నవనంది క్షేత్రములు
(IPLTOURS)
శివుని ప్రధమభక్తుడు నంది. శివుడు మరియు నంది ప్రాముఖ్యత వారిమధ్యకల అనుభంధము అన్నిపురాణములందు సవివరముగా తెలుపబడినది. చరిత్ర గురించి చెప్పుకోనెదమన్న నేటికిసుమారు 5300 సం.లనుండి 3300 సం.వరకు మధ్యకల సింధులోయనాగరికతకు సంభంధించి దక్షణఆసియానందు ఉత్తర పశ్చిమభాగముననున్నదని భావించ బడుచున్న పురావస్తు శాఖవారి త్రవ్వకములలో మహేంజదారో హరప్పావద్ద పశుపతితోపాటు అనేక ఎద్దుబొమ్మలుకల నాణెములు అభించినవి. పశుపతి నామముతో పిలిచే శివునితోపాటుగా నందినికూడా అనేక వేలసంవత్సరములనుండి పూజించుచున్నట్లు నిర్ధారించబడినది.
నంది శిలాదమహర్షి కుమారుడు. శిలాదుడు అమరత్వము మరియు శివుని ఆశీస్సులతో కుమారుడు కావలెనని ఘోరతపస్సు చేసి నందిని కుమారునిగా పొందినాడు. నంది శిలాదుడు చేసిన యజ్ణఫలముగా వజ్రకవచముకల శరీరముతో జన్మించినాడు. నంది శివునికి మహాభక్తునిగా పెరిగి శివుని నివాసమైన కైలాసమునకు ద్వారపాలకుడిగా అనుగ్రహించుటకు నర్మదానదిఒడ్డున ప్రస్తుతమధ్యప్రదేశ్ రాష్ట్రములో నందికేశ్వర్ ఆలయముకల పూర్వపు త్రిపుర తీర్ధక్షేత్రమునందు ఘోర తపస్సు చేసినాడు. నంది శివపార్వతులనుండి దైవికజ్ణానముపొంది ఆజ్ణానమును ప్రపంచము ఎనిమిదిదిక్కులందు వ్యాప్తిచేయుటకు ఎనిమిది మండి శిష్యులను పంపినాడు. నంది రావణునితో సంఘర్షణపడి రావణుని రాజ్యము ఆటవీనివాసి వలన దగ్ధమగునని శపించినాడుఅని, అందువలననే అడవినుండి వచ్చిన హనుమంతునిచేలంకాదహనము జరిగినది అని పురాణకధనము.
మరియొక కధనము ప్రకారము శివుడు పార్వతికి వేదము భోధించునప్పుడు పార్వతికి ఏకాగ్రత లోపించినదిఅని, అందు వలన పార్వతి మరియొక అవతారము మత్యకన్యగా జనించినదిఅని, పార్వతి మరియు పరమేశ్వరుని కలుపుటకొరకు నంది తిమింగలరూపములో ప్రజలను ఇబ్బంది పెట్టుటప్రారంభించగా శివుడు మత్యకారుని అవతారములోవచ్చి తిమింగలమును ఓడించినాడు అని, మత్యకన్యఅయిన మత్యకన్యను వివాహము చేసుకొని శివపార్వతులు ఒకటి అయినారు. మహానంది ఆవిర్భావముపై ఒకకధనము ప్రాచుర్యములోనున్నది. పూర్వము ఒకపశువులకాపరి రోజూ నల్లమలఆటవీ ప్రాంతములో ఆవులు మేపుకొనేవాడని, ఒకఆవు పాలుఇచ్చేడిదికాదని, ఒకరోజు ఆఆవును వెంబడించగా అది ఒకపుట్టపై నిలుచోని పాలుపుట్టలోవదులుచూ కనపడగా యజమానినిచూచి ఆవు పుట్టపైకాలువేసి పారిపోయినదని, ఆ గిట్టగుర్తు పుట్టలో ఉన్నలింగంపై పడిందని. అందువలననే నవనందులలో 7 నందులపై గిట్టఆనమాలు ఉంటుందని కధనము.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలో నల్లమల అటవీప్రాంతములో నంద్యాలనుండి మహానందిపోవు మార్గములో రోడ్డుకు ఇరువైపులా నవఆనగా తొమ్మిదినందులు కలవు. నవనందులలో నంద్యాల పట్టణమునందు మూడు, మహానంది నందు మూడు, మార్గమధ్యములో మూడునందులు ఉన్నాయి. శివనంది మరియు సూర్యనంది లింగరూపములోనూ మిగిలిన నందులు మూపురం ఆకారంలో ఉంటాయి. కార్తీకమాసంలో సోమవారం రోజున నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహదోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దలనానుడి సూర్యోదయంనుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధానవిశ్వాసం మరియు కాశీవిశ్వేశ్వరరుని దర్శించుకొన్న ఫలితంవస్తుందని తెలుపబడింది. నవనందుల యాత్రకు బయలుదేరుటకు నంధ్యాలనందుకల కాళికాంబ చంద్రశేఖరస్వామి ఆలయములోనున్న విఘ్నేశ్వరుని పూజించి యాత్ర ప్రారంభించిన యాత్ర సంపూర్ణము అగునని ప్రజల నమ్మకం.
నవనంది క్షేత్రములలో నాగనంది మరియు గరుఢనంది గరుత్మంతుడు నాగులపై దాడి చేసినప్పుడు గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనందిలోనూ మరియు గరుత్మంతుతల్లి వినతాదేవి గరుత్మంతుడు తల్లిని కద్రు దాస్యమునుండి విడుదలచేయించుటకు స్వర్గలోకమునకు అమృతమ తెచ్చుటకు వెల్లునప్పుడు గరుత్మంతుని రక్షణార్ధము గరుఢనందినందు శివుని గురించి తపస్సు చేసినారు. సదరు ఇతిహాసము గురించి సంక్షిప్తముగా వివరించుచున్నాము. బ్రహ్మమానస పుత్రుడైన కశ్యపమహర్షి దక్షప్రజాపతి కుమార్తెలైన కద్రు మరియు వినత అనువారిని వివాహమాడినాడు. ఈఇరువురు అమితమైన అందముకల వారు మరియు ఒకరిపై ఒకరికి అసూయకలవారు. కశ్యపుడు ఆయిరువురిపై అమితవాత్చల్యముతో ఇరువురిని వరము కోరుకొమ్మనినాడు. కద్రు తనకు వేయిమంది అమితబలవంతులైన సంతానము కావలెననికోరగా అట్లేవేయిమంది బలవంతులైన సర్పజాతి జన్మించినారు. వినతతనకు తనసోదరి కుమారులకంటే పరాక్రమవంతులు మరియు కీర్తిగడించెడి ఇరువురు కుమారులను కోరినది. తరువాతి సమయములో వినతకు రెండుగుడ్లు కలుగగావాటిని సేవకులకు జాగ్రత్త చేయుటకు అప్పగించినది. వారు ఆరెండుగుడ్లను వెచ్చని పాత్రలలోఉంచి రాత్రిపగలు రక్షించినారు. అయిదువందలసంవత్సరములు గడచిననూ గుడ్లుపొడగబడలేదు. కద్రుఆసరికే వెయినాగులను కుమారులుగా పొందియుండుటవలన వినత అసహనముతో ఆమె ఒకగుడ్డును పగులగొట్టినది. అందలిపిండము పైభాగము వృద్ధిచెందినది కానీ క్రిందభాగము తయారుకాలేదు. అందుకల పిల్ల అమితకోపముతో తల్లిని ఆమె అసహనమువలన చేసిన చర్యవలన తననుచంపినట్లు అయినదని అందువలన ఆమె బానిసత్వమునకు గురికాబడునని, తనసోదరుడు కలరెండవగుడ్డును కడపవద్దని, ఆమె మరియొక 500 సం నిరీక్షించిన జనించువాడు ఆమెను బానిసత్వమునుండి విముక్తురాలిని కావించేదడుఅని శాపము ఇచ్చినాడు.
కద్రు మరియు వినత ఒకవాదులాటలో కద్రు ఇంద్రుని అశ్వము రంగురెలుపవలెను అనిఅడుగగా వినత అశ్వము ముక్కునుండి తోకవరకు తెలుపుఅని జవాబుఈయగా కద్రు ఆమెతప్పుసమాధానము ఇచ్చినది అని శరీరమంతా తెలుపు అయిననూ తోక మెరయుచున్ననలుపుఅని ఆవిషయమై ఎవరుఓడిన రెండవవారు గెలిచినవారికి బానిసగా ఉండవలెను అని పందేము వేసుకొనారు. వినుతకు తానుగెలిచేదనని నమ్మకముతోనుండగా కద్రు ఆమాట వాస్తవమైననూ ఒకపధకము ప్రకారం తనకుమారులను గుర్రముతోకకు చుట్టుకొని తనపందెము నెగ్గించమని కోరినది. నాగులకు అట్లు చేయుటకు ఇష్టములేక వెనుకంజవేయగా కద్రు కోపగించి తనమాటవినని వారుఅందరూ అగ్నికి ఆహుతి ఆగుదురని శాపము ఇచ్చినది. ఈకారణముగానే తరువాత పాండవవంశములోని జనమేజయుడు సర్పయాగము చేసినప్పుడు నాగులు అందరూ అగ్నికి ఆహుతి అయినారు. బ్రహ్మముందుగా ఆశాపమునకు ఆమోదము తెలిపిననూ కశ్యపుని కోరికపై నాగులలో ధర్మ వంతుడు మరియు సత్యముపలికేడి నాగులకు వర్తించకుండా పరిహారము ఇచ్చినాడు. తదుపరినాగులు ఆలోచించుకొని కద్రు మరియు వినుత వచ్చుసమయమునకు అశ్వముతోకకు చుట్టుకొనినారు. అపుడు తోక నల్లగా కనపడినది. అందువలన ఒప్పందము ప్రకారము వినత కద్రు మరియు ఆమెసంతానమునకు బానిస అయినది. తరువాతి సమయములో రెండవగుడ్డు నుండి గరుత్మంతుడు అమితతేజస్సుతో అమితవేడిమితో జన్మించినాడు. ఆతేజస్సునకు వేడిమికి దేవతలకనులుకూడా చూచుటకు అవకాశము ఈయలేదు. అప్పుడు దేవతలు అందరూ గరుత్మంతుడిని అనేకవిధముల స్తుతించగా గరుత్మంతుడు తనతేజస్సును వేడిని ఉప్సంహరించుకొనినాడు. గరుత్మంతుడు తనతల్లి వినతితోపాటు కద్రు మరియు ఆమెకుమారులైన నాగులను సేవించసాగినాడు. వినత గరుత్మంతునికి తానుకద్రువేసిన పందెముగురించి అంతయూ తెలిపినది. అప్పుడు గరుత్మంతుడు తాను ఏమిచేసిన తాను తనతల్లి దాశ్యవిముక్తులయ్యేదమో తెలుపమనినాగులను అడుగగా వారు తమకు స్వర్గమునందలి అమృతము తీసుకువచ్చి ఇచ్చిన విముక్తులము చేసేదమని తెలిపినారు. గరుత్మంతుడు అమృతము తెచ్చుటకు స్వర్గలోకము వెల్లునప్పుడు ఆతని క్షేమముకోరి వినతి గరుఢనందివద్ద శివుని గురించి తపస్సు చేసినది.
అటుపిమ్మట గరుత్మంతుడు దేవలోకమునకు వెళ్ళి దేవతలతో పొరాడి అమృతకలశము కలప్రదేశమునకు చేరినాడు. ఆకలశముచుట్టూ అగ్నికీలలు ఆకాశమంటఎత్తుగా కనపడగా గరుత్మంతుడు తననోటిని పెద్దది చేసి సముద్రమునీటిని పీల్చి అగ్నికీలలపై వదలినాడు. పిమ్మట చిన్నరూపములో మారిపోయి అమృతము ఉన్న పాత్రవద్దకు చేరినాడు. ఆపాత్రకు రెండుపెద్ద నాగులు కాపలా ఉన్నట్లు కనుగొని వాటిపైదుమ్ము అమిత వేగముతో ఊదీ వాటికి కండ్లు కనపడకుండా చేసి పిమ్మటవాటిని చిన్నాభిన్నము చేసి అమృతకలశముతో వెడలినాడు. అప్పుడు ఇంద్రుడు అమృతము దొంగతనము ఆగుట చూసి, వజ్రాయుధము ప్రయోగించగా తప్పించుకొని వెడలినాడు. దారిలో గరుత్మంతుడు విష్ణువును కలువగా విష్ణువు ఆతనికి వరము కోరుకొమ్మని అడుగగాతాను విష్ణువుకన్నా ఎత్తులులో ఉండునట్లు వరము కోరినాడు. విష్ణువు అనుగ్రహించి తన జెండాగా నుండుటకు వరము ఇచ్చి తనకటే ఎత్తులో ఉండునట్లు అనుగ్రహించినాడు. విష్ణువు గరుత్మంతునితో ఆతని సోదరులు దుర్మార్గులని అమృతము తెచ్చేదనుఅనితప్ప ఇచ్చేదనుఅని తెలుపనందున వారుతాగకుండా తాత్సారము చేయవలెనని చేప్పినాడు. ఆప్రకారమే గరుడుడు నాగుయలవద్దకు వచ్చి వారిని వారు కోరినట్లు అమృతము తెచ్చినందున తనను తన తల్లిని బానిసత్వమునుండి విడుదల చేయ కోరినాడు. వారు అట్లే అని చెప్పి అమృతము కల పాత్రవద్దకు వచ్చుచుండగా వారిని అమృతము తీసుకొనుటకు ముందుగా శుభ్రము చేసుకొమ్మని తెలిపినాడు. నాగులు నదివద్దకు వెళ్ళగా ఇంద్రుడు అమృతము ఉన్న పాత్ర పట్టుకొని దేవలోకము వెళ్ళిపోయినాడు. పాత్ర ఉంచిన కుశగడ్డి (ధర్భలు) దేవతలకు ప్రీతిపాత్రమైనవి. గరుడుడు ఇంద్రునితో స్నేహము వలన గరుడుడు పక్షులు ఇతర ఎగురు జీవులకు రాజుగాను ఇంద్రుడు మిగిలిన వారికి రాజుగాను ప్రకటింపబడినారు. విష్ణువు అందుకు సంతోషించి తన వాహనముగా గరుత్మంతుని అనుగ్రహించి నాగులు ఆతనికి ఆహారము అగునట్లుగా వారము అనుగ్రహించినాడు. అప్పటినుండి గరుత్మంతుడు నాగులను ఆహారము చేసుకొనుచుండగా గరుత్మందుని బారినుండి రక్షించమని నాగరాజు నాగనంది నందు శివుని గురించి తపస్సు చేసినాడు. బ్రహ్మముందుగా కద్రు నాగులకు ఇచ్చిన శాపమునకు ఆమోదము తెలిపిననూ కశ్యపుని కోరికపై నాగులలో ధర్మవంతులు మరియు సత్యముపలికేడి నాగులకు వర్తించకుండా పరిహారము ఇచ్చినాడు. ఆప్రకారమే శివుడు అనుగ్రహించి వాసుకిని తన కంఠమాలగా ధరించినాడు మరియు విష్ణువు ఆదిశేషుని తన తల్పముగా చేసుకొనినాడు.