పావన నృసింహ

(IPLTOURS)

పావన నృసింహక్షేత్రము అహోబిలంనందుకల నవనృసింహక్షేత్రములలో ఒకటి. పవిత్ర పావననదీ తీరమునందున్న వలన దీనిని పావన నృసింహక్షేత్రముగా పిలువబడుచున్నది. పావన నృసింహక్షేత్రము దట్టమైన అడవిమధ్య నెలకొనిఉన్నది. అహోబిలంనందుకల నవనృసింహక్షేత్రములలో పావన లేదా హోలీ నృసింహఆలయము ప్రశాంతముగానుండును. సందర్శించుటకు అహోబిలమునుండి 14  కి.మీ.రాళ్ళతో నిండిన మార్గము ద్వారా వెళ్లవలయును. సమయము సుమారు 2గంటలు పట్టును. నదువలేనివారు ఎగువ అహోబిలము నుండి డోలీనందు వెళ్లవచ్చును. డోలీపైన మాత్రమే వెళ్లవలసిన క్షేత్రములుండుటవలన ఇచటికి డోలీ ప్రయాణము నివారించవచ్చును. కేవలము సాయంత్రము 5 గం లోగాదర్శించవలయును. ఆ సమయముదాటిన పిమ్మట చీకటిపడి క్రూరమృగములు దాడిచేయుటకు అవకాశముకలుగును.  

Ahobilam Pavana Narasimha Swamy Temple

హిరణ్యకశిపుని వధించినపిమ్మట ఉగ్రస్వరూపముతో తిరుగుచూ ఒకకొండపై లక్ష్మీదేవి అవతారమైన అందమైన చెంచులక్ష్మినిచూసి, ఆమెను ప్రసన్నము చేసుకొనుటకుగాను మాంసాహారముకొరకు యీకొండప్రాంతము అంతయో తిరిగినాడు. అందువలన ఇచ్ఛటిస్థానికులు ఇప్పటికినీ ప్రతిశనివారము స్వామికి కోడిని సమర్పిస్తారు. గిరిజనురాలైన చెంచులక్ష్మిని వివాహమాడి చెంచుజాతివారికి అల్లుడు అయినందున చెంచుజాతివారు సింహారూపములోనిస్వామిని ప్రతిరోజూ దర్శించి మాంసము సమర్పిస్తారు. కాళికాదేవికి బలిఇచ్చుటకు తాంత్రికులు ప్రయత్నించినప్పుడు ఆది శంకరాచార్యులువారు ఆ తాంత్రికులనుండి రక్షణకొరకు ఇచ్చటనే లక్ష్మీనృసింహకరావలంబ స్త్రోత్రము కీర్తించినారు. 

భరద్వాజమహర్షి ఇచ్చటనే బ్రహ్మహత్యా పాతకమునుండి విముక్తిపొందినాడు. ఈఆలయమునందు ధ్వజస్తంభము కలదు. స్వామి ఏడుపడగల ఆదిశేషుని నీడలో లక్ష్మీదేవిని తొడపైకూర్చోనపెట్టుకొన్న భంగిమలో దర్శనం ఇస్తారు. పాదములచెంత భరద్వాజమహర్షి కూర్చొని ఉంటారు. పరిసరప్రాంతపు గిరిజనులు ముఖ్యమైనపండుగల యందు ఈఆలయము సందర్శించి ఆలయము వెలుపల జంతువులను సమర్పిస్తారు. ఈక్షేత్రమునకు 1 కి.మీ. దూరములో చెంచులక్ష్మి ఆలయమ ఉన్నది. పావననృసింహక్షేత్రము ఆళ్వార్ స్వాములచే కీర్తించబడు 108 వైష్ణవక్షేత్రములందు ఒకటిగాగుర్తించబడినది. ఇచ్చటనే చెంచులక్షితో నృసింహుని కళ్యాణము జరిగినదని చెప్పబడినది. ఈకళ్యాణమునకు శివునితోసహా అందరు దేవతలు వచ్చిరి. అందువలన ఈక్షేత్రములో శివలింగము కూడాకలదు. వైష్ణవదేవాలయము లందు శివుని దర్శనము అద్భుతము.                                                                                                   

పావననృసింహుడు బుధగ్రహమునకు అధిపతి. జాతకచక్రములో జన్మలగ్నమందు బుధుడు నీచస్థితిలో ఉన్నట్లు అయిన వార్కి అస్థిరత్వమైన మనస్సు, హేతుబద్ధత లేని జీవితం, తొందరపాటుగా మాట్లాడుట, మాట్లాడలేకపోవుట, చదువులో ఆటంకములు, చర్మసంభంధమైన సమస్యలు, నరముల సంబంధమైనసమస్యలు, జ్ణాపకశక్తి క్షీణించుట మరియు అర్ధము చేసుకొనుటలో ఇబ్బంది తదితరసమస్యలు వచ్చును. కావున పావననృసింహుని అర్చించిన బుధగ్రహదోషములను నివారణ అగుటతోపాటు శుభఫలితములు కలుగును. 

IPLTOURS Indian Pilgrim Tours