శిరోగయ

(IPLTOURS)

శిరోగయ (భీహార్), నాభిగయ (ఒరిస్సా), పాదగయ (ఆంధ్ర ప్రదేశ్), మాతృగయ (సిద్ధాపూర్, గుజరాత్) మరియు బ్రహ్మకపాలం (బదరీనాథ్) అనుఅయిదు పితృముక్తికర క్షేత్రములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గయాసురునికి ప్రసాదించిన వరంప్రకారం గయాసురుడు మరణించినపిమ్మట ఆతనిశరీరంలోని శిరము, ఉదరము మరియు పాదములు విస్తరించిన గయ, జాజిపూర్ మరియు పిఠాపురం త్రిగయాక్షేత్రములలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసించునట్లు మూడుక్షేత్రములందు శక్తిస్వరూపములు మంగళగౌరి, గిరిజాదేవి, పురుహూతిక శక్తిపీఠములుగా విరాజిల్లునట్లు, మరణించిన జీవులకు ఈమూడుక్షేత్రములలో పిండప్రధానం చేయుటవలన బ్రహ్మపదము కలుగునట్లు, పితృశ్రాద్ధములందు నామోచ్చారణవలన జీవులకు గయాశ్రాద్ధఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు అనుగ్రహింపబడినది. శిరోగయ బీహార్ రాష్ట్రంలో విష్ణుపాదములు మరియు మంగళగౌరి శక్తిపీఠంలతో గయనందు, నాభిగయ ఒరిస్సారాష్ట్రంలో యజ్ణవేదికాస్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తిపీఠంలతో జాజిపూర్ నందు, పాదగయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతిక శక్తిపీఠంలతో పిఠాపురమునందు త్రిగయాక్షేత్రములుగా ప్రసిద్దిచెందినవి. 

పురాణ ప్రవచనం ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా వ్యవహరిస్తారు. శిరోగయ పితృముక్తికరము. సర్వపాపహరము. శిరోగయ విష్ణుపాదముద్రతో గుర్తించబడింది. ఈపాదముద్ర గయాసురుడిని తనపాదాలకింద విష్ణువు నలిపివేసిన చర్యయొక్క ప్రాముఖ్యత కలిగినది. ఇది వైష్ణవ క్షేత్రం. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. నదిలో స్నానంచేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానంచేసి తమకునచ్చిన పదార్థాలు అనగా తాము భుజించుకూర, ఫలములలో తమకు ఇష్టమైన ఫలము మహావిష్ణువుకు సమర్పించి వాటిని జీవితమునందు మరలాతినకుండా విడిచిపెట్టడం అనాదిగావస్తున్న ఆచారం. పల్గుణినది వద్దఉన్న దేవాలయాలు మరియు ఘాట్లు గొప్ప ఆధ్యాత్మికప్రాముఖ్యతను కలిగిఉన్నాయి. కొన్నిచెట్లను హిందువులు పవిత్రంగా భావిస్తారు. గయవచ్చే భక్తులు భారీసంఖ్యలో ప్రార్థనలు మరియు సమర్పణలు అందించే రావి చెట్లు, గానుగ మరియు మర్రిచెట్లను ఇచటచూడవచ్చు. పిండప్రధానము చేసినపిమ్మట పిండములు ఇచ్చటనే మర్రిచెట్టుక్రింద తమపితృదేవతలకు సమర్పిస్తారు.

Siro gaya

పల్గుణీనది బుద్ధగయకు మూడుకిలోమీటర్ల దూరంలో నిరంజన్ మరియు మొహినిఅను రెండుపెద్ద నీటిప్రవాహముల సంగమంవల్ల ఏర్పడినది. పల్గుణీనది మరణించిన తమవంశజులఆత్మలకు నివాళులుఅర్పించు పవిత్రప్రదేశమిది. వాయుపురాణంలో గయామహత్యంనందు పల్గుణనది శ్రీమహావిష్ణువు నివాసముగా చెప్పబడినది. పూర్వము ఈనదిలో పాలుప్రవహించెడివని నమ్మకం. మరణించినపిమ్మట ఆత్మ పునర్జన్మలేకుండా ముక్తిపొందుటకు పిండప్రధానము చేయువరకు తిరుగాడుతుంటుందని, పిత్రుపక్షకాలముగా భావించు భాద్రపద కృష్ణపక్షం పక్షంరోజులలో పిండదానంచేయుటకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయని హిందువులనమ్మకం. పల్గుణీనది వద్దకేశఖండన చేయించుకొని నదినందు స్నానముచేసి అటుపిమ్మట విష్ణుపదమందిరంవద్ద అక్షయభట్ అనుపెరుకల మర్రిచెట్టుక్రింద పిండప్రధానం చేయుడురు.

భారతదేశమునగల అనేక ప్రత్యేక ఆకర్షణలు కలవు. అట్టి ఆకర్షణలయందు మహావిష్ణువు ఆయుధములైన శంఖము, చక్రము మరియు గధ కలిగియున్న16 అంగులముల పొడవైన మహావిష్ణువు పాదముద్ర కలిగిన గయనందుకల ధర్మశిల అని పిలువబడు విష్ణుపదఆలయము ఒకటి. విష్ణుపాదము ఒక రాతిపై చెక్కబడి వెండితోచుట్టూ పళ్ళెంవలె తాపడము చేయబడిఉంటుంది. ఈపవిత్ర క్షేత్రం పల్గుణినది తీరమునందు మూడువైపులా బండరాళ్ళు మరియు ఒకవైపు నీటితోనూఉన్నది. ధశరధమహారాజు మరణించి నప్పుడు శ్రీరాముడు గయలో ఇచ్చటనే పిండ ప్రధానము చేసినాడు. విష్ణుపాద ఆలయం మహావిష్ణువుకు అంకితమీయబడినది. ఆలయం సుమారుగా 100 అడుగుల ఎత్తుతో ఎనిమిది చెక్కబడిన స్తంభములు కలిగి ఉంటుంది. అష్టభుజి ఆకారములో తూర్పు ముఖముగా ఆలయము నిర్మించబడినది. ఏభైకేజీల బరువుకల బంగారపుజెండా ఆలయశిఖరముపై ఎగురుతూ ఉంటుంది.

విష్ణుపాదము కధనము

గయాసురుడు అనురాక్షసుని పేరుతో ప్రసిద్ధమైనది గయ. గయాసురుడు తపస్సుచేసి తనను చూసినవారికి పాపములునశించి మోక్షము పొందునట్లుగా వరము పొందినాడు. దుష్కర్మలుచేసి జనులు గయాసురుని దర్శించి మోక్షము పొందేడివారు. అప్పుడు మహావిష్ణువు గయాసురుని ఎదుట ప్రత్యక్షమై ఆతనిని పాతాళలోకమునకు వెళ్ళమని శాసించి గయాసురునితలపై తనకుడిపాదం ఉంచి గయాసురుని పాతాళలోకమునకు అనగద్రొక్కినాడు. ఆవిష్ణుపాదం ఈరోజునకుకూడా శిలపై దర్శించవచ్చును. గయాసురుడు తనకు ఆహారము కొరకు విష్ణువును అర్ధించాడు. విష్ణువు ఈక్షేత్రమునందు పెద్దలకు పిండప్రధానము చేయుటద్వారా పెద్దలకుముక్తి కలుగునని పెద్దలకుచేయు పిండప్రధానము ఆహారముగా స్వీకరించమని వరాము ఇచ్చినాడు. ఏ రోజు గయాసురుడు ఆహారము పొందడో ఆరోజు జగతికి ప్రళయమని తెలిపినాడు. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు. సతీదేవి శరీరభాగాల్లో రొమ్ముభాగం పడినప్రదేశం గయ. 

Vishnupad Mandir, Gaya, Bihar.

స్థల పురాణానికి తగ్గట్టుగానే రొమ్మునుపోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. మంగళగౌరి కొండపైభాగమున తూర్పుముఖముగా ఈఆలయము నిర్మించబడినది. కొండ పై భాగమునకు మెట్లు మరియు రోడ్డు కలవు. ఒకచిన్న మండపము ఆలయముముందు భాగమునకలదు. శివుని చిన్నవిగ్రహములు రెండు, మహిషాసురమర్ధిని, దుర్గ మరియు దక్షణకాళి చిత్రములు కలవు. ఈఆలయ సముదాయమునందు మహాకాళి, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు మరియు శివుని ఆలయములు కలవు.

ఆలయము సంవత్సరమంతయు ఉదయం 6 గంటలనుండి రాత్రి 8 గంటలవరకు తెరచి ఉంటుంది. క్షేత్రమునకు సమీపములో వసతి గృహములు మరియు హోటల్స్ కలవు. ఇచట కల భోజన వసతి సదుపాయములు మరియు పిండ ప్రదానమునకు పౌరోహితులు క్షేత్రములో లభ్యమగుదురు.

వారణాశి, గయ అరియు ప్రయాగ రాజ్ నందు పిండప్రధానం మరియు ప్వారణాశిలో ఒకరికిచేయు అన్నదానం కోటిరెట్లు పుణ్యం అధికమని చెప్పియున్నందువలన కాశీ, గయ, ప్రయాగరాజ్ నందు ఖర్మలు చేయుటవలన మాతృపితృ వంశీయులకు ఉత్తమ గతులతోపాటు జరిపించువారికి ఆన్నదాన ఫలంకూడా వచ్చును. కావున వారణాశినందు బసచేసి అచ్చటినుండి గయ మరియు ప్రయాగరాజ్ రైలుద్వారా కానీ బస్సుద్వారా కానీ ప్రయాణించి పితృఖర్మలు చేసి వారికి ముక్తి కలిగించుటద్వారా తరించవచ్చును. వారణాశి నందున్న సేవాసత్రములలో శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రము బసచేయుటకు మరియు భోజన సదుపాయము అన్నీకులములవారికి అందుబాటులో నుండునని అనతికాలములో వారికి బహూకరించిన లైఫ్ అచీవ్మెంటు అవార్ధు తెలుపుచున్నది. కావున ఈఅవకాశము వినియోగించుకొని ప్రస్తుతము మహాలయ పక్షములు 21-09-21 నుండి ప్రారంభమైనడువనలన మరియు ఇచ్చట పిండప్రధానముచేయు కర్త లభ్యముకాక విదేశములందు ఉద్యోరీత్యా నివసించుచున్నను లేదా వృద్ధాప్యమువలన వెళ్లలేనివారు వీరిని సంప్రదించిన శోత్రియ బ్రాహ్మణునిచే పిండప్రధానము నిర్వహించేదారు. మాహాలయపక్షముల విశిష్టత ఫేస్ బుక్ చూపరులకు బాగుగా తెలియును. ఈపదిహేనురోజులందు మరణించినవారి తిధిరోజున పిండప్రధానము చేసినట్లయిన వారిఆత్మలు ముక్తిపొందునని తెలుపబడినది. సేవా సత్రములకు సాధ్యమైనంత సహకారమందించిన వారణాశి యాత్రికులకు అవసరమైన సదుపాయములు అందించుటకు సాధ్యపదును. ప్రస్తుతము కావున అవకాశము ఉపయోగించుకొని వారణాశి, గయ మరియు ప్రయాగరాజ్ నందు పిండప్రధానముచేసి పితృదేవతలకు ముక్తి కలిగించవచ్చును.

పిండప్రధానం పితృదేవతలకు మోక్షప్రదం