వినాయక నంది

(IPLTOURS)

వినాయక నంది మహానంది ఆలయ ప్రాంగణములో వాయువ్యముగా ఉన్నది. మహానంది గోపురమునుండి బయటకు వచ్చు మార్గములో ఎడమప్రక్క కోనేటిగట్టుపై ఉన్న చిన్నదేవాలయము. మహాశివుని కుమారుడైన గణేశుడు ప్రధమ పూజ్యుడు మరియు ప్రత్యేకముగా పూజించవలసినవాడు. శివపార్వతులవలన మరియు అందరుదేవతలవలన గణేశునికి ఆవరము లభించినది. అందువలననే ఏదేవాలయము సందర్శించిననూ విఘ్నేశ్వరుడు ప్రత్యేకఆలయము లేదాస్థానము కలిగి యుండును. అందువలననే శివునికానీ మరేఇతర దేవతలను పూజించుటకు ముందుగా వినాయకుని పూజించవలసి ఉన్నది. యాత్రికులు ఆలయమునందు కూర్చొని విఘ్నేశ్వరుని క్రింద తెలిపిన అష్టోత్తర శతనామావళి పఠించి స్వామికృప పొందుట ద్వారా యాత్రదిగ్విజముగా సాగించవచ్చును. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని నానుడి.

ఓం గజాననాయ నమః , ఓం గణాధ్యక్షాయ నమః , ఓం విఘ్నారాజాయ నమః ,ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః , ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః (10), ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః, ఓం ప్రమధాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః (30), ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః (50), ఓం సర్వాయ నమః, ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః, ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసుర భంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః (70), ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః, ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్త జీవితాయ నమః, ఓం జిత మన్మథాయ నమః, ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః, ఓం యక్షకిన్నెర సేవితాయ నమః, ఓం గంగా సుతాయ నమః, ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్ట వరదాయినే నమః, ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళ ప్రదాయ నమః, ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః (90), ఓం సఖయే నమః, ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణీ మేఖాలాయ నమః, ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాత కారిణే నమః, ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణ గురవే నమః, ఓం ఉన్మత్త వేషాయ నమః, ఓం అపరాజితే నమః                                                
ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)             

IPLTOURS Indian Pilgrim Tours