శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం

(IPLTOURS)

దేశములోని చారిత్రకనిర్మాణ ఆలయమలందు ప్రముఖమైన స్వయంభూః వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరుజిల్లా తిరుపతికి 75 కి.మీ. దూరంలోఉన్నది. కాణిపాకం వరసిద్ధివినాయకుని చరిత్రకు తూర్పుగోదావరిజిల్లా కోనసీమలో అయినవిల్లినందు స్వయంభూః గావెలసిన సిద్ధివినాయకుని చరిత్రకు దగ్గరసంబంధమున్నది. రెండు ఆలయములు స్వయంభూః ఆలయములే. అయినవిల్లినందు సిద్ధివినాయక ఆలయము ఆలయసముదాయంలో నుండగా కాణిపాకంనందు స్వామిఆలయం ప్రత్యేకముగా ఒక్కటిమాత్రమే ఉన్నది. అయినవిల్లినందు హోమగుండములోని అగ్నినందు కాణిపాకంలో కళ్యాణి అనుకొననేరు జలమునుండి అనగా రెండు పంచభూతములలోని అగ్ని మరియు జలమునుడి ఉద్భవించినవే. దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రేవల్లభుని మాతామహుడు అనగా శ్రీపాద శ్రీవల్లభునితల్లి సుమతియొక్క తండ్రి మల్లాది భావన్నారాయణ అవధానుల ఆధ్వర్యము నందు అయినవిల్లిగ్రామంలో స్వర్ణమహాగణపతియజ్ఞం నిర్వహించబగా యాగముచివర స్థానికపండితులు వినాయకుడుతొండంతో హోమద్రవ్యాలను స్వీకరించాలని, స్వర్ణమయాకాంతులతో దర్శనం ఈయవలెనని వాదించారు.

Sri Swayambhu Varasidhi Vinayaka Swamy Temple

వినాయకుడు హొమగుండములోని బూడిదనుండి మానవరూపముతో పిమ్మట మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరికమేరకు స్వర్ణ గణపతిగా హోమద్రవ్యాన్ని తనతొండముతో గ్రహించి పండితులపై ఆగ్రహించి, తనఉనికిని ప్రశ్నించిన ముగ్గురుపండితులలో ఒకరు సత్యంయొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళతోచూసికూడా చూడలేదని చెప్పుటవల్ల ఆతను గ్రుడ్డివాడిగా, రెండవవారు సత్యాన్ని వ్యక్తీకరించడాన్ని ఎగతాళిచేసినందువ అతను మూగవానిగా, భక్తులు చెప్పినసత్యాన్ని వినపడనట్లు ప్రవర్తించిన మూడవవారు చెవిటివానిగా జన్మించెదరరని శపించి, వారుమరుజన్మలో తన స్వయంభూః మూర్తిని తాకినప్పుడు శాపవిమోచనం వారికి జరుగుతుందని శాపవిమోచనం తెలిపాడు.

స్థలపురాణముప్రకారం కాణిపాకం గ్రామమునందు పుట్టుకతో గుడ్డి, మూగ, చెముడు వైకల్యంకల ముగ్గురుసోదరులు విహారపురి గ్రామము ప్రస్తుతం కాణిపాకంనకు దగ్గరగా వారికిగల స్వల్పభూమినందుకల నేలనూతినుండి నీరుతోడుకొని సాగుచేసుకొనుచూ నిరాడంబరముగా జీవించేవారు. ముగ్గురు సోదరులలో ఇద్దరు బావినుండి నీటిని తోడుచుండగా మూడవవాడు భూమికి నీరు పోసేవాడు. ఒకసంవత్సరం కరువువచ్చి వర్షములుపడక భూగర్భజలము క్షీణించి బావినందునీరు ఎండిపోయి వారు నిరాశకు గురయ్యారు,. వారిలో మూగవాడు బావినందు దిగి గడ్డపారతో ఇసుకను మట్టిని తీసివేయుట ప్రారంభించగా మిగిలినఇరువురు ఇసుకను మట్టిని భూమిపైకి చేరవేయ సాగారు.పిమ్మట మూగవాని గెడ్డపారకు నీటిఅడుగున ఉన్నరాతికి గట్టిగా తగిలింది. రాతినుండీ రక్తముచిమ్మి బావిలోని నీటితో కలసిపోయినది. రక్తము తగిలిన మూగవాడు చిత్రముగా మాట్లాడుట ప్రారంభించాడు. చెవిటివానిదేహము ఆనీటితో తడిసి అతను వైకల్యమునుండి విముక్తుడైనాడు. గుడ్డివాడు నూతిలోనికి సోదరుల సహాయముతో దిగి రాతిని స్పర్శించుటవలన వాని గుడ్డితనము మాయమై చూపువచ్చినది. ఈవార్త గ్రామస్తులకు తెలిసి బావినుండి ఆరాతిని బయటకుతీయుటకు ప్రయత్నించారు. రాతినికదల్చు వారిప్రయత్నము ఫలించకపోయినా ఆరాయి స్వయంభూః వరసిద్ధి వినాయకునిగా బయల్పడినది.

ఈరోజునకు కూడా విగ్రహము అచ్చటనే కళ్యాణిఅని పిలువబడు కోనేటినందుఉన్నది. ఈపవిత్ర కోనేరులోని నీళ్లు ఎన్నటికీఎండిపోవు ఎంతత్రవ్వినా ఆవిగ్రహం అడుగుభాగం కనిపించక దైవికశక్తిని తెలియచేస్తుంది.. గణేశుడు నీటితోనిండిన నూతినందే కూర్చొనిఉన్న భంగిమలో ఉండిపోయాడు. వర్షాకాలంలో, పరిశుభ్రమైన నీటితో బావిపొంగిపొర్లుతుంది, ఈనీటిని భక్తులకు తీర్థంగా సమర్పిస్తారు. దేశంలోని వివిధప్రాంతాలనుండి వచ్చేభక్తులు కాణిపాకం వినాయక దేవాలయాన్ని సందర్శించి స్వామికి ప్రార్థనలు చేస్తారు, వినాయకుని పాలభాగం  తెలుపు, పసుపు మరియు ఎరుపు రంగులతో ఉంటుంది. కాణిపాకం గ్రామము సందర్శించి శ్రీ బాపన్న అవధానులు మరియు వారి బావ శ్రీధరావధానులు వరసిద్ధి వినాయకుని విగ్రహము స్థాపించినారు. 

ప్రజలమధ్య వివాదాన్ని పరిష్కరించి చెడునుఅంతం చేయడానికి విగ్రహంకల నూతిపై సుమారు వేయి సంవత్సరములకు పూర్వము చోళరాజుచే నిర్మించబడి రెండువందల సంవత్సరముల పిమ్మట విజయనగర రాజులచే విస్తరించబడినది. బావిఎల్లవేళలా నీటితోనిండి ఉంటుంది. వరసిద్ధివినాయకుడు స్వయంభూః గాను, బావి కళ్యాణి అనుపేరుగల కొనేరుగాను ఖాతిగాంచినవి. కాణిపాకం వినాయకుని సందర్శించే భక్తులు తమపాపాలను తొలగించి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆలయంలోని పవిత్రమైననీటిలో స్నానంచేస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకుని కీర్తి ఈవిధముగా ప్రపంచము నలుమూలలా వ్యాపించింది కాణిపాకం వినాయకుని విగ్రహపరిమాణం కాలక్రమేణా పెరుగుతూ ప్రస్తుతం విగ్రహం మోకాళ్ళు మరియు ఉదరంవరకు మాత్రమే కనపడుతుంది. సుమారు ఏభై సంవత్సరములకుపూర్వం ఒకభక్తుడు స్వామికిసమర్పించిన వెండికవచము ప్రస్తుతము స్వామి విగ్రహానికి సరిపోవుటలేదన్నది ప్రత్యక్షనిదర్శనం. 

కాణిపాకం నందు తమిలభాష కానీ అనగా పల్లపుభూమిఅని అటులనే పాకంఆనగా ప్రవహించునీరు అనిఅర్ధము. ఆవిధముగా కాణిపాకం అనుపేరుతో ఈగ్రామము ప్రసిద్ధమైనది. కాణిపాకం వరసిద్ధివినాయకుని ఆలయసమీపంలో బహుదా అనునది ప్రవహించుచున్నది. కధనంప్రకారం శంఖ లిఖితఅను పేర్లుకల సోదరులు కాణిపాకంవచ్చుటకు యాత్ర ప్రారంభించినారు. బహుదూరం కష్టమైనప్రయాణం చేయుటవలన లిఖితునికి ఆకలివేయగా సోదరునిమాట వినక దగ్గరలో ఉన్న మామిడితోటనుండి తోటయజమాని అనుమతిలేకూడా తినుటకు మామికాయ కోసినాడు. సత్యం మాట్లాడుటకు కట్టుబడిన శంఖుడు ఆవిషయం ఆప్రాంతపురాజునకుతెలిపి యాత్రచేయునపుడు అనుమతిలేకుండా మాదిడికాయకోసి పాపముచేసిన లిఖితునికి శిక్షింపకోరినాడు. రాజు లిఖితుని రెండుచేతులు ఖండించవలసినదిగా ఆదేశించినదు. వారు కాణిపాకంచేరి వరసిద్ధివినాయకుని ఆలయప్రాంగణమునందుప్రవహించు బహుదానది పవిత్రమైన నీటినందు మునుగగా ఆశ్చర్యముగా లిఖితుని ఖండిపబడిన చేతులు తిరిగివచ్చినవి. అందువలననే ఈపవిత్ర నదికి “బాహుద” అనగా బాహువులు (బాహు) ఇచ్చునది (ద) అని పేరువచ్చినది అనికధనం.   

kanipakam ganesh idol

వరసిద్ధివినాయకునికి ప్రతిరోజూ పాలాభిషేకములు, అభిషేకములతో పాటుగా గణపతిహోమము మరియు కళ్యాణోత్సవములు నిర్వహించేదరు. ప్రతి సంవత్సరము వినాయకచతుర్ధినుండి బ్రహ్మోత్శవములు ఇరవైరోజులపాటు సంప్రదాయసిద్ధముగా జరుప బడును. ఉత్సవ మూర్తిని అందముగా అలంకరించబడిన వాహనములపై ఊరేగింపుగా తీసుకొనివచ్చేదరు. ఆలయమునందు బ్రహ్మోత్సవం మరియు దీపోత్సవం జరిపేదరు. వివిధప్రదేశాలనుండి వచ్చుభక్తులు అమితభక్తితో ఉత్సవంనందు పాల్గొనేదరు. మొదటిరోజు అభిషేకములు మరియు ద్వజారోహణ, పిమ్మట వరుసగా హంసవాహనం, నెమలివాహనం, మూషిక వాహనం, శేషవాహనం, వరాహ వాహనం, గజవాహనం, రధోత్సవం, అశ్వవాహనం, ధ్వజారోహణం, నందివాహనం, రావణబ్రహ్మ వాహనం, యాల్లీ వాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనం, విమానోత్సవం, పొంగలిసేవ, కల్పవృక్షవాహనం, పుష్పపల్లకి సేవ, తెప్పోత్సవంలందు వాహనములపై ఊరేగింపు మరియు ఉత్సవములు చేసేదరు. ఆలయమందు జరుగు రధోత్సవందర్శించుటకు దేశం నలుమూలలనుండి యాత్రికులు వచ్చేదరు. సాంప్రదాయ దుస్తులు ధరించినవారికి మాత్రమే ఆలయప్రవేశం లభ్యమగును.   

ప్రతిరోజూ మధ్యాహ్నం 2000 మంది భక్తులకు ఉచితభోజనము పంపిణీచేసేదరు. ఆలయ సత్రములు మరియు వివాహములు జరుపుట కొరకు కళ్యాణమండపములు ఉన్నవి. సమీపములో మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ కలవు. వివిధసేవలు మరియు బసకు ముందుగా బుకింగ్ చేసుకొను సదుపాయమున్నది. తిరుపతినుండి 68 కి.మీ దూరములోనున్న కాణిపాకం రోడ్డుద్వారా బస్సుపైకానీమ ప్రయివేటువాహనముపై కానీ చేరవచ్చును. తిరుపతికి దేశములోని అన్నిపట్టణములనుండి రైలు మరియు బస్సుసదుపాయముతో పాటు విమానసౌకర్యము కలదు. తిరిపతి యాత్రనందు కాణిపాకం దర్శించవచ్చును.

ఈసందర్భముగా గణేశుని జననము గురించి ఆయన విశిష్ట ఆకారముగురించి సూక్ష్మముగా తెలుసుకొనవలసి ఉన్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద గౌరీదేవిరూపములో నున్నపార్వతిని కలియుటకువచ్చిన శివుని ఆటంక పరచిన పార్వతీదేవి మానసపుత్రుని శిరమును ఆగ్రహముతో పరమశివుడు తన త్రిశూలముతో ఖండించి పిమ్మట పార్వతీదేవి కోరిక మేరకు అంతకుముందు వధించబడి తనశిరస్సు లోకపూజ్యమగునట్లు వరముపొందిన గజాసురునిశిరస్సు ఆబాలుని మొండేముకు జతపరచి పురార్జీవితునిచేయగా గణేశుడు తదితర 108నామములతో ప్రసిద్ధిచెంది బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు గజాననుడైన పార్వతీనందనునికి వరములిచ్చుటవల్ల మరియు శివుడు గణములకు అధిపతిని చేయుటద్వారా ప్రధమపూజ్యుదాని ప్రకటింపబడి  విఘ్నములను తొలగించువాడు కావున విఘ్నేశ్వరుడు అయినాడు. ఆరూపంతోనే గణేశుడు భక్తులను అనుగ్రహించుచున్నాడు. శివుంచే శిరము ఖండించబడిన శిరస్సులేని వినాయకుని ఆలయము ప్రపంచములో ఒకేఒకచోట గౌరీకుంద్ వద్ద ముండ్కతియా అనుచోటగల ఈఆలయం ఆదరణకి నోచుకోపోవుటకు కారణం బహుశా భక్తుల ఊహాలోని గణేశుడు ఇక్కడదర్శనం ఈయకపోవడం. కావున గౌరీకుండ్ వద్దనున్న ముండ్కతియావద్ద ఎంతోప్రాముఖ్యముకల ఈఆలయమునందు తలలేని ఈగణేశుని చార్ ధామ్ యాత్రచేయు యాత్రికులు కేదార్నాధ్ మరియు గౌరీకుండ్ దర్శించు యాత్రికులు ఈయాలయము దర్శించుటవలన మరియు ప్రభుత్వమువారు 2013 నందు జరిగిన ఉత్పాతముమందు డెబ్బదిన్న రోడ్లమరమ్మత్తుతో మరియు సందర్శకులను ప్రోత్సహించుట వలన ఆలయ అభివృద్ధికి తమవంతు సహకారం అందించేదరని ఆశించవచ్చును.

దర్శన సమయములు ఉదయం 4-00 నుండి  రాత్రి 9-30 వరకు. 

ఓం గం గణపతయే నమః