పూరీ

(IPLTOURS)

పవిత్ర హిందూదేశమున మహిమాన్విత ఆలయాలు అనేకం ఉన్నాయి. ఋషిప్రతిష్ట, మానవప్రతిష్ట ఆలయములకన్నాస్వయంభూః ఆలయములు ప్రధమము. మహావిష్ణువు ఎనిమిది దివ్యస్వయంభూఃక్షేత్రములు తమిళనాడునందు శ్రీరంగనాధ స్వామిఆలయం, ఆంధ్రప్రదేశ్ నందు తిరుమల శీవెంకటేశ్వరఆలయం, కడలూర్ వద్ద శ్రీభూః వరాహస్వామిఆలయం, తిరునల్వేలివద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ ఆలయం, నేపాల్ గందకినది తీరమున ముక్తినాధ్ ఆలయం, రాజస్థాన్ పుష్కర్ నందు వరాహ ఆలయం, ఉత్తరప్రదేశ్ నందు నైమిశారణ్యం  మరియు ఉత్తరాఖండ్ నందు బదరీనాధ్. చార్ ధామ్ యాత్రలోభాగంగా ద్వారకనుండి వారణాశి, హదీద్వార్ మరియు ఋషికేశ్ మీదుగా బధ్రీనాధ్ చేరి బదరీనారాయణుని దర్శించి మరలా హరిద్వార్ హౌరాలమీదుగా పూరీచేరవచ్చును.

దేవభూమి పూరీ ఆవిభక్త హిందూదేశమునందు తూర్పున బంగాళాకాతము సముద్రతీరములో ఒరిస్సారాస్త్రము పూరీజిల్లానందు విలసిల్లుతున్నది. చార్ ధామ్ ఆనగా శ్రీహరియొక్క నాలుగు నివాసములందు పూరీ నాలుగవ పుణ్యక్షేత్రము. జగద్గురు ఆది శంకరాచార్య స్తాపించిన సుమారు 90 మఠములలో ఒకటిఅయిన గోవర్ధనమఠ్ పూరీనందు ఉన్నది. 

పూరీ జగన్నాధ్ ఆలయం

పూరీనందు భగవాన్ విష్ణుమూర్తికి మరోరూపమైన శ్రీజగన్నాధ్ ఆలయం హిందువులకు అతిపవిత్రమయినఆలయం. ప్రస్తుతఆలయం సుమారు వేయిసంవత్సరములకు పూర్వపుఆలయ స్థలములో నిర్మించబడినది. పూరీఆలయము ప్రతిసంవత్సతంజరుపు రధయాత్రకు ప్రసిద్ధమైనది. ఉత్సవములో ప్రధానదేవతలు జగన్నాధ్, బలబధ్ర మరియు సుబధ్రమూర్తులను పెద్దవిశాలమై అలంకరించబడిన రధములపై ఊరేగింతురు. గర్భాలయమున దేవదారు ఆసనముపై వేపదుంగలపై చెక్కబడిన జగన్నాధ, బలభద్ర మరియు సుబధ్రవిగ్రహములు సుదర్శనచక్ర, మదన్మోహన్, శ్రీదేవి మరియు విశ్వధాత్రి విగ్రహములతోపాటు దర్శనమిచ్చును. విగ్రహములన్నియు కాలానుగుణముగా వివిధరకముల ఆభరణములతోనూ వస్త్రములతోనూ అలంకరించేదరు. మహాభారత మరియు పురాణములందు పేర్కొనబడిన మాళవరాజు భరత మారియు సునంద కుమారుడైన ఇంద్రధుమ్నచే మొదటిసారిగా ఆలయనిర్మాణము జరిగినది.

స్కందపురాణము, బ్రహ్మపురాణము మరియు ఇతరపురాణములందు జగన్నాధస్వామి ప్రాధమికముగా నీలామాధవస్వామిగా విశ్వావసుఅను సవర గిరిజనరాజుచే పూజింపబడినట్లు,ఈవిషయము ఇంద్రద్యుమ్నమహారాజు తెలుసుకొని విధ్యాపతి ఒక బ్రాహ్మణపూజారిని పంపినట్లు, విధ్యాపతి దట్టమైన అరణ్యమునందు విశ్వావసు గోప్యముగా పూజచేయుప్రదేశము తెలుసు కొనుటకు ప్రయత్నముచేసి కనుగొనలేక, విశ్వావసుకుమార్తె లలితను వివాహమాడుటద్వారా విశ్వావసుతో అరణ్యమునందు ఒకగుహలో పూజింపబడుచున్న నీలామాధవస్వామిని దర్శించినట్లు పేర్కొనబడియున్నది. విధ్యాపతి చాలా తెలివైనవాడు కావున తానువచ్చు మార్గములో ఆవాలు భూమిపైచల్లినాడు. అవి కొద్దిరోజులకు మొలకఎత్తినవి ఇంద్రధ్యుమ్నరాజు దేముని దర్శించుటకు ఒరిస్సా యాత్రకు వచ్చినాడు. కానీదైవము ఇసుకనందుదాచబడి మాయమైనాడు. రాజు దైవదర్శనముచేయనిదే వెనుతిరుగుటకు ఇష్టములేక అచ్చటనే నీలపర్వతముపై ఉపవాసము చేయనారంభించినాడు. అప్పుడు ఆకాశవాణి నీవు     అతన్నిచూస్తావుఅని వినిపించినది. అప్పుడు రాజు అశ్వమేధయాగముచేసి విష్ణువునకు ఒకఆలయము నిర్మించినాడు. నారదునిచేతేబడిన నరసింహమూర్తి ప్రతిష్టించబడినాడు. నిద్రలోరాజు జగన్నాధస్వామిని దర్శించినాడు. మరియు  అశరీర గొంతుకతో సముద్ర తీరమునందు సువాసనకలచెట్టుతో విగ్రహములు చేయనాదేశించినాడు. రాజు జగన్నాధ్, బలభద్ర,సుబధ్ర మరియు సుదర్శనచక్రము విగ్రహములు వేపచెట్టునుండి తయారుచేయించి గుడినందు ప్రతిష్టించినాడు. దేశములోనే అత్యంతపెద్దది మరియు బరువైన శాలిగ్రామము శాలిగ్రామరూపమిన జగన్నాధుని ఆలయములో ఉన్నది.

ఇంద్రద్యుమ్నరాజు ప్రపంచములో అతిఎత్తైన జగన్నాధుని వేయిమూరలు ఎత్తుకల స్మారకచిహ్నం ఏర్పాటుచేయ సంకల్పించి ఆలయమును విగ్రహమును పవిత్రముచేయుటకు బ్రహ్మదేముని ఆహ్వానించినాడు. ఆలయమును చూచుటతోనే బ్రహ్మ సంతోషించినాడు. తాను ఏవిధముగా ఇంద్రద్యుమ్ననికోరిక తీర్చగలనో తెలుపమనెను. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు తన వంశములో తానే చివరివాడినిఅయేట్లు తనతరువాత ఎవరైననూ బ్రతికిఉన్నట్లయిన ఆలయమునకు యజమానితప్ప సమాజమునకు పనేచేయరాదుఅని వరంకోరినాడు. 

జగన్నాధ్, బలభద్ర మరియు సుబధ్ర దేవతావిగ్రహములు వేపచెక్కతో తయారుకాబడి ప్రతి 12 సంవత్సరములకు క్రొత్తవి తయారుకాబడి ప్రతిష్టించబడి పూర్వపువిగ్రహములు పూడ్చబడును. సమయము పూర్తిఅగుసరికి మూర్తులవిగ్రహములు వాటియంతట అవేవిచ్ఛన్నమగును అనినమ్మకం. జగన్నాధస్వామి ఆలయమునకు సంబంధించిన నిఘూడమైన విశేషములు.

కధనముప్రకారం శ్రీకృష్ణుడు ప్రస్తుత గుజరాత్ రాష్ట్రములో సోమానాధ్ నకు 5 కిలోమీటర్ల దూరమునండుగల ప్రదేశమునందు (ప్రస్తుత వారెవాల్ పట్టణము) శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహనసంస్కారాలు జరిగినప్పుడు శరీరం విశ్వంలో అయిదు మూలకాలలో విలీనంఅయిననూ గుండెమాత్రం అప్పటినుడి ఈరోజువరకు పూరీజగన్నాధుని ప్రతిమనందు సురక్షితంగా ఉంది. శ్రీకృష్ణ స్వరూపమైన పూరీజగన్నాధుడు కలియుగదైవమని అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాధుని విగ్రహం మార్చబడుతుంది, విగ్రహంమార్చు సమయంలో పూరినగరం మొత్తం లైట్లు ఆపివేయబడి చీకటిగా ఉంటుంది, లైట్లు ఆపివేసిన తరువాత, భద్రతాసైన్యం అన్ని వైపులనుండి భద్రతనిమిత్తము ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముట్టి ఎవరినీ ఆలయంప్రవేశమునకు అనుమతించరు. ఆలయంలోపల దట్టమైన చీకటిలో పూజారి కళ్ళకు గంతలుకట్టుకొని చేతికితొడుగులు వేసుకొని పాత విగ్రహంనుండి “బ్రహ్మ పదార్ధం” తీసి కొత్త విగ్రహంలోకి చేరుస్తారు. పూజారికికూడా తెలియని చూడని ఈబ్రహ్మపదార్థం పన్నెండు సంవత్సరముకకొక పర్యాయము వేల సంవత్సరాలుగా ఒకవిగ్రహంనుండి మరొకవిగ్రహానికి చేర్చ బడుతోంది ఇది భగవాన్ శ్రీకృష్ణుడికి సంబంధించిన అతీంద్రియపదార్ధం.

Brahma Padardth

జగన్నాథ్ రధయాత్రనాడు రాజు స్వయంగా విగ్రహాన్ని బంగారు చీపురుతో శుభ్రపరుస్తారు.

  1. గుడ్డను చేతితో గాలిలోపట్టుకునిలిపిన అదిగాలివాటువైపునకు ఎగురుతుంది అనునని అందరకు తెలిసినవిషయము. కానీ పూరీక్షేత్రములో జగన్నాధఆలయ గోపురముపైకలజెండా గాలివాటునకు వ్యతిరేకదిశలో ఎగురుతుంది. ఇట్లు వ్యతిరేకదిశలో ఎగురుటపై సైన్సపరంగా ఎటువంటి ఆధారములేకపోవుట విశేషము. ఆలయపూజారి ప్రతిరోజూ ఉదయమే 45 అంతస్తుల ఎత్తైనగోపురముపైకి ఎటువంటి ఆధారములేకుండా ఎగబాకి గోపురముపైనున్న జెండా మార్చేదరు. అనేకవందల సంవత్సరాలుగా జరుగుతున్న ఈనియమమునకు ఉల్లంఘనజరిగిన ఆలయము 18 సం.లు మూసివేయవలసివచ్చును.
  2. ఏదైనావస్తువు సూర్యరశ్మికి ఎదురుగా ఉంచిన ఆవస్తువునీడ వస్తువుకువెనుకగా పడుతుంది అనునది అందరకు తెలిసినవిషయము. పూరీజగన్నాధుని ఆలయమునీడ ఏరోజున పగటిపూట సూర్యరశ్మి ఆలయముపైపడినను ఆలయమునీడ పడకపోవుట ఈఆలయమునకే ప్రత్యేకము. ఇదేజగన్నాధ ఆలయవిశిష్టత. 
  3. టన్నుబరువుఉన్న సుదర్శనచక్రము గోపురముపైకి మనుషులుఎలా ఎక్కించినారో అగమ్యగోచరము. ఆలాగుననే ఈసుదర్శనచక్రము ఎటుచూచినా ఒకేలాకనిపించునట్లు అమర్చబడినది.
  4. ఆకాశము పక్షులకు నిలయము. పక్షులు పైనఎగురుట, కూర్చొనుట మరియు సేదతీరుట చేయును. జగన్నాధునికీ తనలయప్రాంగణమునందు ఏవిధమైన అలజడిలేకుండా నిశ్శబ్దముగా ఉండుట ప్రియము. అందువలన జగన్నాధుని నిశ్శబ్దము చెదరకుండా ఆలయమునందు మరియు ఆలయపరిసరప్రాంతములలో ఎక్కడానూ ఏవిధమైన పక్షులు ఎగురవు. విమానములుకూడా ఆలయప్రాంగణమునకు దూరముగానే ప్రయాణించును. 
  5. ఆలయ అధికారులు పూరీజగన్నాధఆలయమును ప్రతిరోజూ సందర్శించు యాత్రికులసంఖ్యతో నిమిత్తములేకుడా దర్శనార్ధము వచ్చిన భక్తులకు ప్రసాదము వ్యర్ధముకాకుండా సరిపడామాత్రమే తయారుచేయుదురు. ఇది స్వామి అనుగ్రహముతప్ప మరొకటికాదు.
  6. పూరీజగన్నాధుని ఆలయము సముద్రతీరమునకు 2 కి.మీ దూరములో నున్నది. ఆలయము ప్రవేశద్వారముదాటి లోనికి ప్రవేశించినవెంటనే చెవులలో సముద్రపుహోరు ఆగిపోవును. ఈసంఘటన సాయంత్రము బాగుగా గ్రాహ్య మగును. మరలా ఆలయము వెలుపలికిరాగానే హోరుప్రారంభమగును. స్థానికకధనము ప్రకారము బలరామకృష్ణుల సోదరిఅయిన సుభద్ర తనకు ఆలయప్రాంగణములో నిశ్శబ్దము కొరినట్లు అమెకోరిక ప్రకారమే ఆలయమునందు సముద్రపుహోరులేక నిశ్శబ్ధముగా నుండునని తెలియుచున్నది. 
  7. సాధారణముగా ఉదయమునుండి సాయంత్రంవరకు గాలి సముద్రము మీదనుండి భూమిమీదకు మరియు రాత్రి భూమిమీదనుండి సముద్రముమీదకు వీయును. పూరీనందు ఇందుకువ్యతిరేకముగా ఉదయమునుండి సాయంత్రము వరకు భూమిమీదనుంది సముద్రముమీదకు రాత్రి సముద్రముపై నుండి భూమిమీదకు గాలివీచును.  
  8. ప్రసాదమువండుటకు ఇక్కడ ప్రత్యేకముగా ఏడుపాత్రలవంటి కుండలను ఒకదానిపై ఒకటిఉంచి కట్టెలుఉపయోగించి తయారుచేసేదరు. సాధారణముగా ముందుగా క్రిందఉన్నపాత్రలోని పదార్ధముముందుగా తయారుఆవుతుంది. పూరీనందు ముందుగా పైనఉన్నకుండ ఉడికి తదుపరిఒకదాని పిమ్మటఒకటి క్రిందిపాత్రలుఉడికి తయారుఆవుతుంది.
  9. దేవతావిగ్రహములు వేపచెక్కతో తయారుకాబడి ప్రతి 14 నుండి 18 సంవత్సరములకు క్రొత్తవి తయారుకాబడి మార్చబడిన విగ్రహములు పూడ్చబడును. సమయము పూర్తిఅగుసరికి మూర్తులవిగ్రహములు వాటియంతట అవేవిచ్ఛన్నమగును అనినమ్మకం. 
  10. హిందువులు కానివారికీ ఆలయ ప్రవేశము లేదు. రఘుబంధన్ పఠనాలయము పైనుండి మాత్రమే దర్శించ వలయును. ఈ విధానము విదేశీయుల అనేక దండయాత్రల వల్ల పెట్టబడినదని అంటారు.

చిలుక సరస్సు పూరినుండి సుమారు 50 కి.మీ. దూరములో నున్న దేశములోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. అనేక రకములైన పక్షుల కిలకిలా రావములతో ఈప్రదేశము మిక్కిలి ఆహ్లాదకరముగా ఉండును. నౌకావిహారమునకు అనువుగా ఉండి మనసుకు ఉల్లాసము కలిగించి వయసుతో సంబంధములేకుండా అందరినీ సంతోషపరచును.

ఆలయము అన్నీ రోజులలోనూ ఉ 5-30  నుండి రాత్రి 10-00 వరకు తెరచి యుండును. ఉ 10-00 లోగా దర్శనము చేసుకొనుట సులభ తరము. నీలాద్రి భక్తనివాస్, శ్రీగుండిచ భక్తనివాస్ మరియు నీలాచల భక్త మరియు యాత్రి నివాస్ నందు ఏ.సి., నాన్ ఏ.సి. రూములు ఆన్ లైను బుకుంగు కలదు. 

జగన్నాధుని దర్శనం ముక్తిదాయకం చిలుక సరస్సు వాహ్యాళి ఆనందదాయకం