సరస్వతి దేవి

(18వ శక్తి పీఠం)

జ్నాన ప్రదా సతీ మాతా ! 
కాశ్మీరేశు సరస్వతీ !!
మహా విద్యా మహామాయా ! 
భుక్తి ముక్తి ప్రదాయిని
!!

అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఉన్న కథ 

బ్రహ్మ శక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తిసహకారము కొరుటకు యజ్ణము చేసినాడు. శక్తి శివుడినుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసినది. బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొనినాడు. బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ణములు చేసినాడు. దక్షప్రజాపతికి సతీదేవి కుమార్తెగా జనించినది. సతీదేవి ఈశ్వరుని వివాహము చేసుకొనవలెనని తలచినది. దక్షుడు ప్రాధమికముగా అంగీకరించక పోయిననూ చివరిగా సతిని శివునికిఇచ్చి వివాహము చేయుటకు అంగీకరించినాడు. బ్రహ్మ పృధ్విని తప్పుడు ఉద్దేశ్యముతో చూడగా శివుడు బ్రహ్మపై కోపము చెంది తన త్రిశూలముతో బ్రహ్మ అయిదవ శిరస్సు నరకివేసినాడు. అందుకు కోపగించిన దక్షుడు తనకుమార్తె సతిని శివునికి ఇచ్చివివాహము చేయుట విరమించుకొనినాడు. కానీసతి శివునియందు ఆకర్షితురాలై శివుని వివాహమాడినది. ఈవివాహము దక్షునికి శివునియందు ద్వేషము పెంచినది.

దక్షుడు నిరీశ్వరయాగం చేయుటకు సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానముపంపి కైలాసమందున్నశివసతులకు ఆహ్వానము పంపియుండలేదు. శివుడు యజ్ణమునకు వెళ్లవద్దని వారించినను సతీదేవి వినక నందిని వెంటబెట్టుకొని యజ్ణమునకు వెళ్ళినది. యజ్ణమునందు దక్షప్రజాపతి చేయు శివనింద సహించలేక అవమానింపబడిన దక్షునికుమార్తె మరియు శివునిభార్య అయిన సతీదేవి యోగులకు కూడా  సాధ్యంకాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలోఉన్న ఆమె శరీరంనుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆయోగాగ్నిలో సతీదేవి దహనమయి పోయింది. సతీదేవి ఆత్మాహుతిగురించి యోగసమాధిలో ఉన్న పరమేశ్వరుడు విని క్రోధంతో రగిలి పోయాడు. ప్రళయతాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సునుండి జటఒకటి తెంచి, భూమిమీదకి విసిరాడు. జటనుండి మంటలు చెలరేగాయి. ఆమంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసి పడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి ప్రణామం చేయగా ప్రమథగణాలతో కలసి, దక్షునియజ్ఞం ధ్వంసం చెయ్యమని చెప్పాడు శివుడు.

మెడలో కపాలమాలతో వీరభద్రుడు మరియు నిప్పులను చిమ్ముతూ భద్రకాళి దక్షునిరాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆపోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి  తన ఆఖరి  ఆస్త్రంగా సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూకాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు అవకాశం ఇచ్చాడు. అంతట వీరభద్రుడు దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమెమృత శరీరాన్ని అంటిపెట్టుకొనిఉండి తనజగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆదేహాన్నిఖండాలుగాచేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు ఆవిభక్త హిందూదేశమునందుపడి దివ్యస్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనాస్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలోను దాక్షాయణీ భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. దక్షునిభార్య కోరికపై శివుడు మేషము (మగ మేక) తలను దక్షుని మొండెమునకు అతికి మరలా బ్రతికించినాడు. సతీదేవి గజ్జభాగము మాత్రము శ్రీలంకలోని ట్రింకోమలినందు పడినది. సతీశరీర భాగములుపడిన ప్రదేశములపై వివిధ కధనములు ఉన్నవి. అయిననూ అందు 18 భాగములు పడిన స్థలములు ఆష్టాదశ శక్తిపీఠములుగా వెలుగొందుచున్నవి. శక్తిపీఠము దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తిపీఠము దర్శనఫలము సిద్ధించునని తెలుపబడినది.

సరస్వతి దేవి – శారదా పీఠం

అష్టాదశ శక్తిపీఠములలో సతీదేవి కుడిచేయి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ముజఫరాబాద్‌కు 150 కి.మీ దూరంలో పడినది. ఈపుణ్యస్థలము సరస్వతిదేవి పేరుతో 18వ శక్తిపీఠముగా ప్రసిద్ధిచెందినది. ఇచట ప్రస్తుతము ఒక శిథిల ఆలయం ఉన్నది. ఆది శంకరాచార్యులవారు ఈఅమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యంనందు చెప్పబడినది. సుమారు వేయి సంవత్సరములకు పూర్వము ఇచట భారత ఉపఖండములో ప్రసిద్ధి చెందిన విశ్వవిధ్యాలయం ఉండేడిది. ఈ విశ్వవిధ్యాలయపు గ్రంధాలయములోని గ్రంధములు చదువుటకు పండితులు బహుదూరము నుండి వచ్చేడివారు. ఉత్తరభారతదేశమునందు శారదాలిపి అభివృద్ధి చెందుటకు అదేపేరుతో ఆలిపి పిలువబడుటకు కాశ్మీర్ నకు “శారదా దేశ్” గాపేరు మారుటకు కారణము అయినది. కాశ్మీర్ పండితులకు హిమాలయ పర్వతములలో జమ్ము కాశ్మర్ నందున్న పవిత్రక్షేత్రములు అమర్నాధ్ మరియు ఆనంతనాగ్ జిల్లా మార్తాండ్ నందుకల సూర్యదేవాలయముల వలెనే  పవిత్ర క్షేత్రము ఈ శారదా పీఠము.

Saraswati Devi-Sharada Peetham, Sringeri

శారదాపీఠం అనునది పాక్ ఆక్రమితకాశ్మీర్ నందు నీలంనదితోకలసి శారదా గ్రామమునందు గుర్తించబడిన ఒక శిధిలమైన హిందూదేవాలయము. ఆజాద్ కాశ్మీర్ ముఖ్యపట్టణమైన ముజఫర్ బాద్ నాకు 150 కి.మీ దూరములో సముద్ర మట్టమునకు సుమారు 6500 అడుగుల ఎత్తున ఉన్నది. ఈక్షేత్రము జమ్ము కాశ్మీర్ ముఖ్యపట్టణమైన శ్రీనగర్ నకు 130 కి.మీ.దూరములోనున్నది. మరియు పూర్వము కాశ్మీర్ నందు పాకిస్తాన్ మరియు భారతదేశమును వేరుచేయు వాస్తవాధీన రేఖకు 10 కి.మీ. దూరములో హర్ ముక్త్ పర్వతలోయనందు కాశ్మీర్ పండితులు శివుని నివాసముగా తలచెడి శారదా గ్రామమునందు ఉన్నది. శారద గ్రామము భూకంపములవలన శిధిలమైనట్లు పాడుపడిన ఆవిశ్వ విధ్యాలయపు శిధిలములను స్థానికులు కొందరు పట్టణనిర్మాణములందు ఉపయోగించుకొనినట్లు తెలియుచున్నది. ప్రస్తుతము నీలంనది లేదా కృష్ణగంగా పిలువబడుచున్న మధుమతి మరియు శారదాపీఠము నిర్మించినట్లు చెప్పబడు శాండిల్యమహర్షి పేదుమీదగల శంధిలి పవిత్ర నీటిప్రవాహములు కలియు సంగమప్రదేశములో ఉన్నది ఈశారదాపీఠము.             

గ్రంధములందు ఇచట స్నానము చేసినవారికి కృష్ణుని మరోపేరైన చక్రి మరియు దుర్గాదేవి దర్శనము అగునని చెప్పబడినది. శారదా ఆలయము ఆఖరి పురోహితుడు శారదాలిపిలో వ్రాసిన శారదా సహస్రనామములందు తెలిపిన ప్రకారము శాండిల్య ఋషి శారదా గ్రామ ప్రాంతములో స్థానికులు మరియు వందల కొలది రుత్విక్కులతో ఒక పెద్ద  యజ్ఞము చేయుచుండగా ఒక అందమైన యువతి ప్రత్యక్షమై తాను బ్రాహ్మిణిఅని, తాను యజ్ణమునందు పాల్గొన వలెనని కోరుచున్నట్లు తెలిపినది. తాను తనకు తోడుగా వచ్చినవ్యక్తి  చాలాదూరమునుండి వచ్చినామని భోజనము పెట్టమని కోరినది. శాండిల్యుడు యాగ నిబంధనలు పాటించవలసి ఉన్నదని, యాగము పూర్తి అయిన పిమ్మట ముందుగా పురోహితులు భుజించినపిమ్మట ఆమెకు పెట్టెడమని తెలిపినాడు. బ్రాహ్మిణి కోపగించి తాను హిందూ దేవతనని తెలుపుచూ ఆయనచేయు యజ్ణపరమార్ధము తెలిపినది. ఆకోపములో  పవిత్రమైన నీలపురంగులో ఆభరణములు, ఆయుధములు మరియు మేఘముల రూపములో సరస్వతిగా ప్రత్యక్షమై తానుప్రపంచములో ఐక్యము అయిపోదునని తెలిపినది. శాండిల్యుడు యీఆకస్మికచర్యకు ప్రశ్చాత్తాపపడి అచేతనుదై మరణించినాడు. శాండిల్యుని ప్రశ్చాత్తాపమునకు బ్రాహ్మిణిదేవి ప్రసన్నురాలై ఆతనిని తిరిగి బ్రతికించి కుమారుడుగా సంభోధించి ఆతని భక్తికి కరుణకు సంతోషించినానని ఏమికావాలో కోరుకొమ్ముఅనెను. శాండిల్యుడు అమ్మవారిని గ్రామంలో మరణించిన వారిని బ్రతికించి గ్రామమును మరియు అడవిని  పునరుద్ధరించ కోరినాడు. శాండిల్యుడు కోరినది అనుగ్రహించి ప్రస్తుత నీలంనది అనగా పూర్వపు మధుమతినది వద్ద కొండదిగువభాగమున ఆశ్రమము నిర్మించమని ఆజ్ణాపించినది. శారదాపీఠమువద్ద ఆమెనివాసమ ఏర్పరచుకొన్నది.                                                                                        

శాండిల్యుడు మిక్కిలిభక్తితో  శారదాదేవిని కొలువగా ఆతనికి దర్శనము ఇచ్చి తన అసలురూపము చూపించెదనని వరం ఇచ్చినది. అమె శారదా అడవి చూడమని సలహాఇచ్చినది. ఆతనిప్రయాణము నందు ఎదురైన మానవాతీత అనుభవములు ఎదురైదారిలో ఒకకొండకు కుడిభాగమున గణేశుని చూసినాడు. నీలంనదిని చూసిఅందు స్నానముచేసి చూసినప్పుడు ఆతని శరీరము సగభాగము బంగారముగా మారినది. ఆదేవత తనరూపము లైన శారద, సరస్వతి మరియు వాగ్దేవి రూపములలో కనిపించి శాండిల్యుని తననివాసమునకు ఆహ్వానించినది. ఆతను ఖర్మచేయుటకు సిద్ధపడి సింధునుండి నీరుతెచ్చినప్పుడు ఆనీరునందు సగభాగము తేనెగామారిపోయి ఒక ప్రవాహమైనది. అదేమధుమతి నీటిప్రవాహము. 

శారదా పీఠమును గురించి తెలియజేయు రెండు కధనములు కలవు. ఒక కధనము ప్రకారము ప్రపంచము పాలించేడి శారద మరియు నారద అను ఇరువురు అక్కచెల్లెళ్లు ఉండేడివరని, ఆరెండుపర్వతములు లోయను పరిరక్షించేవారని, ఒకరోజు నారద పర్వతములో తననివాసమునుండి చూడగా శారద చనిపోయినట్లు ఆమె శరీరమునుండి ఆత్మలు వెలిపోవుచున్నట్లు గమనించినది. కోపముతో ఆమె ఆఆత్మలన్నిటిని ఒకసమాధి నిర్మించమని ఆదేశించినది. అదే కాలగమనములో శారదా పీఠము అయినది.                                                    

రెండవ కధనము ప్రకారము ఒక రాణిని ఒక శక్తిమంతుడు ప్రేమించినాడు. ఆమె ఒకభవంతి కోరినది. ఆతను కట్టుట మొదలు పెట్టినాడు. ఉదయము అయేసరికల్లా పూర్తి అగునని భావించినాడు కాని పైకప్పు పూర్తికాలేదు. ఇప్పటికినీ శారదాపీఠమునకు ఈరోజువరకు పైకప్పు లేకుండానే ఉన్నది. శారదా శక్తిపీఠము కాశ్మీరు లోయనందు వచ్చియున్న భూకంపమువలన శిధిలమైనది. శంకరాచార్యులవారు అమ్మవారిని శృంగేరి తీసుకొని వచ్చి ప్రతిస్టించుటకు శారదాపీఠము దర్శించినాడు. శారదాదేవి తాను పాపము చేయలేదని తెలుపమని సవాలుచేసినది. శంకరాచార్యులవారు బదులుగా తాను పాపములుచేయలేదని ఇతరులు చేసిన పాపములు తనకు కళంకముకాదని చెప్పినాడు. శారదాదేవి వారు ఇచ్చిన సంజాయిషీకి ఒప్పుకొని విధ్యాపీఠము ఆచార్యపదవిని దక్షణాది నుండివచ్చిన శంకరాచార్యులు ఉత్తరాది కాశ్మీరీ పండిట్లను ప్రక్కన పెట్టి అఃదిరోహించుటకు అంగీకరించినది.         

శంకరాచార్యులువారు పైకప్పు లేకుండాఉన్న ఆఆలయము నుండి శారదాదేవిని శృంగేరి తరలించినట్లు తెలియుచున్నది. 1947 సం.లో కాశ్మీరు సన్యాసి స్వామీనందలాల్ జీ అనువారు కొన్నిరాతివిగ్రహములను కాశ్మీర్ లోని  కుప్వారయందలి టిక్కర్  నకు తరలించినాడు. పిమ్మట అందులో కొన్నింటిని బారాముల్లాలోని దేవిబల్ నకు తరలించినారు. 2007 సంలో కొందరు కాశ్మీరుపండిట్స్ అమ్మవారి ఆలయము సందర్శించినారు. ప్రస్తుతము అక్కడ శిధిలములు తప్ప ఏమీలేవు.