మాలోల నృసింహ

(IPLTOURS)

అహోబిలమునందలి నవనృశింహ క్షేత్రములలో ఒకటి వేదాద్రి కొండపై ఉన్నమాలోల (లక్ష్మీ) నృసీంహక్షేత్రము. ఈఆలయము ఎగువఅహోబిలమునుండి 2 కి.మీ దూరములోనున్నది. ఈ ప్రదేశమును మార్కొండ లక్ష్మీక్షేత్రమని  అందురు. ఈఆలయ ఉత్సవమూర్తిని ప్రతీసారి అహోబిలమఠమునుండి తీసుకువచ్చెదరు. ఈఆలయమునుండి నృసింహుడు హిరణ్యకశిపుని వధించిన ఉగ్రస్థంభమువద్దకు వెళ్లవచ్చును. స్థానిక కధనము ప్రకారము కర్నాటక రాష్ట్రము మాంఢ్య జిల్లా పాండవపుర తాలూకానందలి మేల్కొటేగ్రామము నందు శ్రీనివాసఆచార్య అనుయువభక్తుడు ఉండేడివాడు. ఒకరోజు లక్షీనృసింహుడు ఆతని కలలో అహోబిలంవెళ్ళి సన్యాసము తీసుకొని మిగిలినజీవితము అహోబిలమునందు గడుపమని ఆదేశించినాడు.

ఆకలనునమ్మక ఆతని గురువు వరదవిష్ణువర్దచార్య వద్దకువచ్చి ఆయనసూచన కోరినాడు. ఆయనఎటువంటి ఆలస్యము చేయకుండా స్వామివారి ఆదేశము పాటించవలసినదిగా ఆదేశించినాడు.

Malola Narasimha Swamy Temple Entrance-Upper Ahobilam

గురువు ఆశీస్సులుపొంది శ్రీనివాచార్య అహోబిలం రాగా, అహోబిలమునందు స్వామిచే ఆదేశించబడిన ముకుందరయ్య అనుస్థానిక అధిపతిచే స్వాగతింపబడినాడు. లక్ష్మీనృసింహుడు సన్యాసి రూపములో శ్రీనివాచార్యకు  కనబడి ఆతనిచే సన్యాసాశ్రమము స్వీకరింపచేసి అహోబిలమఠమును స్థాపింపచేసినాడు. శ్రేనివాసాచార్యకు సదాగోపజీయర్ అని నామధేయం ఒసగినాడు. సదాగోపజీయర్ ను ప్రతీ ఇల్లు తిరిగి వైష్ణవమతమును వ్యాప్తిచేయమని తనతోపాటు స్వామిఉత్సవమూర్తిని తీసకొని వెళ్లవసినదిగా ఆదేశించినాడు. 

 సదాగోపజియర్ ఏఉత్సవమూర్తి అని మీమాంస పడినాడు. అప్పుడు స్వామితపస్సుచేసి ఏఉత్సవమూర్తిని తీసుకు వెళ్లవలేనో చూపకోరినాడు. అప్పుడు మాలోలనృసింహూని ఉత్సవమూర్తి ఆలయమునుండి ఎగురుతూవచ్చి సదాతోపాజియర్ చేతులందుచేరినది. ఉత్సవమూర్తికాళ్ళకు పాదరక్షలతో యాత్రకుతయారుఅన్నట్లు తెలియచెప్పినది. అప్పటినుండి మాలోలనృసింహస్వామి అహోబిలమఠం జియార్లతో ప్రయాణము చేయుచూ భక్తులను అనుగ్రహించు చున్నాడు. హిరణ్యవధపిమ్మట ఉగ్రనృసింహుని శాంతపరచుటకు మహాలక్షి చెంచుజాతినందు చెంచులక్ష్మిగా జన్మించి నృసింహుని మాలోలఅనగా శాంతస్వరూపూనిగాచేసి వివాహము చేసుకొనినది. ఆలయమునందు నృసింహుడు చాలాప్రశాంతముగా లక్ష్మీదేవితో దర్శనము ఇచ్చును.

మాలోలనృసింహుడు శుక్రగ్రహమునకు అధిపతి. శుక్రుడు మంచి సంబంధబాంధవ్యములను, సంపదను, శారీరక అందమును మరియు మంచి ఆరోగ్యము కలుగజేయువాడు. జన్మకుండలిలో లేదా జాతకమునందు శుక్రుడు నీచ స్థానములోనున్నట్లయిన సుఖములు, ఆనందము, అందము మరియు లైంగికసంభంధములు కోల్పోదురు. మాలోల నృసింహుని దర్శించి సేవించిన శుక్రగ్రహమువలన కలుగు దుష్పలితములను తొలగి శుభఫలితములు పొందేదరు.

IPLTOURS Indian Pilgrim Tours