జ్వాల నృసింహ

(IPLTOURS)

అహోబిళం నవనృసింహక్షేత్రములలో జ్వాలానృసింహక్షేత్రము ఒకటి. నవనృసింహక్షేత్రములలో అన్నిటికంటే ఎక్కువ ఎత్తులో మేరుపర్వతం అను ఒకకొండమీద ఉన్నది. ఆలయము వెనుక భాగమున నున్న కొండయే ఉగ్రస్తంభముగాను నృసింహుడు హిరణ్యకశిపుని వధించిన స్థలముగాను పురాణము చెప్పుచున్నది. జ్వాల అనగా మంట అనగా ఈప్రదేశములోనే నృసింహునికి అమితమైన కోపము వచ్చినది ఇచ్చట నృసింహుడు కోపముతో కొండశిఖరము చేరుకున్నాడు. హిరణ్యకశిపుని వధించిన పిమ్మట నృసింహుదూ తనచేతులను ఇచ్చటకల రత్నకుండములో చేతులు కడిగినట్లుగా కధనము. ఇప్పటికినీ ఈకుండములోనినీరు రక్తమువలే ఎరుపురంగులో ఉంటాయి. కానీఈనీరు చేతిలోనికి తీసుకున్న సాధారణ రంగులోనికి వస్తాయి. 

JWALA NRUSIMHA SWAMY TEMPLE

జ్వాలానృసింహుడు ఎనిమిది చేతులతో రెండుచేతులు హిరణ్యకశిపుని తల మరియు కాళ్ళు నొక్కిపట్టుచూ రెండు చేతులతో ఉదరమునుండి ప్రేగులను బయటకులాగి హారమువలేధరించుచూ రెండుచేతులతో శంఖు చక్రము ధరించి దర్శనము ఇచ్చును. ఎగువఅహోబిలమునందున్న జ్వాలానృసింహుని చేరుమార్గము రాళ్ళతోచాలా కష్టతరముగా  ఉండును. ఉగ్రనృసింహ క్షేత్రమునుండి సుమారు 4 కిలోమీటర్ల దూరములో నున్నది. ఇచ్ఛటికి చేరుట చాలా కష్టము. మార్గముఅంతయూ కొండరాళ్లతో నడచుటకుచాలా కస్టతరముగా ఉండును. ఇక్కడినుండి నడకకు చేతికర్రసహాయము తప్పనిసరిగా అవసరం. మాలోలనృసింహక్షేత్రమునుండి మెట్లమార్గముద్వారా జ్వాలానృసింహక్షేత్రము చేరవచ్చును. కానీ క్రోధనృసింహ క్షేత్రమునకు వచ్చి ఆచటినుండి భవనాశనినది గట్టుపై ప్రయాణించి జ్వాలానృసింహక్షేత్రము చేరుట మంచిది. ఇచ్చటనే భవనాశని జలపాతము ఉన్నది. ఈ ఆలయమునకు పోవురోడ్డు కొద్దిదూరం చాలాఇరుకుగాఉండి ఇద్దరుమాత్రమే వెళ్ళుటకు అవకాశము ఉండి జాగ్రత్తగానడచి చేరవలయును. వుద్ధులు మరియు నదువలేనివారు తప్పని సరిగా డోలీనందు ప్రయాణించుట శ్రేయస్కరము.

ఈఆలయమునందు నృసింహుడు హిరణ్యకశిపునితో యుద్ధము చేయుచున్నట్లు, సృసింహుడు స్తంభమునుండి బయటకు వచ్చుచుండగా ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు స్తంభమునకు రెండువైపులా నిలుచునిఉన్నట్లు మరియు మహావిష్ణువు దర్శనము ఇచ్చుచున్నట్లు విగ్రహములు ఉండును. కార్తీకమాసమునందు స్వామికి నేతితో దీపముసమర్పించిన జీవితము శుభప్రధముగా ఉండునని నానుడి. జ్వాలానృసింహుడు కుజగ్రహమునకు అధిపతి. కుజుడు బలము, సంకల్పము, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము కలుగజేయువాడు. కుజుడు జన్మకుండలిలో లేదా రాశిచక్రములో నీచస్థితిలో ఉన్నట్లయిన హఠాత్ పరిణామములు కలిగించి అప్పులు, శత్రుభాధలు, అనారోగ్యము, శక్తిలేకుండుట మరియు భూసంబంధమైన తగాదాలు కలిగించును. జ్వాలానృసింహుని దర్శించి అర్చించిన  కుజగ్రహ దోషములనుండి విముక్తిలభించుననని తెలుపబడినది. 

IPLTOURS Indian Pilgrim Tours