ముండ్కతియా వినాయకుడు ఆలయం

(IPLTOURS)

రామాలయం లేని గ్రామము ఉండదని నానుడి. ఆచరణలో రామాలయం లేని గ్రామము ఉండవచ్చేమో కానీ ప్రధమపూజ్యుడు అయిన వినాయకుడుని పూజించనిదే హిందువులు ప్రారంభించే ఏ పూజకానీ కార్యక్రమం కానీ ప్రారంభంకాదు. అట్లే గణేశుని ఆలయాలు దేశంలో అనేకం ఉన్నా అందరికి వినాయకుడు అనగానే స్వామిరూపం ఒకరకంగానే ఊహాలోకి వస్తుంది. గణేశుని ఆలయం విశ్వంలో ఉన్నఆలయాలలోని మూర్తులకు భిన్నముగా ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపములో గౌరీకుండ్ వద్ద ముండ్కతియా అనుచోట తలలేకుండా కేవలం మొండేముతో దర్శనం ఇస్తాడు. బహుశా జనబాహుల్యానికి దూరంగా ఉండటం తలలేని గణేశుని ప్రతిమవలన ఈఆలయం అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. పూజ లేదా కార్యక్రమం శ్రీవిఘ్నేశాయనమః అనేమంత్రోచ్ఛారణ తోనే ప్రారంభం అవుతుంది ఉగాది హిందువులకు సంవత్సరములో ప్రారంభం పండుగఅయినప్పటికి స్త్రీ పురుష భేధంకానీ కలిమిలేముల బేధంకానీ లేకుండా అందరూకలిసి భాద్రపద శుద్ధ చవితిరోజున చేసుకొనే ప్రధమపూజ మహా గణపతిపూజ ఆనందంలో ఏవిధమైన సందేహం లేదు. అశోకసుందరి మరియు కార్తికేయ, స్కంద, కుమార, మురుగన్, మహాసేన, షణ్ముఖఅను పేర్లతోపిలువబడు సుబ్రహ్మణ్యస్వామి అనువారు గణేశుని సోదరసోదరీమనులు. శివ పార్వతులకు మూడవ సంతానము మరియు రెండవ కుమారుడై 108 పేర్లతో పూజించబడు వినాయకునికి సిద్ధి మరియు బుద్ధి సహధర్మచారిణులు, కుమార్తె సంతోషీదేవి, శుభ మరియు లాభ అనువారు కుమారులు. గమనించిన వినాయకుని భార్య పిల్లలు అందరూకూడా కష్టములు తొలగించి సంతోషకరమైన జీవితము ప్రసాదించువారే. వినాయకుని జననము అందరికీ తెలిసినదే అయిననూ మరొక్కసారి పునర్చరణ చేద్దాము.

సంక్షిప్తముగా వినాయకుని జననవృత్తాంతము వివరించుటకు భారతదేశము ఉత్తరమున హిమాలయములలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు రుద్రప్రయగ జిల్లానందుకల ద్వాదశ జ్యోతిరిలింగములలో పదకొండవ జ్యోతిర్లింగమైన కేదార్నాధ్ జ్యోతిర్లింగము వద్దనున్న పవిత్ర పుణ్యఖెత్రములను గురించి ప్రస్తావించవలసి ఉన్నాది. రుద్రప్రయాగ నుండి కేదార్నాధ్ ప్రయాణించునప్పుడు గౌరీకుండ్ వరకు రోడ్డుమార్గముద్వారా అచ్చటినుండి నడక లేదా గుర్రము లేదా పల్లకిపై 14 కి.మీ. ప్రయాణించి చేరవలసి ఉన్నది. యాత్రికులు గౌరీకుండ్ నందు బసచేసి స్థానిక ఆలయములు దర్శించవచ్చును. గౌరీకుండ్ మహాశివుని భార్య పార్వతి లేదా గౌరితో సంబంధము కలప్రదేశము. గౌరికుండ్ హిందూ పురాణాల నేపథ్యంతో సహజజలపాతములు, వేదినీటి ఊతలు కలివియున్న ప్రదేశము.                                                                                                

Mundkatiya Temple-Kedar Valley

గౌరి మహాశివుని అభిమానము పొందగోరి అనేకవిధముగా యోగమార్గమున తపస్సు చేసినది. స్థానికకధనము ప్రకారము పార్వతి గౌరికుండ్ వద్దనివసించి శివునిగూర్చి తపస్సుచేసినదని, శివుడు ఆమెతపమునకు మెచ్చి ఆమపై తనకుకలప్రేమను వ్యక్తపరచి సమీపమునందుకల త్రియుగినారాయణ్ నందువివాహము చేసుకొనినట్లు, ఈప్రదేశమునకు గణేశుని జననమునకు స్వామికి ఏనుగు శిరస్సు ఎట్లు వచ్చినది అనుదానిపై కధనముకలదు. సరస్సునందు స్నానము చేయుటకు ముందుగా పార్వతి తనశరీరముపైనున్న నలుగుపిండితో గణేశుని బొమ్మ తయారుచేసి ఆబొమ్మకు ప్రాణముపోసి సరస్సునకుముందు తనకు రక్షకునిగా నిలపెట్టినది. మహాశివుడు పార్వతిని కలియుటకువచ్చి గణేశునిచే నిరోధించబడ్డాడు. శివుడు ఆగ్రహముచెంది తనత్రిశూలముతో గణేశునితలను నరకివేయుట వలనపార్వతి దుఃఖితు రాలైనది. ఆమె గణేశుని తిరిగి బ్రతికించమని బలవంతం చేయగా, శివుడు గతంలో గజాసురుని వధించినప్పుడు ఆతనిశిరస్సు లోకపూజ్యమగుణని వరము ఇచ్చియుండుటవలన గజాసురుని శిరస్సు గణేశుని మొండేమునకు జతచేసి పునర్జీవితుని చేసినాడు. పార్వతి తనకుమారుని తిరిగిపొందుటతోపాటు హిందువులుఅందరకు గణేశునిజనన వృత్తాంతము ఈవిధముగానే వెల్లడి అయినది.

శివుడు పార్వతినికలువకుండా తనను నిరోధించిన గణేశునిపై కోపవింధి ఈప్రదేశములో శిరచ్ఛేదం చేశాడు. తలలేని గణేశుని విగ్రహం ముండ్కతియా ఆనగా తలనరికిన ఈప్రదేశములో పూజించదుతూంది. ముండ్కతియా ఆలయం సందర్శకులను మంత్ర ముగ్ధులనుచేయు కేదార్నాధ్ లోయఒడిలో సొనప్రయాగకు సుమారు 3 కి.మీ దూరములో సొనప్రయాగ నుండి గౌరీకుండ్ మార్గములో రోడ్డునుండి సుమారు 200 మీటర్ల దూరములోనున్నది. ఈ ప్రదేశమును దేవభూమి అనికూడా పిలిచేదరు. ప్రపంచములో తలలేని విఘ్నేశ్వరుని పూజించు ఆలయము ఇదిఒక్కటే. ప్రత్యేక ప్రాముఖ్యమున్న ఈక్షేత్రము పూర్తిగా ప్రభుత్వ మరియు యాత్రికుల నిర్లక్ష్యమునకు గురికాబడినది. ఇతరప్రదేశాలనుండి ఈప్రాంతాన్ని సందర్శించువారికి ఈఆలయము ముఖ్యమైన గణేశ్ దేవాలయములలో ప్రముఖమైనదని తెలియదు కాని విఘ్నేశ్వరుని ఆవిర్భావముతో నేరుగా సంబంధంఉన్న ఏకైకదేవాలయం ఇదిఒకటే. అధికారులు ఆలయ అభివృద్ధికి తగినంత ప్రచారం కల్పించలేదు.                                      

త్రయుగినారాయణ దేవాలయంలో పూజారి ఇది ప్రపంచంలోని గణేష్ జీవితంతో ముడిపడి ఉన్న ఏకైక ఆలయం అని వ్యక్తం చేశారు. మనదేశంలోని అన్నిప్రాంతాల్లో గణేష్ చతుర్థిని అత్యంతభక్తితో జరుపుకుంటారు. కానీ ఈదేవాలయం తక్కువప్రచారం మరియు ప్రచారం కారణంగా భక్తులదృష్టి ఆకర్షించడంలో విఫలమైంది. 2013 సం.లో సంబంధించిన వరదలు కేదార్‌నాథ్ లోయ నాశనం చేశాయి మరియు తదనంతరం సోన్‌ప్రయాగ్ నుండి అనేక కొండచరియలు విరిగిపడి ఇప్పుడు ఈప్రదేశం చేరడానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈప్రకృతివైపరీత్యము జరుగకముందు ప్రతిసంవత్సరము సుమారు పదివేలమంది ఈఆలయం సందర్శకులు దర్శించేవారని ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే దర్శించుచున్నారని ఈప్రదేశము యాత్రాస్థలముగా అభివృద్ధి చేయుటకు రోడ్డు తదితర సౌకర్యములు కల్పించవలసిఉన్నది. ఛోటా చార్ ధామ్ యాత్రనందు కేదార్ నాధ్ దర్శించుయాత్రికులు గౌరీకుండ్ మరియు ముండ్కతియానందు గణేశునిఆలయము దర్శించి తరించండి. 

కైలాసశిఖరము మహాశివుడు మరియు పార్వతీదేవి నివాసమని మానససరోవరమునందు ప్రతిరోజూ దేవతలు ప్రాతః కాలమునే స్నానము ఆచరించి మహాశివుని కొలిచెదరను విషయము నిర్వివాదాంశము. మహాశివుడు గౌరీదేవిరూపములో పార్వతీదేవిని త్రయగినారాయణ ఆలయమునందు మహావిష్ణువు తదితరాదేవతల సమక్షములో వివాహముచేసుకొనినట్లు పురాణములు తెలుపుతున్నాయి. దీనినిబట్టి గౌరీకుండ్ వద్ద గౌరీదేవిని కలియుటకు వచ్చినశివుని ఆటంకపరచిన పార్వతీదేవిపుత్రుని శిరము ఖండించినట్లు కధనమువాస్తవము. కావున  గౌరీకుండ్ వద్దనున్న ముండ్కతియా ఆలయమునందు తలలేని గణేశుని విగ్రహంనకు ఎంతోప్రాముఖ్యమున్నదని అనునది సుస్పష్టము. కావున భక్తులు ప్రభుత్వము శ్రద్ధతో ఈఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందించేదరని ఆశించవచ్చును.