ద్వారక

(IPLTOURS)

ద్వారక పూర్వపు సౌరాష్ట్ర మరియు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రములో అరేబియాసముద్రపు ఒడ్డుననున్న ద్వీపకల్పము. ఈదేవభూమి ద్వారకాజిల్లానందు గౌతమీనదితీరము నందు గల పురాతన నగరము. ద్వారక పురాణములలో పేర్కొనిన ప్రకారము సుమారు నాలుగువేల సంవత్సరములకు పూర్వము రాజ్యపాలనచేసిన శ్రీకృష్ణుని పాలనలోని బంగారురాజ్యము. ద్వారక అనుపేరు సృష్టికి మూలమైన బ్రహ్మయొక్క ఆద్యాత్మిక ఐఖ్యతకు ముఖద్వారమువంటిది. ప్రతిసంవత్సము జన్మాష్టమినాడు శ్రీకృష్ణుని పుట్టినరోజు అత్యంతవైభవముగా జరిపెడి ద్వారకాదీష్ ఆలయమునకు స్వస్థలము. పురాతన గ్రంధములైన దివ్యప్రభంధములలో ప్రముఖముగా పేర్కొనబడి శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన బదరీనాథ్, పూరీ,రామేశ్వరంలతోపాటు చార్ ధామ్ నందు నాలుగవపుణ్యక్షేత్రము. మరియు పన్నెండుమంది ఆళ్వారులు తమ దివ్య ప్రభంధమునందు కీర్తించిన మహావిష్ణువు 108 దివ్యదేశములందు ఒకటి. శ్రీకృష్ణుని రాజ్యమునకు ముఖ్య పట్టణముగా సుపరిచితమై మోక్షపురిగా భావించబడుచున్నది. గుజరాత్ రాస్త్రమునకు మొదటి ముఖ్యపట్టణము. 

తన మేనమామ కంసుని మధురనందు సంహరించిన పిమ్మట కృష్ణుడు ఇచ్చటనే నివసించినాడు, కృష్ణుడు మధురనుండి  వచ్చినపిమ్మట గుజరాత్ సంస్కృతికి సంతసించి సముద్రమునుండి దాదాపు 150 కిలోమీటర్ల భూమినందు ద్వారకానగర నిర్మాణము చేసినాడు. ఆర్యులు ద్వారక ముఖ్యపట్టణముగా రాజ్యపాలనచేసినారు. మగధరాజైన జరాసంధ వధపిమ్మట కృష్ణుడు ద్వారకనందు నివశించవలెనని నిర్ణయించుకొనినాడు. కృష్ణుడు తనతల్లితండ్రులతో సముద్రలో ద్వీపమునందుకల బెట్ ద్వారకనందు నివసించుచూ ద్వారకనుండి రాజ్యపాలన చేసినాడు.                                                                                                                            

ద్వారకలోని ద్వారకాదీష్ ఆలయము సుమారు నాలుగువేలసంవత్సరముల పూర్వము నిర్మించబడి మహమ్మదీయుల దాడినందు ద్వంసముకాబడినదని మరలా 16 వశతాబ్దములో పునర్నిర్మించబడినట్లు చరిత్రకధనము, 1861 సం.లో ద్వారకాదీష్ ఆలయంలయం పురుద్ధరించబడి బరోడామహారాజుచే ఆలయశిఖరమునకు బంగారుకలశము ఏర్పాటుచేయబడినది. ద్వారకను భారతదేశములోగల పన్నెండు సాంస్కృతి పరిరక్షణ కేంద్రములలోఒకటిగాప్రకటించి కేంద్రప్రభుత్వమువారి సాంస్కృతిక కేంద్రముల పరిరక్షణ పదకముయందు చేర్చుటజరిగినది. బెట్ ద్వారకకు పర్యాటకులను ఆకర్షించు నుద్దేశ్యముతో ద్వారకనందు జగత్ మందిరమునుండి ద్వీపమునందుకల పంచకుల్ కలుపుచూ శ్రీకృష్ణుని చిన్ననాటి మిత్రుడు సుధాముని పేరుతో సుధామసేతు అనువంతెన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు గుజరాత్ పర్యాటకసంస్తవారితో కలిసినిర్మించినారు. గోమతీనదివద్ద పూర్వము నౌకాశ్రయము ఉండేదిది. ద్వారకకు దేశములోని ఇతరపట్టణములతో విమానమార్గము, రైలుమార్గము మరియు రోడ్డుమార్గము ద్వారా కలుపబడియున్నది. ద్వారకలో ద్వారకాదీష్ ఆలయం, రుక్మిణీదేవిఆలయం మరియు గోమతిఘాట్ చూడతగినవి. ఇచట లైట్ హౌస్ ప్రత్యేకఆకర్షణ.           

ద్వారకాదీష్ ఆలయము 

రాజా జగత్ సింగ్ చే నిర్మితము కాబడుటవలన జగత్ మందిరముగా పిలువబడు ద్వారకాదీష్ ఆలయం ద్వారక నడిబొడ్డున ఉన్నది. పూర్వము శ్రీక్సృష్ణుడు నిర్మించిన పట్టణమునందు ఈఆలయము సముద్రమట్టముతో సమానమైన ఎత్తుకలిగి పశ్చిమ ముఖముగా నిర్మించబడినది. అంతరాలయము లేదా గర్భగుడినందు నాలుగుచేతులతో త్రివిక్రముడుగా పిలువబడు ద్వారకా దేశుడు ముఖ్యదేవతగా కొలువబడు ఈఆలయశిఖరముపై సూర్యచంద్రుల చిత్రములతో కూడిన జండా ఎగురుచూ ఉంటుంది. దర్శస సమయములు: ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు తిరిగి సాయంత్రం 5 నుండి 9-30 వరకు.

Dwarkadheesh_temple 5

 గోమతీ ఘాట్ 

గోమతీనది యొక్క ఘాట్ నుండి మెట్లద్వారా యాత్రికులు గోమతీనది చేరుకొని పవిత్ర గోమతీనదినందు స్నానముచేసి ద్వారకాదీష్ ఆలయము దర్శింతురు. ఈఘాట్ వద్ద సముద్రుని విగ్రహములతోపాటుగా సరస్వతి, లక్ష్మణ విగ్రహములు కూడా కలవు. గోమతినది సముద్రములో కలియు సంగమ ప్రదేశమునందు సముద్రనారాయణుని ఆలయం, విష్ణువు ఆయుధమైన చక్రముముద్రతో రాయికల చక్రనారాయణ ఆలయం, వశిస్టమహర్షితో భూమికి తేబడినదని చెప్పబడు గోమతీనది విగ్రహముకల గోమతీఆలయం ఉన్నవి.

రుక్మిణీదేవి ఆలయం

ద్వారకనుండి సుమారు 2 కి. మీ దూరములో కృష్ణుని పట్టపురాణిఅయిన రుక్మిణీదేవి ఆలయంకలదు. ఈఆలయం సుమారు 2500 సంత్సరములకు పూర్వముదని చెప్పబడుతున్నది కానీ వాస్తవరూపము 12వ శతాబ్దమునకు చెందినట్లు కనపడుతుంది. ఆలయము గోపురభాగము మరియు బయటిగోడలుకూడా వివిధ దేవతాప్రతిమలతో చాలా అందముగా ఉంటుంది. రుక్మిణీదేవి విగ్రహము మరియు గజరాజు (ఏనుగుల) బొమ్మలు. అంతరాలయమునందు చెక్కబడియుండును ఇవియే కాక కాలిబారి ఆలయం, సిద్ధివినాయక ఆలయం, గోలోక్ ధామ్ మరియు ఇస్కాన్ ఆలయం చూడతగ్గవి. ద్వారకనందు బసచేయుటకు అనేక చిన్నతరహా, మధ్యతరహా మరియు ఉన్నతశ్రేణి హోటల్స్ ఉన్నవి. భోజన సదుపాయముకొరకు అనేక హోటల్స్ నందు ఉత్తర, దక్షణ భారతదేశ వంటకములు లభించును.

శ్రీశారదా పీఠం

జగద్గురు శ్రీఆదిశంకరుడు సనాతనధర్మం మరియు అద్వైత వేదాంతాన్ని కాపాడటానికి మరియు ప్రచారం చేయడానికి స్థాపించిన నాలుగుమథములలో ద్వారకనందలి శ్రీశారదాపీఠం లేదా శారదామఠం ఒకటి. గుజరాత్ లోని ద్వారక నగరంలో ఉన్నఈమఠం నాలుగు చతుర్మాణయ మఠాలలో పశ్చిమమఠం అనబడు శారదామఠం ద్వారకా పట్టణము మధ్యలో ఉన్నది. దీనిని కాలికా మఠం అని కూడా అంటారు. ఆదిశంకరుడు సంప్రదాయంప్రకారం ప్రారంభించిన ఈమఠం సామవేదంపై అధికారం కలిగిఉంది.