నైమిశారణ్యం

(IPLTOURS)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో నైమిశారణ్యం సీతాపూర్ నుండి 32 కి.మీ దూరములో ఆటవీప్రాంతములోఉన్నది. ఆటవీప్రాంతము వలన నైమిశారణ్యం చాలాప్రశాంతంగాఉంటుంది. నీమిసర్ ఆలయం నైమిశారణ్యఆలయముగా ప్రాచుర్యముపొందినది. బ్రహ్మ, విష్ణు, సతి మరియు శివునికి నైమిశారణ్యఆలయముతో భాంధవ్యముఉన్నది. నైమిశారణ్యఆలయము హిందూమతమునకు చెందిన 33 మంది దేవతలనివాసము. కానీవిష్ణుమూర్తి ఎనిమిది స్వయంభూః క్షేత్రములందు ఒకటిగా గుర్తింపుపొందినది. ఇచ్చటనే సూతుడుమునులకు సత్యన్నారాయణవ్రతకల్పం భోదించినాడని ప్రసిద్ధి. వ్యాసభగవానుడు నైమిశారణ్యంలో తపస్సుఆచరించి భాగవతమురచించినాడు. ఇప్పటికినీ వ్యాసుడు తపస్సుచేసిన 5097 సంగత్సరాల వయస్సుగల మర్రిచెట్టు వ్యాసగద్దెనందుకలదు.

Chakra Teertha Naimisharanya

నైమిశారణ్యముగురించి పురాణములందు అనేకవిషములు తెలుపబడినవి. దేవతలు ధర్మమునుస్థాపించుటకు నైమిశారణ్యము అనువైనప్రదేశముగాగుర్తించినారు. అందుకు అడ్డంకిగామారిన వృత్తాసురుడు స్వర్గలోకముఆక్రమించి దేవతలరాజైనఇంద్రుని దేవలోకమునుండి వెడలగొట్టినాడు. వృత్తాసురుడు ముందుగాతయారైన ఆయుధముచేతను దర్మిలా కర్రతోకానీ లోహముతోకానీ తయారుకాబడిన ఆయుధమవలననూ మరణములేకుంగా వరముపొందినాడు. రాజ్యముపోగొట్టుకొనిన ఇంద్రుడు విష్ణువు సహాయము అర్దించినాడు. విష్ణువు నైమిశారణ్యమునందు తపముచేయుచున్న ధదీచిమహర్షివెన్నెముకతో తయారుకాబడిన ఆయుధముతోనే వృత్తాసురుని సంహరించుట సాధ్యపడునని తెలిపినాడు. ఇంద్రుడు ఇతరదేవతలతో ధదీచిమహర్షినికలిసి వృత్తాసురుని సంహరించుటకు సహాయముకోరినాడు. ధదీచుడు అంగీకరించుచూ తనజీవితము చాలించుటకుముందుగా అన్నిపవిత్రనదులకు స్నానముచేయవలెనను అనుకోరిక వ్యక్తము చేసినాడు. ఇంద్రుడు సమయాభావముకాకుండా అన్నినదులనీటిని నైమిశారణ్యముతెచ్చి ధదీచిమహార్షి కోరికతీర్చినాడు. ఆపవిత్రజలములతో స్నానముచేసి పునీతుడైన ధదీచిమహర్షి తనజీవితముచాలించగా దేవతలు ధదీచివెన్నెముకతో వజ్రాయుధము తయారుచేసినారు. ఆవజ్రాయుధముతో అసురునిఓడించి ఇంద్రుడుతన దేవలోకమును తిరిగిపొందినాడు.ఆప్రకారము నైమిశారణ్యములోని జలముఅన్ని పవిత్ర నదీజలములతో పవిత్రమైనది.

నైమిఅనగా చక్రము నైమిషం అనగా పడినచోటు చక్రముపడినప్రదేశము ఆగుటవలన నైమిశారణ్యమని పేరుకాంచినది. నైమిశారణ్యక్షేత్రమును తపోవనము అనిపిలిచెదరు. దండకారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, బద్రికారణ్యము, ఉత్పలారణ్యము, జంబుకారణ్యము, గురుజంగలరణ్యం, అరుపుతారణ్యం మరియు నైమిశారణ్యంఅను తొమ్మిదితపోవనము లందుఒకటి. ఋషులు బ్రహ్మను కలియుగప్రభావము పడకుండా ఆరాధనకుఅవసరమైన ఫలములుదొరకు ప్రదేశము చూపమని కోరగా బ్రహ్మ ఒకధర్భను ఉంగరముగాచేసి విసరివేసి అదిపడినచోట తపముచేసుకొనవలెనని తెలిపినాడు. ఆఉంగరము నమో మాయాచక్రముగా నైమిశారణ్యమునందు భూమిపైపడినది. ఇచ్చటనే మునులు తపస్సుచేయగా విష్ణువుదర్శనమిచ్చి వారుచేసిన తపస్సుఫలమును స్వీకరించినాడు. విష్ణువు దుర్జయుని మరియు వానియొక్క రాక్షసపరివారమును ఇచ్చటనే సంహరించినాడు.                                                                         

నైమిశారణ్యముయందు  ప్రధానదైవము అరణ్యమునకురాజు కావున పూజలుఅడవికిచేయదురు. విష్ణువు మరియు ఋషులు ఇప్పటికినీ ఇచ్చట చెట్లరూపములో నివసించుచున్నట్లు తలచెదరు. విష్ణువు చక్రాయుధముతో చక్రకుండము ఉద్భవించినది అనినమ్మెరు. ఆలయమందలి ప్రధానదైవమును చక్రనారాయణుడుఅని, దేవరాజపెరుమాళ్ అని, శ్రేహరిఅని, అమ్మవారిని లక్ష్మిగాను, పుండరీకవల్లిగాను తలంచెదరు. సోమవారమునాడువచ్చుశుక్లపక్ష పాఢ్యమిరోజు పెద్దసంఖ్యలో భక్తులు ఈపవిత్రకుండమునందు స్నానంచేసి స్వామినిదర్శించిన వారుచేసిన పాపములు తొలగిపోవునని నమ్మెదరు. 

నైమిశారణ్యఆలయము చాలాపురాతనమైనది. ఆలయము గోమతీనది ఎడమగట్టుపై ఉన్నది. శత్రుప, స్వయంభువ అనువారు నారాయణుని పుత్రునిగాపొందగోరి ఇచ్చటనే 2300 సంవత్సరములు తపస్సుచేసినారు. నలారియా దివ్యప్రభంధమునందు పన్నెండుమంది ఆళ్వారులు కీర్తించిన 108 దివ్యదేశములలో ఒకటి. తులసీదాసు రామచరితమానస్ ఇచ్చటనేరచించినాడు. పద్దెనిమిదిపురాణములు రచించిన శూద్రుడైన సూతమహర్షి ఈచట నివసించిఋషులకు పురాణ ప్రవచనముచేసినాడు.