ప్రయాగరాజ్
(IPLTOURS)
వారణాశినుండి 122 కిమీ దూరంలోనున్న ప్రయాగరాజ్ నకు రైలుసదుపాయం ఉన్నది. ప్రయాగరాజ్ ప్రయాణించుటకు 18 కిమీ దూరంలోని ముఘల్సారాయ్ నుండిఎక్కువగా రైలుసదుపాయం ఉండుటవలన ముఘల్సారాయ్ నుండి ప్రయాణించుట ఉత్తమం. ప్రయాగరాజ్ నందు పిండప్రధానం పూర్తిచేసి యాత్రికులు తిరిగి ఆదేరోజు రాత్రికి వారణాశి చేరవచ్చును.
ప్రయాగరాజ్ నందు పిండప్రధానం తదితర కర్మ్లలను చేయించు క్షేత్ర పురోహితులు అనేకులు కలదు. అందరూ ఉత్తర భారతదేశంకు చెందిన పురోహితులు. బ్రహ్మశ్రీ హరి జగన్నాధ శాస్త్రి, మరియు అతని కుమారుడు లక్ష్మణ కుమార శాస్త్రి చాలా సంవత్సరాల నుండి క్రమపద్ధతిలో ఆచారాలను నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతంలోని పురోహితులలో సుపరిచితులు. వీరు పిండప్రదానం కార్యక్రమములు వారి ఆధ్వర్యములో జరిపించుచున్నారు. ఇదివరలో వారు కర్మలుచేసేవారి కుటుంభసభ్యులకు వారిస్వగృహం సమీపంలో భోజనం ఏర్పాట్లు చేసేడివారు.
క్రొత్తగా ప్రయాగరాజ్ క్షేత్రం వచ్చువారు వీరికి ముందుగా ఫోనుద్వారా తెలియపరచినట్లయిన రైల్వే స్టేషన్ నందు స్వాగతించి మరలా కార్యక్రమం అయినపిమ్మట స్టేషన్ నందు దిగబెట్టు సదుపాయం కలుగజేయుచున్నారు. శాస్త్రోక్తంగా జరిపించిననూ గతములో కార్యక్రమమునకు ఖర్చు తక్కువ అయ్యేది. కానీ ప్రస్తుతం కర్త స్తోమతను బట్టి కర్మలు ఏర్పాటు చేయుచున్నారు. ఘట్టములందు స్థానిక పండాల ఆధ్వర్యంలో కర్మలు జరిపించబడుచున్నవి. బ్రహ్మశ్రీ హరి జగన్నాధశాస్త్రీ వీరి కుమారులు లక్ష్మణకుమారశాస్త్రి క్షేత్ర పురోహితులను 0532- 2501729, 0542-2506058, 9415238615, 9389195891 లందు సంప్రదించవచ్చు. పిండములు గంగా, యమునా మరియు అంతర్వాహిని సరస్వతీనదుల త్రివేణి సంగమ తీరమునఛేసి పిండములను సంగమములో కలుపవలసిఉన్నది. వీరు ఇదివరలో వలెకాక కర్మ జరిపించినపిమ్మట కర్మ చేయువారి కుటుంభమును వారిఇంటివద్ద ఉన్న శ్రీ లలితా పరమేశ్వరీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సమాజం అనుచోట భోజనమునకు మళ్లించుచున్నారు. అచ్చటివారు నిత్యాన్నదానమని పేర్కొనిననూ ఒక్కొక్కరికి రూ 100/- చొప్పున తీసుకొని భోజన సదుపాయం చేయుచున్నారు.
ప్రయాగరాజ్ నందు బ్రహ్మశ్రీ చారి సుబ్రహ్మణ్య శాస్త్రి (వాడుకలో చారి) అను క్షేత్రపురోహితులు 09415637004, 07007103023, 09389927806 అను ఫోన్ నెంబర్లయందు లభ్యం. యాత్రికులు వీరికి గతంలో అనగా మూడు సంవత్సరములకు ముందు పిండప్రధానం మరియు మరో ముఖ్య కార్యక్రమం అయిన వేణీదానం పూజకు రూ 4000/- ఇచ్చియున్నారు. ప్రస్తుతం వీరి దక్షణ తెలియదు. ధారాగంజ్ పోలీసుస్టేషన్ ఎదుట వీరిగృహం. కాశీ మరియు గయలందు పండాల ఆధ్వర్యంలో కర్మలు జరిపించబడుచున్నావారు ప్రయాగరాజ్ వలె ఆర్ధిక స్తోమతబట్టి కార్యక్రమం నిర్వహించడం కనపడదు. కావున యాత్రికులు వీరిని కూడా సంప్రదించి తమకు అనువైన వారితో పిండప్రధానాది కార్యక్రమములు నిర్వర్తించుకొనవచ్చును. యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి క్షేతెరపురోహితుని నిర్ణయించు కొని పూర్వీకులకు పిండప్రధానంచేసి వారిఆత్మలకు ముక్తి కలిగించకోరుతున్నాం.