ముక్తినాథ్

(IPLTOURS)

అవిభక్త హిందూదేశం పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఈపవిత్రక్షేత్రములందు స్వయంభూఃఆలయములు, ఋషులచే   ప్రతిష్టించబడిన ఆలయములు, మానవప్రతిష్టవలన నిర్మించబడిన ఆలయములు. ఋషిప్రతిష్ట మరియు మానవప్రతిష్టలకంటే స్వయంభూః ఆలయములు ఉన్నతమైనవి అనిప్రజలనమ్మకము. మహావిష్ణువు స్వయంభూఃగా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాధ స్వామి, కల్లహళ్లి వద్ద భూః వరాహస్వామి, తిరునల్వేలివద్ద వనమామలైపెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్, గండకినదీతీరమున ముక్తినాధ్, పుష్కర్ నందు వరాహ ఆలయం, నైమిశారణ్యంనందు చక్రతీర్ధంవద్ద లక్ష్మీనారాయణ, అనంతపూర్ నందు అనంతపద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రినాధ్ ఆలయములు.       

ముక్తినాధ్ 108 దివ్య దేశములలో ఒకటి మరియు విష్ణుభగవానునికి ప్రీతికరమైన ముఖ్య ఆలయము. ఈఆలయము నేపాల్ నందు తోరంగ్ లా పర్వతమార్గములో మత్సంగ్ అనుచోటకల ముక్తినాథ్ లోయనందు సముద్రమట్టమునకు సుమారు 12000 అడుగుల ఎత్తులోఉన్నది. నేపాల్ నందుకల నాలుగు చార్ ధామ్ క్షేత్రములందు బార్షా, పశుపతి, మరియు రుహూ క్షేత్రములతోపాటు నాలుగవక్షేత్రము. హిందువులకు మరియు బౌద్ధులకుకూడా ఇదిముఖ్యమైనది. విష్ణుపురాణమునందు గండకీమహత్యములో ముక్తినాథ్ గురించివివరించబడినది. విష్ణుభగవానుడు పూజింపబడు పవిత్రప్రదేశములలో ముక్తినాధ్ ఒకటిఅనియు ముక్తినాధ్ నందువిష్ణుభగవానుని దర్శనము దైవము ప్రసాదించు వరముగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవిసమెత విష్ణుభాగవనుడు ముక్తినిప్రసాదించునని అందువలననే ఈక్షేత్రరమునకు  ముక్తినాథ్ అనిపేరువచ్చినట్లు ఆలయమునందు గోదాదేవి, రామానుజ విగ్రహములు శ్రేశ్రెశ్రీ శతగోప రామానుజ జియ్యర్ స్వామిచే ప్రతిస్థించబడినట్లు తెలియుచున్నది.

muktinath

మోక్షక్షేత్ర అనిపిలువబడు ముక్తినాథ్ మోక్షముప్రసాదించు స్థలమనినమ్మకం. రానిపురఅను గ్రామమువద్ద నున్న ఈప్రదేశము విష్ణుభగవానుని రూపమైన శాలిగ్రామశిలగా పరిగణించబడుచున్నది. వైష్ణవసాంప్రదాయముమూలమైన ఈఆలయము బౌద్ధగురువైన పద్మసంభవుడు కొంతకాలము ఇచటయోగము చేసినందువలన బౌద్ధులకుకూడా పవిత్ర మైనది.టిబెట్ బౌద్ధులకు ఈఆలయము ముఖ్యమైనస్థలము మరియు మహాదేవి లేదా దేవిభగవత్ పేరుపై సిద్ధపీఠము అయినది. ఇచ్చటినుండి శాలిగ్రామములు లభించు గండకీనది దిగువకుప్రవహించును.          

విష్ణువు గండకి అనువేశ్యను కోరిక కోరుకోమని అడుగగా విష్ణువు తనగర్భమున జనించవలెనని కోరినది. ఆమెకోరిక తరువాయిజన్మలో తీరుతుంది అనియు, తనగర్భంలో ఎప్పుడూ పుడుతూనేఉంటానని విష్ణువు వరముఇచ్చాడు. మరుసటిజన్మనందు ఆమెగండకినదిగా జన్మించింది. గండకికి ఇచ్చినవరం వలన ఈనదిలో విష్ణువు సాలిగ్రామములుగా నదీగర్భంలో జనిస్తూనేఉన్నాడు. ఈనదిలోనే సాలగ్రామములు దొరికేది.

సాలి గ్రామాలు గుండ్రంగా నున్నగా ఉంటాయి. తాబేలు ఆకారంలో నోరుతెరుచుకుని ఉంటాయి. లోపలవిష్ణువు కనపడతాడు. వీటిని చాలామంది పూజగదిలోఉంచుకుని పూజిస్తుంటారు. వీటికిఎంతోమహిమ ఉంటుందని భక్తులనమ్మకం. పరమపదనాధునిపేరుతో శ్రేదేవి, భూదేవి, నీల మరియు గోదాదేవితో కలిసి వెలసిఉన్న విష్ణుమూర్తిని దర్శించుటకు వేలకొలది భక్తులుముక్తినాధ్ సందర్శిస్తారు. బౌధ్హ భిక్షువు ఇచట పూజాధికాలు నిర్వహిస్తారు మరియు స్థానిక సన్యాసి ఆచారాలు నిర్వహిస్తాడు. 

ఇంకనూ సమాచారము కొరకు ముక్తినాధ్ పేజీ చూడండి.