మానస సరోవర్

(IPLTOURS)

కైలాస శిఖర దర్శనం మరియు మానస సరోవర్ యాత్ర అనునది ప్రతి మానవుని స్వప్నము. కానీ యాత్రలన్నిటిలోకి అత్యంత కష్టమైన యాత్రలు మానస సరోవర్ యాత్ర మరియు అమరనాధ్ యాత్రలు. అధిక శక్తి ఆరోగ్యవంతమైన శరీరము మరియు మానసిక ధృఢత్వము కలిగిఉన్న యాత్రికులు మాత్రమే మానస సరోవర్ యాత్ర చేయుటకు ఉత్సాహం చూపవలెనని తెలియజేయు చున్నాము. మానస సరోవర్ మరియు కైలాస పర్వతము దర్శనమునకు శివుని అనుమతి తప్పనిసరి. 2001 సంవత్సరము వరకు మానససరోవర్ ఎవరును చేరి యుండలేదు. 2001 సంవత్సరములో ఒక భక్తులగుంపు అనేకవిధమైన ఆటంకములుదాటి ఈ పవిత్ర ప్రదేశము చేరుకొన్నది. ఈ యాత్రలు చేయడానికి శారీరకంగా మరియు మానసికంగా ధృఢత్వము కలిగి యుండాలి. మానసిక దౌర్భల్యము కలవారుగానీ శరీర ధృడత్వము లేనివారు కానీ ఈ యాత్రలు చేయడం ఆసాధ్యము. యాత్ర చేయువారి శారీరక ధృఢత్వము ముందుగా పరీక్ష చేసి పిమ్మట మాత్రమే యాత్రకు అనుమతించబడతారు. అమరనాధ్ యాత్ర కంటే కూడా మానససరోవర్ యాత్ర మరింత కష్టము. మానససరోవర్ యాత్రకు సుమారు 50కి.మీ. నడవవలసి ఉంటుంది. అచ్చటినుండి కైలాసపర్వతము ప్రధక్షణనిమిత్తము 30 కి.మీ పర్వతము చుట్టూ నడవవలసిన అవసరం ఉంది. హెలీకాప్టర్ ప్రయాణమునకు మనిషి ఒక్కరికి సుమారు రూ2,10,000/- వరకు ఖర్చు కాగలదు.

మానస సరోవర్

మానస సరోవర్ హిమాలయములలో ఒక రహస్యమైన అంతుచిక్కని నిగూఢ ప్రదేశము. ఈ ప్రాంతములోనే దేవతలు అందరూ నివసించుతారని నమ్మకం ఋషులు, నాగ సాధువులు మరియు అఘోరాలు వేల సంవత్సరములుగా ఆహారము మరియు ఆశ్రయము లేకుండా కేవలము గాలి పీల్చుకొని ఈ హిమాలయ పర్వత ప్రాంతములో తపస్సు చేయుచుంటారు. ఈ తపస్సు చేయుచున్న ఋషులు మరియు అఘోరాల వయస్సు నిర్ధారణ చేయుట ఊహకు అందనిది. కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యంత ప్రతిష్టాత్మకముగా జరిపే కుంభమేళా సమయమునందు ఈ ఋషులు, నాగ సాధువులు మరియు అఘోరాలు లక్షలాది మంది హిమాలయములనుండి  వారణాశి, అలహాబాద్, హరిద్వార్ తదితర యాత్రా స్థలములకు వచ్చేదరు. ఇటీవల ప్రయాగ నందు 2019 నందు 4500 ఖర్చుతో కుంభమేళా నిర్వహించినారు.

MountKaillash

ఈ కుంభమేళానకు వచ్చిన  జనసందోహము గిన్నీస్ బుక్ నందు స్థానము సంపాదించినది. వీరు అందరు విజ్ణానమునకు అందని కారణముతో వందల సంవత్సరములు ఎలా జీవించి ఉంటారో అగమ్యగోచరము. యోగులు మోక్షము పొందేవరకు ఐహిక సుఖములు వదలి ఇంకా జ్ఞానము సంపాదించాలని జీవిస్తూంటారు. యోగులు హటయోగము చేయుటవలన గుండె కొట్టుకొనుట మరియు గాలి పీల్చుకొనుట నియత్రించి వార్ధక్యము రాకుండా మోక్షము సిద్ధించేవరకు జీవనము సాగిస్తారు. కొందరు యోగులు వారికి గల శక్తిచే పంచేద్రియములను అదుపులో ఉంచుకొన గలుగుతారు. మనము నిత్య జీవితములో కలుగు సుఖదుఃఖములతో జీవితముఅనుభవించుచూ 70 లేదా 80 ఏండ్లు మాత్రమే జీవించెదము. జీవితములో శారీరకము, భావోద్వేగము, పరిణామక్రమము అను మూడు మార్గములు ద్వారా మన శరీరములోని శక్తిని కోల్పోవుతుంటాము. ఈ సాధువులకు మన భౌతిక జీవితముపై ఆశక్తిఉండదు. వారి శక్తి నంతటినీ ఏకాగ్రతగా ధ్యానముపై నిలిపెదరు.వారు వందల సంవత్సరములు కొద్దిపాటి విరామములతో  మోక్షము పొందేవరకు  తపస్సుపై ఏకాగ్రత నిలిపెదరు కావున వారికి ఆహారము అవసరము లేదు. వారి శరీరముపై పుట్టలు, చెట్లు చేరినా లేక మంచు అలముకొన్ననూ వారికి మరణము సంభవించదు.మనస్సు ఏకాగ్రతమరియు జీవముతో ఉండుటకు మాత్రమే వారికి శక్తి అవసరము. వారికి ఏకాగ్రతకు మాత్రమే శక్తి అవసరము. మోక్షము సాధించుట నెమ్మదిగా జరుగునది ఎక్కువ సమయము తీసుకొనును కావున సాధారణ ఒత్తిడులనుండి విముక్తులుగా ఉండుట ఉపయోగపడుతుంది.

చైనా దేశ సరిహద్దులో స్వయంపాలిత టిబెట్ నందు అతి ఎత్తు ప్రదేశములో కైలాస పర్వతము వద్ద ఉన్న ఒక మంచి నీటిసరస్సు మానస సరోవరం. ఈ సరస్సు హిందూ, బౌద్ధ మరియు జైన మతములకు భగవంతుడు ప్రసాదించినది అని నమ్ముస్థలము. మన అనగా బుద్ధి మరియు సరోవర అనగా సరస్సు. సముద్ర మట్టమునకు సుమారు పదిహేను వేల అడుగుల ఎత్తులో మానస సరోవరము ఉన్నది. మూడు వందల అడుగుల లోతుగాను గుండ్రముగాను పెద్ద విస్తీర్ణము కలిగి గంగానదితో రక్షతల్ సరస్సు వద్ద కలయు ప్రదేశములో ఈ మానస సరోవరం ఉన్నది. మానస సరోవర్ నందలి అధికపు నీరు ఉప్పునీటితో నిండి యుండు రక్షతల్ సరస్సునకు పారును. ఈ సరస్సుసట్లెజ్ నది పరీవాహక ప్రాంతమును వేరు చేయుచున్నది. వేసవి కాలములో అందమైన ఈ ప్రాంతము హంసలకు నివాసము. 

మానస సరోవరము స్వచ్ఛతకు ప్రతిభింబముగా భూమిపై బ్రహ్మచే సృస్టించబడినది. ఈసరస్సు నందలి నీరు త్రాగుట వలన అన్నిరకముల పాపములను పోగొట్టి మరణానంతరము శివసాన్నిధ్యము పొందుదురు. భగవద్గీతనందు పీర్కోనబడిన అయిదు పవిత్ర సరస్సులు మానస సరోవర్, బిందు సాగర్, నారాయణ సరోవర్, పంపా సరోవర్ మరియు పుష్కర సరోవర్ అనునవి.

బౌద్ధులు అనవతప్త మరియు మాయ దంపతులు బుద్ధునికి ఇచట జన్మనిచ్చినట్లుగా తలచెదరు. ఈ సరస్సుపై బౌద్ధమత గ్రంధములలో అనేక ప్రవచనములు మరియు కధలు కలవు. బుద్ధుడు ఇచట అనేకసార్లు తపస్సు చేసినాడు. జైనులలో మొదటి తీర్ధంకరుడైన ఋషభుడు ఈ సరస్సువద్దనే ఉండి అష్టపద శిఖరము పైననే  నిర్యాణము చెంది  యున్నాడు. ఆతని కుమారుడైన చక్రవర్తి భరత్ ఈ ఆష్టపద శిఖరము పైననే వజ్రములతో అలంకరించబడిన భవనము నిర్మించినాడు.   

మానస సరోవర్ యాత్ర

మానస సరోవర్ యాత్ర రెండు వలయముల ద్వారా చేయవలెను. భాహ్యవలయము లోపలి వలయము. భాహ్యవలయము సుమారు 52 కి.మీ. దూరముకలిగి డర్చిన్ వద్ద ప్రారంభమై వారివారి శారీరకధారుద్యము అనుసరించి దిరపుక్ మఠము, ద్రోల్మాల మరియు జూటూల్పుక్ మఠము వద్ద మజిలీలతో మరలా డర్చెన్ వద్ద ముగియును. యాత్రికులు ఒకరోజు నుండి మూడురోజులు కైలాస పర్వత యాత్రలో గడుపవలసి ఉంటుంది. 

కైలాస పర్వత యాత్ర ఒక రోజులో పూర్తి చేయుటకు శారీర ధారుడ్యము, శక్తి మరియు అతి ఎక్కువ సత్తువ అవసరం. స్థానికులు మరియు నడకలో అనుభవము కలిగిన వారు వారికి కలిగిన శక్తితో యాత్ర పూర్తి చేయదురు. యాత్రికులు దిరపుక్ మఠము 12 గంటలకు చేరుటకు వీలుగా ఉదయమే 5 గంటలకు నడక మొదలు పెట్ట వలసి ఉంటుంది పిమ్మట వారు సాయంత్రం 4 గంటలకు ద్రోల్మాల తిరిగి రాత్రి 10 గంటలకు డర్చిన్ తిరిగి చేరుకోగలుగు తారు. మొత్తం యాత్త్ర 15 నుండి 18 గంటల సమయం పడుతుంది. 7 గంటల సమయములో పగలు పూర్తి అయి రాత్రి 10 అయే సరికి చీకటి అలుముకుంటుంది. రెండురోజుల యాత్ర: ఈ యాత్రను రెండు రోజులు చేసినట్లయిన కొద్ది సులువుగా చేయవచ్చును. యాత్రికులు మాత్రము అధిక శక్తి ఆరోగ్యవంతమైన శరీరము కలిగి ఎక్కువ ఎత్తులో అశక్తత అనారోగ్యము కలుగకుండా ఉండవలయును. మొదటి రోజు డర్చిన్ వద్ద యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఒక గంట  ప్రయాణించి శిఖరము చేరుకొని గోపురము వద్ద ప్రార్ధన పతాకములతో కూడిన ప్రకృతి రమణీయత అందము దర్శించవచ్చును. మరలా ఎగుడు దిగుడులతో కూడిన రోడ్డుపై నడక ప్రారంభించి  3 లేదా 4 గంటలు ప్రయాణించి దిరపుక్ మఠము సాయంత్రం 4 గంటలకు చేరుకోనవచ్చును. రెండవ రోజు యాత్రికులు ఉదయమే బయలుదేరి  8 నుండి 12 గంటల మధ్యలో ద్రోల్మాల చేరి అచ్చటి కాంప్ నందు ఆహారము సేవించవలెను. భోజనము అయిన పైమ్మట 2 నుండి 3 గంటలు ప్రయాణించి జూటూల్పుక్ మఠము చేరి ఆచటి నుండి 3 లేదా 4 గంటలు ప్రయాణించి తిరిగి దర్చేన్ చేరవచ్చును, కానీ చాలామంది యాత్రికులు మొదటి రోజు దిరపుక్ మఠము రెండవ రోజూ జూటూల్పుక్ మఠము నందు బస చేసి మూడవ రోజు తిరిగి దర్చేన్ చేరేదరు.

కైలాస పర్వతము

కైలాస పర్వతము సుమారు 21,778 అడుగుల ఎత్తు కలిగి అధిరోహించుటకు సాధ్యము కాదని చెప్పబడినది. Hugh Ruttledge అను విదేశీయుడు ఈ పర్వతము ఈశాన్య దిక్కున సుమారు 6వేల అడుగులు ఉండునని అంచనా వేయగా ఒక షెర్పా సహాయముతో 1926 సంవత్సరములో విల్సన్ అనువారు ఆగ్నేయ దిక్కున పర్వతము శిఖర భాగము చేరుకొనుటకు అనువుగా యుండునని ప్రయత్నించినాడు. ఆయన ఎక్కుటకు ప్రయత్నించు చుండగా మంచు విరిగిపడి ఎక్కుట యందు అవరోధము కలిగించినది. పాపము చేయనివార్కి మాత్రంమే కైలాస పర్వతము ఎక్కుట సాధ్య పడునని 1936 లో హెర్బెర్ట్ అను విదేశీయుడు తెలియచేసినాడు. చైనా ప్రభుత్వము 1980లో అనుమతి ఇచ్చిననూ రేయింహోల్డ్ అనునాతను నిరాకరించినాడు. మరలా 2001 లో ఒక విదేశీ గుంపునకు ఈ పర్వతము ఎక్కుటకు చైనా ప్రభుత్వము అనుమతించినది కానీ అది అంతర్జాతీయ విమర్శకు దారి తీయుటవలన చైనా ప్రభుత్వము కైలాస పర్వతము అధిరోహించుట నిషేధించినది. కైలాస పర్వతము శివుని నివాసముగా తలచెదరు. అనేకమంది శాస్త్రజ్ణులు విదేశీయులు మరియు యాత్రికులు ఈ ప్రాంతము అద్భుత ప్రదేశముగా ఇష్టపడతారు. కొద్దిమంది మాత్రము కైలాస పర్వత యాత్ర చేయ కలుగు తారు. రోడ్డు నిటారుగాను పదునుగాను రాళ్ళతో ఉంటుంది. గంట గంటకు వాతావరణము మారుచూ యాత్రికులు అధిక సూర్యరశ్మితోనూ, అధిక మంచు తోనూ, బలమైన గాలులను ఎదుర్కొనవలసి ఉంటుంది. కైలాస పర్వత ప్రధక్షణ చేయు వలయము సుమారు 30 కి.మీ.వృత్తము కలిగి ఒక రోజు వ్యవధి పడుతుంది. కైలాస పర్వత క్రింది భాగమున స్వస్తిక్ ఆకారములో ఒక పెద్ద మంచు పలక కనపడుతుంది. ఈ యాత్ర డర్చన్ వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుంది.

కైలాస మానస సరోవర్ యాత్ర చేయుటకు సూచనలు

  1. యాత్రికులు గడియారము తిరుగు మార్గములో నడువ వలేను.
  2. నవంబరు నుంచి మార్చి వరకు రోడ్డు మంచుతో కప్పబడి అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు కాబడుతుంది. కావున ఏప్రియల్ నుండి అక్టోబరు మాసముల మధ్య యాత్ర చేయవలేను. ఏప్రియల్ నుండి అక్టోబరు మాసములలో జూలై మరియు ఆగస్టు నెలలు వర్షా కాలము కావున బలమైన గాలులు వీచే అవకాశముండును.అందువలన బయలుదేరు సమయమును బట్టి అవసరమైన దుస్తులు మరియు ఇతర సామగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది.
  3. ప్రధానమైన సౌకర్యాలు, మరియు వసతి ఈయాత్రలో మఠముల యందలి అతిధి గృహములలో మరియు డేరా ఇండ్లలో లభించును. యాత్రికులు తాము నిద్రపోవుటకు అవసరమైన సామాగ్రి తీసుకు వెళ్లవలసి ఉంటుంది. ప్రాధమిక ఆహారము లభ్యమౌతుంది కావున యాత్రికులు టమాటో పాటు తేలిక ఆహారము, తిను బండారములు తీసుకు వెల్ల వలసి ఉంటుంది.
  4. ఈ యాత్రకు టిబెట్ టూరిస్టు పర్మిట్ అత్యంత ప్రధానమైనది. ఈ పర్మిట్ లేకుడా యాత్రికులు రైలు మరియు విమాన ప్రయాణము చేయలేము. ప్రయాణ పర్మిట్ తో పాటు బోర్డర్ పాస్ మరియు మిలిటరీ పర్మిట్ అవసరము. ట్రావెల్ ఏజెన్సీ యాత్రికుల తరపున అన్నీ పర్మిట్లకు ధరఖాస్తు చేస్తారు.
  5. సాధారణము సౌకర్యవంతము మరియు వెచ్చని దుస్తులు బలమైన నీటికి తడవని బూట్లు కైలాస మానస సరోవర్ యాత్రకు అవసరం అవుతాయి. యాత్ర నందు సౌకర్యము కొరకు యాత్రికులు తేలికైన తక్కువ సామాగ్రితో ప్రయాణించవలెను. సామాగ్రి మోయుటకు గుర్రములు లభ్యమగును.

ఈ యాత్ర చేయుటకు ఖాట్మండూలో యాత్రికునికి రూ 1,50,000/- చొప్పున చార్జ్ వసూలు చేసి హెలీకాప్టర్ యాత్ర ఏర్పాట్లు చేయుటకు అనేక ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నవి.