శ్రీ జగజ్జనని దేవాలయం
(నంధ్యాల)
(IPLTOURS)
సర్వ జగత్తుకు కారణభూతమైన జగజ్జనని ఉత్తరాదిన సముద్ర మట్టమునకు సుమారు ఇరవై వేల అడుగుల ఎత్తున మానస సరోవర్ ప్రాంతములో స్వయంభూః వెలసిన అమ్మవారు. ఈ ఆలయము నకు అతి దగ్గరలోని మానస సరోవర్ నందు ముక్కోటి దేవతలు బ్రహ్మ మూహూర్తమునందు స్నానము ఆచరించి జగజ్జననిని కొలిచేదివారని పురాణములందు మరియు వేదములందు తెలుప బడినది కాపాలికా విధి, వామకేశ్వరతంత్రం, శక్తిస్తల్, దేవీ భాగవతం, కార్తికేయ తదితర పురాణాల్లో శ్రీ జగజ్జననీ అమ్మవారి గురించి విపులముగా ప్రస్తావన ఉన్నది. జగజ్జనని ఆదిపరాశక్తి కనుక ఆమెనుండియే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియు త్రిశక్తులు సరస్వతి, లక్ష్మీదేవి మరియు పార్వతి, జగజ్జనని నుండి ఉద్భవించినవారే. వారికేమాత్రమే భర్త అనేడి అంశాశక్తి ఉంటుంది. ఈ అమ్మవారు ఒక్కో ప్రాతంతో ఒక్కో పేరుతో వెలయుట వలన అమ్మవారిని మహామాయ, యోగమాయ ఆదిపరాశక్తి పేరులతో కొలుస్తారు. జగత్తునంతటిని సృస్టించినది కావున ఇచట ఈమెకు జగజ్జనని పేరు ప్రసిద్ధమైనది.
ప్రపంచములో కల రెండు జగజ్జననీ ఆలయములలో ఒకటి ఉత్తరాదిన చైనా దేశపు సరిహద్దు నందు హిమాలయ పర్వతములలో మానససరోవర్ ప్రాంతంలో ఉండేడిదని, మానస సరోవరమునందు వెలసిన స్వయంభూః విగ్రహము ద్వంశమైనదని సిద్ధుల వలన తెలుస్తూంది. హిమాలయాల్లో విరాట్ స్వరూపంతో ఏవిధముగా వెలసినదో అదే తీరుతో కలియుగములో నంధ్యాల పట్టణము నడిబొడ్డున వెలసినది. జగజ్జననీ అమ్మవారు ఆదిశక్తి స్వరూపం. ఉదరములో పంచముఖ మహాశివుడు, పాదపీఠశాయిగా శ్రీమహావిష్ణువు, మహావిష్ణువు నాభి నుండి పశ్చిమభాగంలోని క్రింది చేతిలో చతుర్ముఖబ్రహ్మతో జగజ్జననీ అమ్మవారి విగ్రహం చాలా మనోహరంగాఉంటుంది. శ్రీజగజ్జననీమాతకు 17 తలల ఆదిశేషుడు పడగపట్టి వుంటాడు. సింహం వాహనంగా ఉంటుంది. అమ్మవారి కుడివైపు ఒకచేతిలో చంద్రమండలం, రెండవచేతిలో భూమండలం, మూడవచేతిలో సూర్య మండలం, లక్ష్మీదేవి, అభయహస్తంలో త్రినేత్రం, త్రిశూలం మరియు ఎడమవైపు ఒకచేతిలో శంఖు, రెండవచేతిలో ఢమరుకం, మూడవచేతిలో ధనస్సు, నాల్గవచేతిలో చతుర్ముఖ బ్రహ్మ ఉంటారు. ఆలయ గోపురం ముక్కోటి దేవతలు, సప్తమాతృకలు, నవదుర్గలు, కామధేనువు, కల్పవృక్షం, అష్టాదశ శక్తిపీఠముల ప్రతిమలతో చూచుటకు వేయికనులు చాలవుఅన్నట్లు ఉంటుంది.
మహా పుణ్య క్షేత్రముల జీవనదులలో, చతుర్ సముద్రాలలో స్నానమాచరించి, ముక్కోటిదేవతల క్షేత్రాలను దర్శిస్తే ఎంతటి పుణ్యఫలమో నంద్యాలలోని దేముడు మరియు దేవతాస్వరూపములు రెండునూ ఒక్కటే అయి శక్తి స్వరూపిణిని అయిన ఈ దేవాలయములోని ఆదిశక్తిస్వరూపము దర్శించుకోవడంవల్ల పుణ్యఫలముతోపాటు జన్మ ధన్యమౌతుంది. ” ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ జగజ్జనన్యై నమః “ అనునది అమ్మవారి మంత్రము. ఈమంత్రముతో ధ్యానిస్తే అమ్మఆశీస్సులు లభిస్తాయి. ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధపాడ్యమినుండి కార్తీకపౌర్ణమివరకు మండలదీక్షలు స్వీకరిస్తారు. స్త్రీలు దసరా పదిరోజులలో లేదా కార్తీకపౌర్ణమికి 11 రోజులుముందు మాలధరించ వచ్చును. పురుషులుమాత్రం 40 రోజులు దీక్షస్వీకరించాలి. ఈఆమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు రాహుకాలపూజలు విశేషంగా జరుగును. అమావాశ్య మరియు పౌర్ణమిపూజలు విశిష్టంగా జరుగుతాయి. సూర్యగ్రహణము, చంద్ర గ్రహణములలో అమ్మవారికి ప్రత్యేకపూజలు జరుగుతాయి. ఐచ్చికముగా మనకు నచ్చితేనే అక్కడ హుండీలో కానుక వేయవచ్చు. దసరాలలో ఇక్కడ పూర్తి పండుగ వాతావరణము ఉంటుంది. గ్రహణసమయములో కాళహస్తిలోవలె యీగుడి తెరచి ఉంటుంది. గ్రహణసమయంలోలో కొన్నివేలమందిచే సామూహిక కుంకుమార్చన చేయిస్తారు. యీఅమ్మవారు ఉగ్రస్వరూపిణి కావున అమ్మవారి కనులయండలి ఉగ్రము తగ్గించుటకు ఆలయము మొదటి అంతస్తులో నిర్మించి ఆలయానికి ఎదురుగా ఉన్న చెరువునందలి నీరు అమ్మవారికళ్ళకు నిత్యం కనపడేటట్ట్లుగా అమ్మవారిని ప్రతిష్టించారు.
యీ దేవాలయంలో కట్టుబాట్లు చాలా స్పస్టంగాఉంటాయి. ఖచ్చితముగా అమలు కాబడుతున్న ఆకట్టుబాట్లు సమాచారము అందించుచున్నాము. యీదేవాలయంలో అమ్మవారికితప్ప పూజారితోసహా ఇంకఎవరికి నమస్కరించకూడదు. యీఆలయం సందర్శించిన అందరు దంపతులు పుణ్యస్త్రీలచే అమ్మవారికి కుంకుమపూజ చేయిస్తారు. చేయించినందులకు బ్రాహ్మడికి దక్షణకానీ కుంకుమఖరీదు కానివీరు తీసుకొనరు. యీఆలయంలో పూర్తి సంప్రదాయదుస్తులతో ఆడవారు జడవేసుకొని కుంకుమతో మాత్రమే బొట్టుపెట్టుకొని వెళ్ళాలి. చీర, లంగావొణీలు మాత్రమే ధరించాలి బిగుతుదుస్తులు అంగప్రదేయర్శన చేయు దుస్తులు నిషేధము. అట్లు లేకపోయిన అక్కడి సేవకులు జడవేసి కుంకుమబొట్టు పెట్టుకొనిన తరువాత మాత్రమే ఆలయ ప్రవేశమునకు అనుమతిస్తారు. పురుషులు నిక్కర్లు, షాట్లు, బనియన్లతో ప్రవేశము నిషిద్ధము. 15 సంవత్సరములు మరియు అంతకు తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు గర్భాలయ ప్రవేశము లేదు.
ఈఆలయం ఉదయం 6-00 నుండి మధ్యాహ్నం 1-00 వరకు తిరిగి 2-00 నుండి రాత్రి 9-00 వరకు తెరచి ఉంటుంది.
జగజ్జననీ దర్శనం సర్వ పాపహరణం శుభప్రదం
Photo Gallery
IPLTOURS – Indian Pilgrim Tours