నాగనాధ్
(8వ జ్యోతిర్లింగం)
IPLTOURS
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
(8వ జ్యోతిర్లింగం)
IPLTOURS
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
ద్వాదశ జ్యోతిర్లింగములలో అయిదవది అయిన వైధ్యనాధ్ లేదా భైధ్యనాధ్ జ్యోతిర్లింగము జార్ఖండ్ రాస్త్రములో జైషీద్ రైల్వే జంక్షను నకు 7 కి.మీ దూరములో డియోఘర్ నందు విలసిల్లు చున్నది. కృత, త్రేతా మరియు ద్వాపరయుగములలో మానవజీవితంలో హిందూ మతము ప్రముఖపాత్ర పోషించినది. అదే నేటి కలి యుగములో కొనసాగుచున్నది. ఈయుగములన్నిటిలోనూ దైవము అనేక పర్యాయములు దుష్టులను శిక్షించి సన్మార్గులను రక్షించుటకు అనేక అవతారములు ఎత్తియున్నాడు. దానవుల బ్రహ్మను మెప్పించి వరములుపొంది మునులను, ప్రజలను హింసించినప్పుడు మహావిష్ణువు మరియు శివుడు మునులను మరియు భక్తులను రాక్షసుల భాధలనుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు. భారతదేశమంతయు మహావిష్ణువు మరియు మహేశ్వరుడు అవతారములు దాల్చి రాక్షసులను నిర్ణించి మునులను, భక్తులను రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములుగా వారురూపుదాల్చిన నామములతో భాసిల్లుచున్నవి. ఈ పవిత్రక్షేత్రములలో ద్వాదశజ్యోతిర్లింగముల నామములతో శివక్షేత్రములు ఉత్తరమున కేదారేశ్వర్ నుండి దక్షణమున రామేశ్వరంవరకు మరియు తూర్పున జార్ఖండ్ రాష్ట్రములోని వైధ్యానాధ్ నుండి పడమర గుణరాత్ లోని సోమనాధ్ వరకు వివిధరాష్ట్రములలో వ్యాపించి పూర్వకాలమునుండి భారతదేశమును రక్షించుచున్నవి. శివక్షేత్రములు 64 ఉన్ననూ అందు 12 మాత్రము ద్వాదశ జ్యోతిర్లింగములుగా ఖ్యాతిగాంచినవి.
శివపురాణము ప్రకారము బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరుగొప్పవారు ఆన్నవిషయమై వాదులాటపడినారు. శివుడు మూడులోకములను కలుపుచూ వెలుగుతోనిండిన స్తంభమును సృష్టించి ఆవెలుగుతో ప్రయాణించి ఆస్తంభము ఆది మరియు అంతము ఎచ్చటనో కనుగొనమనెను. అప్పుడు బ్రహ్మ ఆవెలుగుతో క్రిందకి విష్ణువు పైకి ప్రయాణించుటకు నిర్ణయించుకొనినారు. బ్రహ్మ తాను ఆవెలుగు చివరిభాగమును కనుగొనినాను ఆనిచెప్పగా అందుకు మొగలిపూవు సాక్షము ఇచ్చినది. విష్ణువు తాను కనుగొనలేకపోయినాను అని ఆ స్తంభము ఈశ్వరుని ప్రతిరూపము కావున ఆధ్యంతములులేనిదని తెలియ చేసినాడు. శివుడు ఆస్తంభముస్థానే ప్రత్యక్షమై మాహావిష్ణువు వాస్తవము తెలిపినాడు అందువలన పూజార్హత కలిగించుచున్నట్లు తెలుపుచూ కనుగొనినానుఅని అసత్యము తెలిపినందుకు పూజింపబడు అర్హత లేకుండాబ్రహ్మకు అసత్యము నందు సహకరించినందుకు తనపూజనందు స్థానము లేకుండా మొగలిపూవును శాసించుచూ బ్రహ్మకు సృష్టి చేయు అధికారము మాత్రమే అనుగ్రహించినాడు. జ్యోతిర్లింగము వాస్తవ రూపములో అంతము లేనిది మరియు శివుడు కొద్దిభాగము లింగరూపములో కనపడువాడు. శివక్షేత్రములు 64 అయిననూ అందు 12 శైవక్షేత్రములు ద్వాదశజ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెందినవి. ద్వాదశజ్యోతిర్లింగ పుణ్యక్షేత్రములు ఆవిధముగా మండుతున్న వెలుగువలెనే శివుడు కనిపించుప్రదేశములు. జ్యోతిర్లింగములు ప్రారంభమునందు అధ్యంతములులేని ఒక స్తంభ ఆకృతిపోలిన శివలింగములు. ఈ క్షేత్రము లన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనముఇచ్చును. కేదార్నాధ్ తప్ప పరమ శివునికి సంబంధించిన ద్వాదశజ్యోతిర్లింగక్షేత్రములు అన్నిటిలోనూ లింగాకారములోనే శివుడు దర్శనము ఇచ్చును. ప్రతిజ్యోతిర్లింగము అచటకల ముఖ్య దేవతామూర్తి పేరుతో వివిధ రూపములతో ఖ్యాతి నార్జించినది.
భైధ్యానాధ్ జ్యోతిర్లింగము జార్ఖండ్ రాష్ట్రములోని భైద్యనాథ్ మరియు మహారాష్ట్ర లోని నాందేడ్ సమీపములో పర్లీ బైధ్యానాథ్ విషయమై మీమాంస ఉన్నట్లే నాగనాధ్ విషయమై గుజరాత్ రాష్ట్రములో ద్వారకవద్ద నాగేశ్వర్ మహారాష్ట్రనందు నాగనాధ్ లపై భిన్నాభిప్రాయములు ఉన్నవి. ఉత్తరాఖండ్ రాష్ట్రములో అల్మోరాజిల్లానందు జగేశ్వరఆలయంనకు నాగేశ్వర జ్యోతిర్లింగమునకు సంభంధముకలదు. దారుకావనమును ద్వారకావనముగా అనుకొని ద్వారకవద్ద నాగేశ్వరఆలయము జ్యోతిర్లింగముగా భావించుటకు ద్వారకవద్ద ఏవిధమైనఅడవి హిందూగ్రంధములలో వ్రాయబడలేదు. కృష్ణుని గురించిన రచనలయందు ప్రభాస్ పఠాన్ మరియు సోమనాధ్ గురించి ప్రస్తావన ఉన్నది కానీ నాగేశ్వర లేదా ద్వారకనందలి దారుకావనమును గురించి ప్రస్తావన లేదు.శంకరాచార్యుల వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము నందు నాగనాథ్ జ్యోతిర్లింగముగా స్తుతించినట్లు వింధ్యపర్వతములకు తరువాత దారుకావనము ఉండవచ్చునను విషయము మరియు పశ్చిమముగా సముద్రముఉన్నదను విషయము పరిగణలోనికి తీసుకొనిన ఉత్తరాఖండ్ రాష్ట్రములోని జగేశ్వర్ నకు దక్షణముగాను ద్వారకకు పశ్చిమముగా నాగేశ్వరము ఉన్నదనిభావించిన అది మహారాష్ట్రనందు పూర్వము ఔన్ధాపేరుతో ప్రస్తుతము సాధంగాపేరుతో పిలువబడుచున్న పట్టణమువద్దనున్న నాగేశ్వరంకాక గుజరాత్ నందుకల నాగేశ్వరంజ్యోతిర్లింగముగా భావించవలసి ఉన్నది.
ఈ నాగనాధ్ (దారుకావనం) జ్యోతిర్లింగం ద్వారక నుండిబెట్ ద్వారకా ద్వీపమునకు వెళ్ళు మార్గములో ద్వారకకు సుమారు 20 కి.మీ. దూరమునందున్నది. ఈదివ్యక్షేత్రమునకు అన్నీరకముల విషములనుండి నివృత్తికలిగించుతుందని ప్రతీతి.
శివపురాణమునందు నాగేశ్వర జ్యోతిర్లింగక్షేత్రము భారతదేశమునందు దారుకావనము అని పిలువబడు ఒక ఆటవీ ప్రాంతమునందుఉన్నదని తెలుపబడినది. శివపురాణమునందు నాగేశ్వరజ్యోతిర్లింగము గురించి తెలుపుచూ దారుక అనేరాక్షసుడు సుప్రియఅను శివ భక్తురాలిని మిగతా శివభక్తులతోపాటు సముద్రములో సముద్రనాగులతో మరియు రాక్షసులు నివసించేడి దారుకా పట్టణమునందు బంధించినాడని, సుప్రియచేసిన భోధనలవల్ల బంధీలు శివమంత్రమును పఠించనారంభించినారని, అప్పుడు శివుడు ప్రత్యక్షంకాగా దారుకుడు లొంగిపోయినాడుఅని, అప్పటినుండి శివుడు జ్యోతిర్లింగ రూపములో అచట నివసించినాడు అని పురాణసారాంశము. ఆరాక్షసునికి దారుకిఅనే పార్వతీ దేవిభక్తురాలు భార్య. ఈమె తపస్సునకు భక్తికిమెచ్చి పార్వతి సాక్షాత్కరించి తనభక్తురాలు తపస్సు చేసిన ఆఅడవిని దారుకావనము అనేపేరుతో ఆమెపై గౌరువసూచకముగా పిలువబడునట్లుగా అనుగ్రహించినది.
అటుపిమ్మట దారుకావనమునందలి రాక్షసులను దేవతలనుండి రక్షించుటకుగాను దారుకతో దారుకావనమంతయు అనుసరించినది. దారుక పార్వతీదేవినుండి పొందినశక్తితో మొత్తము అడవిని సముద్రమునకు కదలించి మునులకు వ్యతిరేకంగా ఉధ్యమించి ప్రజలను అపహరించి సముద్రముక్రింద పరిమితమైనగుహనందు శివ భక్తురాలైన సుప్రియతోపాటు బంధించినది. సుప్రియరాక విప్లవమునకు దారితీసినది. సుప్రియ ఒకలింగమును తయారుచేసి శివలింగము పూజించు సమయమునందు శివుని ప్రీతికొరకు బంధీలకు ఓంనమశివాయః మంత్రమునుపదేశించినది. రాక్షసులు ఆ పఠనమునకు ఆగ్రహించి సుప్రియను చంపుటకురాగా శివుడుసాక్షాత్కరించి సుప్రియకు ఒక అద్భుతమైన ఖడ్గమును ప్రసాదించి ఆమె ప్రాణములను రక్షించినాడు. సుప్రియా చేతిలో దారుకి మరియు రాక్షసులు ఓడింపబడగా, పార్వతీమాత మిగిలీన దానవులను రక్షించినది. సుప్రియచే ప్రతిస్టించబడినలింగము నాగేశ్వరముగా పిలువబడు చున్నది. శివుడు నాగేశ్వరుడుపేరుతో జ్యోతిర్లింగముగాను పార్వతినాగేశ్వరి గాను భావించబడు చున్నారు. శివుడు అప్పుడు తనను కొలిచేడివారికి సరిఅయినమార్గము చూపెడనని ప్రకటించినాడు. ఈ విధముగా నాగేశ్వర్ జ్యోతిర్లింగము ప్రాచుర్యములోనికివచ్చినది. మిధునరాశికిచెందిన స్త్రీ పురుషులు ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగమునుదర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది.
మాహాశివరాత్రి పర్వదినమున యాత్రికులు విశేషముగా ఇచ్చటికి వచ్చేదరు.నాగేశ్వర్ ఆలయం తెరచిఉండు సమయములు ఉ 6 నుండి మ12-30 వ తిరిగి సా 5 నుండి రాత్రి 9-30 వరకు.
IPLTOURS – Indian Pilgrim Tours