మన దేశంలో రమారమి ఒకే రేఖాంశములో ఎనిమిది పురాతనదేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉత్తరభారతదేశంలో మిగిలినవి దక్షణభారతదేశంలోనూ ఉన్నాయి. కేదార్నాథ్ నందు కేదారేశ్వర్, కాళేశ్వరంలోని ముక్తేశ్వర్, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర్, కాంచీపురంలో ఏకాంబేశ్వర్, తిరువనైలోని జంబుకేశ్వర్, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర్, చిదంబరంలో నటరాజర్, రామేశ్వరంలోని రామనాధేశ్వర్. ఇందు పంచభూతస్థలాలు ఒక్కో సహజమూలకాన్ని సూచిస్తాయి. పంచభూతాలు అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. దక్షిణ భారతదేశంలో పంచభూతాలకు ఐదు దేవాలయాలుకలవు. కంచి(పృధ్వి) భూమి ఏకాంబేశ్వర, తిరువనైకావల్ జంబుకేశ్వర (నీరు), చిదంబరం నటరాజర్ (ఆకాశం), తిరువన్నామలై అరుణాచలేశ్వర (అగ్ని) మరియు కాళహస్తి నాథర్ (గాలి). ఇందు నాలుగు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అవి కంచిలో పృథ్వి లింగం, చిదంబరం లోని ఆకాశ లింగం, అరుణాచలంలోని అగ్నిలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఈ ఐదు దేవాలయాలుకూడా యోగిక్ శాస్త్రం ఆధారంగా ఒకే అక్షాంశములో నిర్మించబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.
శివుడు ప్రకృతిలోని భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశముఅను అయిదుమూలకములను నియత్రించువాడు. శివుడు అయిదు భూతముల అవతారముగాకూడా కొలువబడుచున్నాడు. ఆవిధముగా దక్షణభారతదేశమునందు ఈఅయిదు పంచభూత క్షేత్రములు పవిత్ర శివక్షేత్రములుగా అనేక శతాబ్దములనుండి కీర్తించబడుచున్నవి. హిందూమత విశ్వాసము ప్రకారము వివిధజాతులు గ్రహగతులు మరియు ప్రకృతిలో భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశముయొక్క వ్యక్తీకరణవలన ఏర్పాటుకాబదినవని నమ్మెదరు. పురాతన ఆయుర్వేదవైధ్యము ప్రకారము మానవశరీరముకూడా కఫ, పిత్త, వాయు, ధను మరియు మలఅను అయిదుభూతములచే శాసించబడుచున్నది. సమస్త జీవరాశికి ఆధారం పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, నిప్పు మరియు గాలి. ఈ పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ శివుడు వెలిసిన పుణ్యప్రదేశాలు పంచభూతలింగములుగా ప్రసిద్ధిచెందినవి. ఈఅయిదు పుణ్యక్షేత్రములు నాలుగు తమిళనాడులోనూ ఒకటి ఆంధ్రప్రదేశ్ నందు ఉండడంవిశేషం. పురాణాలను అనుసరించి పంచభూతలింగములను ఒకేసారి దర్శించుకొంటే అన్నిపాపాలుతొలగి శివసన్నిధి చేరుకొంటామని నమ్మకం. పంచభూతలింగములందు ఒక్కొక్కక్షేత్రములో శివుని ఆవిర్భావమునకుగల స్థలపురాణము ఆయాక్షేత్రములందు వివరించేదము.
ఏకాంబరేశ్వర ఆలయం
తిరువనైకోవిల్ అరుల్మిగు జంబుకేశ్వరర్ అఖిలాండేశ్వరి ఆలయం
తిల్లై నటరాజ ఆలయం
అరుల్మిగు అరుణాచలేశ్వర ఆలయం
శ్రీకాళహస్తి ఆలయం
IPLTOURS – Indian Pilgrim Tours