శైలేశ్వరం
(IPLTOURS)
శాలేశ్వరం ఆలయమునే శైలేశ్వర ఆలయము అని కూడా అంటారు. మెహబూబ్న గర్ జిల్లాలో విస్తరించిన రమణీయ నల్లమల అటవీ ప్రాంతములో శ్రీశైలము నుండి పడమర వైపుగా కృష్ణా నదికి ఆవలి వైపున మల్లాపూర్ గ్రామమునకు సుమారు 40 కి.మీ. శ్రీశైలమునకు 60 కి.మీ. దూరములో కొండ గుహలో నున్న ఈ లింగమయ్య స్వామి ఆలయం గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. సుమారు 58 కి.మీ. వాహనములో ప్రయాణించి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి ఈ ఆలయము చేరుకోవలసి ఉంటుంది. ఈ ఆలయము సంవత్సరములో చైత్ర శుద్ధ పౌర్ణమి నాటి నుండి కేవలము 5 రోజులు మాత్రము ఏప్రియల్ నెలలో తెరచి ఉంటుంది. కావున అవగాహన నిమిత్తము వివరములు చూపరులకు అందించు చున్నాము. ఈ శివాలయమునందు సర్వేశ తీర్ధం మరియు పుష్కర తీర్ధం అను రెండు కొనేరులు కలవు. సన్నని గుహలో ఇటుకలతో కట్టబడిన ఈ అలయము 6 లేదా 7వ శతాబ్దమునందు నిర్మించబడినది.
16 వ శతాబ్దము నందు శేషనాధుడు వ్రాసిన శ్రీ పర్వత పురాణము నందు శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్రతో పాటు ఈ కాళేశ్వర ఆలయ ప్రాశస్తము గురించి వివరించినాడు. ఆలయమునకు ముందు భాగమున 200 మీటర్ల ఎత్తైన జలపాతము మిక్కిలి రమ్యముగా నుండి సందర్శకులకు ప్రకృతి సౌందర్యముతో ఆనందము ఆహ్లాదము కలిగించును. శైలేశ్వరం లింగమయ్య ఆలయ వివరములు 084660 98157 నకు ఫోన్ చేసి తెలుసుకన వచ్చును. ఆలయము ఉదయం 6 నుండి 11 వరకు సాయంత్రం 4 నుండి 8 వరకు తెరచి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ఆలయము తెరుచు తేదీలలో ఈ ఆలయ సందర్శనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయదురు. మిగిలిన రోజులలో ఆటవీశాఖ వారి ప్రత్యేక పర్మిషనుతో దర్శించవచ్చును. మీట్ అప్ వారు హైదరాబాదునుండి ప్రయాణము ఏర్పాట్లు మనిషి ఒక్కరికీ రూ.1000/- చార్జ్ చేస్తారు. సూర్య అను వారిని 9700986427 నెంబరుకు ఫోను చేసి వివరములు తెలుసుకొనవచ్చును.