జలలింగం

(IPLTOURS)

జంబుకేశ్వర ఆలయం

పంచభూతలింగములలో రెండవది జంబుకేశ్వరములోని జలలింగం. ఇది తమిళనాడు లోని తిరుచిరాపల్లి సమీపంలోని తిరువనక్కవాల్ అనే గ్రామంలో జంబూకేశ్వరక్షేత్రంలో ఉంది. తెల్లనేరేడుచెట్లు అనగా జంబూవృక్షములు అఃదికముగా నుండుటవలన జంబుకేశ్వరం అనే పేరువచ్చినది. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇక్కడి స్వామివారు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్న పరమేశ్వరుడు దాని నివారణ కోసం జంబూక వృక్షం కింద  తపస్సు చేసినందుకే ఇక్కడికి వచ్చాడని అందువలన  శివునికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చినది. ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను. ఇక్కడ శివుడూ జలరూపంలో వెలిశాడని చెబుతారు. అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి.

Tiruvanaikovil Arulmigu Jambukeswarar Akhilandeswari Temple, Tamil Nadu

అయితే ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు. ఇతడి కట్టిన ప్రాకారానికి పనిచేసినవారికి రోజు కొంత విబూది ఇచేవాడంట. పనిచేసి విభూధిని తీసుకెళ్లిన వారికీ ఇంటికి వెళ్ళగానే ఈ విబూది బంగారం లాగ మరెందట. దీంతో ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని స్థానిక భక్తుల నమ్మకం. ఈ ప్రాకారం 2.5 కి.మీ పొడవున రెండు అడుగుల మందమున 25 అడుగుల ఎత్తుగా ఈ విభూధి ప్రాకారం. 

ఇక పురాణానికి వస్తే, ఒకరోజు కైలాసంలో పార్వతీపరమేశ్వరులు మాట్లాడుతుండగా పార్వతీదేవి శివుడిని ఎగతాళి చేయగా, శివుడు బాధపడి కైలాసాన్ని వదలి భూలోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించగా, దాంతో భూలోకానికి వచ్చిన ఆ దేవి కావేరి నది తీరాన గల ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడి జంబూ ద్విపంలో నివాసాన్ని ఏర్పరుచుకుంది. పార్వతీదేవి ఆనది నీటిని తెచ్చుకొని తన శక్తితో ఆ నీటితోనే ఒక లింగరూపాన్ని తయారుచేసి దానిని ఒక నేరేడుచెట్టుకింద ప్రతిష్టించి పూజలు చేస్తూ ఉండేది. ఆ వృక్షం జంబూ ముని తలలోనుండి వచ్చిన వృక్షమని ఆలా జంబూ మునికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణం. ఇలా పార్వతీదేవి జంబూ ద్విపాన్ని చేరి కావేరీతీరంలో తపస్సు చేసి చేతిలో నీటిని తీసుకోగా అదిఒక లింగరూపంలోకి మారి శివుడి శక్తి అందులో ఐక్యం అయింది.

Jambukeswarar Temple History-Tiruvanaikovil

జంబూ ముని పూర్వం ప్రతిరోజు కైలాసం వెళ్లి శివుడిని దర్శనం చేసుకొని వస్తుండేవాడు. ఒకసారి ఆ ముని బాగా పండిన నేరేడు పండుని తీసుకు వెళ్లి శివుడికి ఇవ్వడగా ఆ స్వామి దానిని తిని అందులోనుండి గింజలను బయటకి ఉమ్మివేయగా, ఆ ముని అదే ప్రసాదంగా భావించి ఆ గింజను తినడంతో అతడి తలనుండి ఆ వృక్షం మొలిచింది. అప్పుడు శివుడిని ప్రార్ధించి దీనికి పరిష్కారం చెప్పని ఆ ముని వేడుకొనగా, శివుడు కావేరినది తీరాన జంబూ వృక్షాలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళమని త్వరలోనే నీకు మోక్షం లభిస్తుందని చెప్పాడట.

Jambukeswarar Temple Story-Tiruchirappalli, Tamil Nadu

ఇక్కడ ఉన్న శివలింగం పానవట్టం నుండి ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. ఇందుకు సాక్ష్యంగా లింగం పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ తరువాత తీసేసి వస్త్రాన్ని పిండితే అందులో నుండి నీరు వస్తుంది. ఇక్కడ వెలసిన అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు. ఆ అమ్మవారు చతుర్భుజాలతో నిలుచున్న భంగిమలో ప్రతిష్టించబడి ఉన్నారు. జగద్గురు ఆదిశంకరులవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని ఈ ఆలయంలో ప్రతిష్టించారు. ఇలా ఎంతో ప్రాచీన ఆలయమైన ఇక్కడ పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం ఉండటం, సాక్షాత్తు శివుడే సిద్ధుడి రూపంలో వచ్చి ఒక ప్రాకారాన్ని నిర్మించడం విశేషం కాగా ఇంతటి విశేషం ఉన్న జలలింగం దర్శనం ఇచ్చే ఈ ఆలయానికి ఎప్పుడు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.

SivaLingam-Jambukesvara-temple

ఇచట శ్రీమత్ తీర్ధము, రామతీర్దము, చంద్ర తీర్ధము, అగ్ని తీర్ధము, ఇంద్ర తీర్ధము, అక్షయ తీర్ధము, జంబు తీర్ధము, సూర్య తీర్ధము మరియు బ్రహ్మ తీర్ధము అను తీర్ధములున్నవి. ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం 5-30 నుండి మధ్యాహ్నం 1-00  వరకు 3-00 నుండి రాత్రి 8-30 వరకు దర్శనము.