ఆహోబిల నృసింహ

(IPLTOURS)

అహోబిలమునందలి నృసింహ క్షేత్రములలో ప్రధానమైనది అహోబిలనృసింహ లేదా ఉగ్రనృసింహక్షేత్రము.అహోబిల నృసింహక్షేత్రము సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తునఉన్నది. కొండదిగువ భాగమునుండి సుమారు 8 కి.మీ. నడకద్వారా లేదా ప్రయివేటు వాహనముద్వారా ఈక్షేత్రము చేరుకోనవలసి యున్నది. ఈప్రదేశమునందు నారాయణుడు ఉగ్రనృసింహ అవతారములో హిరణ్యకశిపుని చీల్చి సంహరించిiనాడు. స్థానిక కధనము ప్రకారము హిరణ్యకశిపుని చీల్చిన పిమ్మట దేవతలు నృసింహుని ఉగ్రరూపమునకుభయపడి బలవంతుడవనికీర్తించినారు. అందువలననే ఈస్వామికి (అహోబల) అహోబిలనృసింహుడని పేరువచ్చినది. ప్రహ్లాదుడు నృసింహుని ఉగ్రరూపమును శాంతపరచుటకు ప్రయత్నించి సఫలము కాలేదు. స్వయముగా శివుడు ప్రయత్నించిననూ సాధ్యమకాలేదు. నృసింహుడు అదేఉగ్రరూపముతో స్వయంభూః సాలిగ్రామముగా వెలసినాడు.

Ahobilam-Temple23

ఆదిశంకరాచార్య కాపాలీకులవలన చేయిపోగొట్టుకొనినప్పుడు ఆయన లక్ష్మీనృసింహ కరావలంబస్త్రోత్రము పఠించి శివలింగము మరియు సుదర్శన సింహ యంత్రము ఈఆలయమునందు స్థాపించినారు. గరుడుడు ఇక్కడ తపస్సుచేసి నృసింహుని దర్శించుకొనినాడు. ఆలయములో ప్రవేశించిన వెంటనే నృసింహునికి ఎదురుగా శివుడు దర్శనము ఇచ్చేదరు. సహజమైన గుహఅయినందువలన ఈఆలయము ముఖమండపము మరియు మహామండపము తూర్పుముఖముగా మరియు గర్భగుడి ఉత్తరదిక్కుగా ఉండును. ముఖమండపమునకు చేర్చి ధ్వజస్తంభము మరియు అలంకారంచబడిన బలిపీఠము కలదు. తూర్పువైపు కల ప్రవేశద్వారమునుండి మాలోలమరియు జ్వాలానృసింహ క్షేత్రములకు వెళ్లవచ్చును. పెద్దగుడ్డును పోలిన పెద్ధరాతినితొలచుటద్వారా మండపములు ఏర్పాడు చేసినారు. ఇచటవిగ్రహము స్వయంభూః అని తలచెదరు. శాలిగ్రామరూపములో అహోబిలనృసింహుడు సుఖాసనముద్రలో హిరణ్యకశిపుని తనతోడలపైనుంచుకొని రెండుచేతులతో హిరణ్యకశిపుని తలను రెండుకాళ్లను  నొక్కిపెట్టి ఛాతీచీల్చుచూ భయంకరముగా దర్శనం ఇస్తాడు. ఒకవైపుప్రహ్లాదుడు రెండుచేతులుజోడించి ప్రణమిల్లుతూ కనపడతాడు. ఉత్సవవిగ్రహము దిగువఅహోబిలములో ప్రహ్లాదనృసింహక్షేత్రమునందు బధ్రపరచెదరు. 

 మరియొకఆలయమునందు అమ్మవారైన చెంచులక్ష్మి పద్మాసనముద్రలో దర్శనమిస్తుంది. లక్ష్మీదేవి గిరిజన చెంచుజాతినందు జన్మించి నృసింహుని వివాహమాడినది. చెంచుజాతివారు ఈరోజునకుకూడా ప్రణవనృసింహ ఆలయమునకు సమీపములో నున్న చెంచులక్ష్మికి మాంసానివేదన చేస్తారు. ఈరెండు కొండల శిఖరములు వేదాద్రి మరియు గరుడాద్రిగా పిలువబడుతూ వీటిద్వారా భవనాశిని తీర్ధము ప్రవహిస్తు ఉంటుంది. అహోబిలనృసింహుడు గురుగ్రహమునకు అధిపతి. మరియు గురుగ్రహము ఆర్ధిక పరిపుష్టి , సంతోషము, ఉన్నతవిధ్య, వాజ్యపరమైన చిక్కుల నుండి విముక్తి మరియు సంతానమునుండి కలుగు చీకాకులనుండి వికుక్తి కలుగజేయువాడు. అహోబిల నృసింహుని అర్చించిన  గురుగ్రహ దోషములనుండి విముక్తులు అగుటతోపాటు అధికలాభములు పొండేదరని కధనము. 

IPLTOURS Indian Pilgrim Tours