శ్రీ రంగనాథ స్వామి ఆలయం

(IPLTOURS)

శ్రీరంగం తమిళనాడు రాష్ట్రములో రంగనాయకితో రంగనాధుడు కొలువైఉన్న వైష్ణవ దివ్యక్షేత్రము. శ్రీరంగం ఆళ్వారులచే కీర్తించబడిన 108 దివ్యదేశములలో ప్రచానమైనది. భారతదేశములో అతిపెద్దదేవాలయ సముదాయములలో శ్రీరంగంలోని రంగనాగనాధస్వామి ఆలయంఒకటి. ఇది తీరుచురాపల్లికి చేరువలో కావేరీనది మరియు దాని ఉపనది కొల్లిదాం నదుల మధ్యనున్నద్వీపము. ఈఆలయం ప్రపంచంలో పూజాదికాలుజరిగే భూలోకవైకుంఠముగా ప్రసిద్దిచెందిన అతిపెద్ద హిందూదేవాలయం.శ్రీరంగం రామనాధ ఆలయం అహోబిలమఠమునకు చెందిన 44వ జీయర్ స్వామివారిచే నిర్మించ బడినది. స్వామిని ప్రతిరోజూ “శ్రీమాన్ శ్రీరంగశ్రీయ మనుపద్రవన్ అందనం సంవర్ధన” అనిస్తుతింతురు. రంగనాధుదు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకొనుచూ దర్శనంఇస్తాడు. 

Srirangam Temple

స్థలపురాణముప్రకారము మనువుకుమారుడు ఇక్ష్వాకుడు బ్రహ్మనుగూర్చి తపస్సుచేసాడు. బ్రహ్మసంతసించి తాను ఆరాధించు శ్రీరంగనాథుని ఇక్ష్వాకునకు ప్రసాదించినాడు. శ్రీరంగనాధుని ఆరాధన శ్రీరామచంద్రునివరకు కొనసాగినది. శ్రీరాముడు అరణ్యవాసము చేసి రావణుడు అపహరించిన సీతకోసం వెదుకు సమయంలో విభీషణుడు రామునితో వైరమువద్దని చెప్పినందుకు రావణునితో విభేధించి రాజ్యబహిష్కారము పొంది పిమ్మట రాముని ఆశ్రయించినాడు. విభీషణుని సహాయంతో రాముడు రావణుని నిర్జించి లంకకు విభీషణుని రాజుని చేసినాడు. పిమ్మట సీతతోఅయోధ్య చేరిన రాముడు అయోధ్యరాజుగా పట్టాభిషిక్తుడు అయినాడు. పట్టాభిషేకము తిలకించుటకు వచ్చిన విభీషణుడు శ్రీరామపట్టాభిషేకం తరువాత శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకువెళ్ళలేకపోయినాడు. ఆసమయమున శ్రీరామచంద్రుడు తనకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడుసంతుష్ఠుడై లంకకు పయన మయ్యాడు. లంకకుపయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో కావేరి, దానిఉపనది కొల్లిదాంనదుల మధ్యభాగమును చేరుసమయానికి సంధ్యాసమయం అయినది. విభీషణుడుస్వామిని అక్కడఉంచి సంధ్యావందనముచేసి తిరిగివచ్చాడు. తిరిగివచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడేప్రతిష్ఠితంకావడంచూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రిభాగమున శ్రీవిభీషణుని పూజలను అందుకుంటానని అనుగ్రహించాడు. ఆలయనకు దక్షణముననున్న రాజగోపురముద్వారా కావేరినదికి వెళ్లవచ్చును. 

ఆదిశేషుడు తనఅయిదుతలలను ఒకగొడుగువలే విశాలముగాపరచి శరీరముఅంతటినీ మృధువైనమంచమువలే చుట్టుకొని కాపాడుచుండగా రంగనాధుడు విశ్రమించుచున్నభంగిమలో దర్శనంఇస్తాడు. ఈవిగ్రహము ఏకశిలలో మలచబడినది. సంవత్సరములోఒకసారి విగ్రహమును చందనము, కర్పూరము, కస్తూరి, గుగ్గిలము మరియు ప్రత్యేక సుగంధద్రవ్యములతో లేపనము పూయుదురు. పునుగుపిల్లి తైలము ప్రతిశుక్రవారము ఉపయోగింతురు. రంగనాధుని పూజించుఆనుభవము మరచిపోలేనిది. ఆఅనుభవము చెప్పుటకంటే స్వానుభములో అనుభవించితే పారవశ్యములో ఉంచుతుంది. సుమారు 1200 సంవత్సరములకు పూర్వము రాజా రాజు అను రాజు ఏర్పాటుచేసిన రాజమహేంద్రన్  తిరుచుట్రు అనబడు అర్ధమండపం మరియు రంగవిమానం మొదటిప్రాకారంలో ఉంటాయి. 

ఆలయసముదాయ ప్రదేశము సుమారు 156 ఎకరాల భూమిలో విస్తరించి యున్నది. 4 కి.మీ. అతిపెద్దప్రాకారము. శ్రీరంగనాధుని ఆలయప్రాంగణం 54 ఉపఆలయముల తోనూ, సప్తప్రాకారాలు, 21 గోపురాలతోవిరాజిల్లుతున్నది. రాజగోపురం 236 అ ఎత్తుకలిగి ఆసియాలోనే అతిపెద్దగోపురముగా ప్రసిద్ధిచెందినది. రంగనాధస్వామి ఆలయములు ఆదిరంగపేరుతో కర్ణాటకరాష్ట్రమునందు మైసూరుసమీపములో శ్రీరంగపట్టణమందు, మధ్యరంగపేరుతో తమిళనాడు శివసముద్రమునందు మరియు అంత్యరంగపేరుతో తమిళనాడులోని శ్రీరంగములోనూకలవు. ఈమూడును కావేరీనదీతీరముననే ఉండుట చెప్పతగ్గవిషయం. శ్రీరంగందేవాలయం ప్రస్తుతం 3 ప్రాకారాల్లోకి నివాస స్థలాలు, వివిధ వైష్ణవమఠాలు, హోటళ్లు, దుకాణాలచే ఆక్రమించబడ్డాయి. మిగిలిన 4 ప్రాకారాలు అలా ఉన్నాయి నాలుగుదిక్కులా అతిపెద్దఎత్తైన రాజగోపురాలు ప్రధానరాజగోపురంనుండి గర్భాలయం వరకు 21 గోపురాల శోభ చూడవలసిందే.  

శ్రీరంగనాథుడికి వైకుంఠఏకాదశినాడు జూన్- జూలై మాసములలోవచ్చు తమిళమాసము ఆణి నెలలో జేష్టాభిసేకము, మార్చి- ఏప్రియల్ మాసములలోవచ్చు తమిళ మాసము పాంగునినందు బ్రహ్మోత్సవము జనవరి. ఫిబ్రవరి నందువచ్చు తమిళమాసము ధాయ్ నందు రధోత్సవము మరియు మే, జూన్ మాసములలో వచ్చు తమిళమాసము వైశాఖినందు వసంతోత్సవము జరుగుతాయి.

ఆలయమందు నిర్వహించు సేవలందు అర్చన అన్నిరోజులలోనూ సమయముతో నిమిత్తములేకుండా నిర్వహించేదరు. అభిషేకములు శ్రీకృష్ణునికి, శ్రీరామునికి, శ్రేవెంకటేశ్వరునికి, భగవద్ రామానుజాచార్యకు నిర్వహించేదరు. శ్రీశ్రీనివాస కళ్యాణఉత్సవం అన్నిశని, ఆదివారములలో ఉ 11-00గంటలకు, పౌర్ణమిరోజున శ్రీసత్యన్నారాయణపూజ సా 6 గం లకు నిర్వహించెదరు చక్రపొంగలి మరియు పులిహోర మధ్యాహ్నం మరియు సాయంత్రం భోజనసమయములో ఆలయము తెరచిఉండు సమయములో ప్రసాదవితరణ చేసేదరు. సాధారణ దర్శనసమయము ఉ 9-00 నుండి 12-00 వరకు మరలా మధ్యాహ్నం 1-15 నుండి 6-00 వరకు తిరిగి 6-45 నుండి 9-00 వరకు. శ్రీరంగంనందు సమీపములోని తీరుచురాపల్లినందు బసచేయునిమిత్తము బడ్జెట్ మరియు ఉన్నతశ్రేణితరగతి హోటల్స్ కలవు.

 రామానుజాచార్యుల నిజరూప దర్శనం  

శ్రీరంగదేవాలయములో రామానుజాచార్యుని విగ్రహముఉన్నది. దీనివెనుక శిల్పంలాకనిపించే నిజశరీరంకూడాదర్శనం చేయవచ్చు. ఇది రామానుజాచార్యుల నిజశరీరం. దీనిని 1137 లో భద్రపరిచారు. అప్పటినుండి రసాయనాలు వాడకుండా వందలఏండ్లనుండి చందనం, కుంకుమతోటే రామానుజాచార్యశరీరాన్ని కాపాడుతున్న సనాతనధర్మపరులు. చందనం మరియు కుంకుమమాత్రమే ఉపయోగిస్తారు. మరే ఇతర రసాయనాలువాడకుండా ఆయనదేహాన్ని ఆయన విగ్రహంవెనక ఉంచారు. అందరికీ చూసేఅవకాశం కూడాఉన్న రామానుజాచార్యుని తప్పనిసరిగా దర్శించవలసినదే.