 

మరోకథనం ప్రకారం బ్రహ్మ మన్మథుడి తపస్సుకుమెచ్చి మూడుబాణములు బహూకరించుచూ, అవిప్రయోగింపబడినవారు సమ్మోహనానికిలోనై శృంగారవాంచ పెరుగుతునని తెలిపాడు. బాణములు పనిచేయునోలేదో తెలుసుకోవడంకోసం మన్మథుడు అందులోఒకబాణాన్ని బ్రహ్మపై  ప్రయోగించాడు. బ్రహ్మలోకూడా శృంగారభావాలుపెరిగి సృష్టిచేసేపనిలో తనకుసహాయం చేయడంకోసం సృష్టించిన శతరూపఅనే అందమైనయువతిని మోహించి ఆమె ఎక్కడికిపోయినా తనకామపుకోరికలతో ఆమెను చూస్తూఉండటంతో బ్రహ్మనుంచి తప్పించుకోవాలని ఆమెఆకాశంలోకి వెళ్లిపోగా బ్రహ్మతన ఐదోశిరస్సుతో ఆమెనుకామించడం మొదలుపెట్టాడు. దీంతో సృష్టికార్యం మొత్తం నిలిచిపోయింది. ఇదిగ్రహించిన శివుడు తనఅంశఅయిన వీరభద్రుడినిసృష్టించి బ్రహ్మఐదోతలను ఖండించాల్సిందిగా ఆదేశించాడు. వీరభద్రుడు పరమశివుడి ఆదేశాలను అనుసరించి బ్రహ్మ ఐదవశిరస్సును  ఖండించి ఆతలను బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దగ్గరగాఉన్న అలకనందనదీతీరంలో విసిరివేశాడు. బ్రహ్మశిరస్సు పడినప్రాంతమే బ్రహ్మకపాలంగా పేరుపడ్డది. అలకనందలోపడిన బ్రహ్మశిరస్సునకు మోక్షముకలిగినది. పిమ్మట శివుడు బదరీనాధ్ నందు తపస్సుచేసి బదరీనాధుని పూజించి బ్రహ్మహత్యాపాతకమునుండి విముక్తుడైనాడు.  

శివుడు అప్పటినుండి తనభార్యపార్వతితో బదరీ క్షేత్రమునందు ఇతరమునులతోపాటు తపస్సుచేయుచూ నివసించసాగినాడు. అందువలననే వారణాశి బదరీక్షేత్రములవిశిష్టత అసమానమైనది మరియు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మవావివరసలు మరిచి కన్నకూతురులాంటి శతరూపను కోరడంవల్ల భూమండలంలో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని శివుడు శపించాడని పురాణకథనం. చేసినతప్పుపోగొట్టుకోవడానికి బ్రహ్మఎల్లవేళలా నాలుగుతలలతో నాలుగువేదాలు చదువుతూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మశిరస్సుపడి, ఆశిరస్సుకు మోక్షం కలిగినందువల్లే బ్రహ్మకపాలం హిందువులకు అత్యంత పవిత్రమైనప్రాంతంగా చెబుతారు ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానం చేస్తే వారికికూడా మోక్షం కలుగుతుందని భక్తులనమ్మకం. అంతేకాకుండా ఇక్కడ పితృదేవతలకు పిండప్రదానంచేస్తే మరెక్కడా పిండప్రదానం చేయాల్సినఅవసరం లేదని, ప్రతిసంవత్సరం పిండప్రదానచేయవలసిన అవసరంలేదనిచెబుతారు. అందువల్లే బ్రహ్మకపాలంనందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడానికి హిందువులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.   

ఆది కేదారేశ్వర్ ఆలయం 

ఆదికేదాశ్వరాలయం తప్తకుండం ఒడ్డున కొంచెంఎత్తులో బద్రీనాధుని ఆలయమునకు వచ్చు మార్గములోనున్నది. ఆలయము శివునికి అంకితముచేయబడినది. స్కంధపురాణముప్రకారము ఈఆలయమునకు కేదార్నాధ్ ఆలయముతో సమానమైన ప్రాముఖ్యము ఉన్నది. బ్రహ్మయొక్క అయిదవ తలనరకి అలాకానందనదిలో పడవేయుటద్వారా బ్రహ్మహత్యాపాతకమునకు గురికాబడిన శివుడు ఆపాపము నుండి విముక్తిపొందుటకుగాను తపస్సుచేయుటకు ప్రధమముగా ఈస్థలమునుఎంచుకొని తపముప్రారంభించినాడు. విష్ణుమూర్తి ఈప్రదేశమునుపొందగోరి బాలునిరూపముపొంది ఏడ్చుట ప్రారంభించినాడు. అప్పుడుపార్వతి లాలించబోగా శివుడువలదని వారించినాడు. 

అయిననూ పార్వతి ఆబాలుని తామునివసించు గృహములోనుంచి ఇరువురు స్నానముచేయుటకు అలకనందనదికివెళ్ళినారు. తిరిగివచ్చిచూచుసరికి బాలుడు ఆగృహము తలుపులువేసి నాలుగుచేతులతో (చతుర్భుజములతో) నారాయణతూపములో దర్శనము ఇచ్చిఆప్రదేశము కావలెనని తెలిపినాడు. అందువలననే శివుడు ఆ ప్రదేశము విడచి కేదార్నాధ్ వెడలినాదు అని కధనము.

తప్తకుండం   

బదరీనాధ్ ఆలయమునకు దిగువప్రాంతమునందు ఔషధ గుణములుకల సహజసిద్ధమైన వేదినీటిఊట కలదు. బదరీనారాయణుని దర్శించుకొనుటకు ముందుగా యాత్రికులు ఈతప్తకుండములో స్నానముచేసి పిమ్మట దర్శనముచేసుకొందురు. తప్తకుండము సమీపములో నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు  మార్కండేయ పేరులతో అయిదు గండ శిలలు కలవు.

శేషనేత్ర

బడరీనాధ్ ఆలయమునకు 1.5 కి.మీ దూరములో మహావిష్ణువు తల్పమైన శేషనాగు పేరుతో ఒకశిలఉన్నది. ఈరాతికి శేషనాగు కండ్లనుపోలిన ప్రకృతిషిద్ధమైన గుర్తులు కలిగి బదరీక్షేత్రమును రక్షించుచున్నది.

మాతా మూర్తి  మందిరం

బదరీనాధ్ ఆలయమునకు సుమారు 3 కి.మీ. దూరములో అలాక నంద నది ఒడ్డున ఈ మాతా మూర్తి  ఆలయము కలదు. ఈ అమ్మవారు విష్ణుమూర్తి కవల అవతారములైన  నార నారాయణుల తల్లియని భావించబడు చున్నది. మాతా మూర్తి విష్ణు మూర్తి నుండి తన గర్భముద్వారా జన్మించునట్లు వరము పొందియున్నది. ప్ర్తినెల సెప్టెంబరు నెలలో ఇచ్చట సంబరము జరుగును. మాతా మూర్తి ఆలయం బదరీనాధ్ ఆలయమునుండి విష్ణుచరణపాదుక వెళ్ళు మార్గములో నున్నది.

 విష్ణు చరణపాదుక   

శ్రీమహావిష్ణువు పాదముద్ర కలిగియున్న అందమైనప్రదేశం విష్ణుచరణపాదుక. హిందూసంస్కృతినందు చరణపాదుక అపరిమితమైన ప్రాముఖ్యత పొందినది. శ్రీమహావిష్ణువు వైకుంఠమునుండి భూమిపైకి అడుగిడినప్పుడు ముందుగా ఈరాతిపై కాలుపెట్టినట్లుగా భావించేదరు. మహావిష్ణువు పాదముద్రకలిగిన ఈప్రదేశము శుభప్రదమైనది. యాత్రికులు సరిఅయిన మార్గములో ప్రయాణించిన కొంతదూరము వేగముగా మెట్లవంటి రాళ్ళుపై నదువవలసి ఉంటుంది. నారాయణపర్వతముపైఉన్న చరణపాడుక మూడు కి.మీ. దూరములోనున్ననూ చేరుటకు సుమారు తొంభైనిమిషములు పట్టును. ఏప్రియల్ నుండి నవంబరువరకు వేసవికాలములో ప్రభుత్వము అధికారికంగా యాత్రికులను అనుమతించిన సమయములో చరణపాదుక సూర్యోదయంనుండి సూర్యాస్తమయంలోగా దర్శించవచ్చును.

ఇవికాక బదరీనాద్ పరిసరములలో మానా గ్రామము, వసుధారా జలపాతం, నరనారాయణుల ఆలయము, సూర్యకుండం, గణేశ్ గుహ, వ్యాసగుహ భీమాపూల్ మరియు పండుకేశ్వర ఆలయము చూడవలసీన ప్రదేశములు. బదరీనాధ్ నందు అన్నీ ఆలయములు సందర్శించిన  పిమ్మట యాత్రికులు జోషీమఠ్ తిరిగి వచ్చి బస చేసి మరుసటి రోజు ఉదయము బయలుదేరి తిరిగి హరిద్వార్ చేరవచ్చును.   

 బదరీ యాత్ర యువతకు ఆనందం భక్తులకు ముక్తి పూర్వీకులకు మోక్షం