నాభిగయ
(IPLTOURS)
ఒరిస్సా రాష్ట్రము జాజిపూర్ నందు నాభిగయ, బీహార్ రాష్ట్రము తాయనందు శిరోగయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పిఠాపురంనందు పాడగయ, గుజరాత్ రాష్ట్రము సిద్ధాపూర్ణండు మాతృగయ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు బదరీనాధ్ లోకలబ్రహ్మకపాలం అనుఅయిదు పితృముక్తికర క్షేత్రములు. ఇందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివాసమున్న గయాసురుని శిరము, ఉదరము మరియు పాదములతో గయ, జాజిపూర్ మరియు పిఠాపురం త్రిగయాక్షేత్రములుగాను మంగళగౌరి, గిరిజాదేవి, పురుహూతిక శక్తిపీఠములు మూడుక్షేత్రములందు విరాజిల్లుచున్నవి. మరణించిన పితృమరియు మాతృవంశములోని పూర్వీకులకు ఈమూడు క్షేత్రములలో కర్మకాండ మరియు పితృకర్మలు చేయుటవలన బ్రహ్మపదము కలుగునట్లు, నామోచ్చారణ పూర్వకముగా పితృ శ్రాద్ధమువలనవార్కి గయాశ్రాద్ధఫలితము తద్వారా బ్రహ్మపదము పొందునట్లు అనుగ్రహింపబడినది. శిరోగయ అనుపేరుతో గయనందు విష్ణుపాదములు మరియు మంగళగౌరి శక్తిపీఠం, నాభిగయ పేరుతో ఒరిస్సారాష్ట్రంలో జాజిపూర్ నందు యజ్ణవేదిక స్వరూపుడు బ్రహ్మదేవుడు మరియు గిరిజాదేవి శక్తిపీఠం, పాదగయపేరుతో ఆంధ్రప్రదేశ్ నందు పిఠాపురంలో కుక్కుటేశ్వరుడు మరియు పురుహూతిక శక్తిపీఠం త్రిగయాక్షేత్రములుగా ప్రసిద్దిచెందినవి.
ఓడ్రదేశే భువనే! శ్రీ గిరిజానామ సంస్థితా !!
పాలికాఖిల లోకానాం ! పల్లదారుణ పాణినా !!
పురాణప్రవచనం ప్రకారం గయాసురుడి ఉదరభాగంనందు నాభిప్రదేశంగా భావించు ఈక్షేత్రాన్నినాభిగయ అనివ్యవహరిస్తారు వ్యవహరిస్తారు. నాభిగయ పితృముక్తికరము. సర్వపాపహారము. నాభిగయ జాజిపూర్ నందు బిరిజాక్షేత్రమునందున్నది. బిరిజాదేవిఆలయం లేదా బిరిజాక్షేత్రం హిందువులు దుర్గాదేవిని ముఖ్యదేవతఅయిన విరిజాదేవి లేదా గిరిజాదేవిగా పూజించు క్షేత్రము. ఈఆలయము పేరుననే జాజిపూర్ విరిజాక్షేత్రమని బిరిజాపీఠంఅని పిలువబడుచున్నది. దుర్గాదేవి రెండుచేతులు కలిగియుండి ఒకచేతితో నీటిగేదెరూపంలోఉన్న మహిసాసురుని చాతీని ఈటెతో గ్రుచ్చుచూ రెండవచేతితో ఆతనితోకను లాగుచూ దర్శనమిస్తుంది. దేవీయొక్క ఒకకాలు సింహముపైన రెండవకాలు మహిసాసురుని చాతీపై ఉంటుంది. గణేశుడు, అర్ధచంద్రుడు మరియు శివలింగము రూపములు దేవికి అలంకరించిన కిరీటముపై కంపడును.
ఆలయప్రాంగణమునందు శివుడు మొదలగు ఇతరదేవతల ఆలయములున్నవి. భక్తుల మనస్సునుండి రజో గుణమును ఈఆలయదర్శనము తొలగించునని స్కంధపురాణం నందు తెలుపబడినది. రజో గుణమునకు ఆశ ప్రధాన లక్షణంగా ఉంటుంది. నేను చేస్తున్నాను అనే అహంకారము కంపడే ప్రాపంచిక విషయాలపట్ల ఆశక్తి కలిగిన వారు రజోగుణం కలవానిగా భావించబడతాడు.
ఇచ్చట నాభిగయనందు పూర్వీకులకు పిండప్రధానము చేసినపిమ్మట యాత్రికులు అన్నిక్షేత్రములలో విష్ణువును ప్రార్ధించినట్లుకాక బిరిజాదేవిని దర్శించి పూజించేది ఆహారము ప్రధానముగా నున్నది. దేశము నలుమూలలనుండి యాత్రికులు వారిపూర్వీకులకు పిండప్రధానముచేసి బిరిజాదేవిని అర్చించుటకు నాభిగయ వచ్చేదరు. సెప్టెంబరునెలలో వచ్చు తెలుగు భాద్రపదమాసమునందు పితృపక్షము లేదా మాలయాపక్షము అనబడు కృష్ణపక్షమునందు వేల కొలది యాత్రికులు నాభిగయ దర్శించి వారిపూర్వీకులకు పిండప్రధానము జరిపేదరు. భాధ్రప్రమాసం కృష్ణపక్షంనందు పిత్రుపక్షకాలం పక్షంరోజులు పిండదానంచేయుటకు పవిత్రమైనవిగా పరిగణించబడతాయని హిందువులనమ్మకం.
నాభిగయ యందు పితృ పూజ అనగా పిండ ప్రధానము, తర్పణము, తీర్ధవిధులు జరిపేదరు. ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానంచేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఇందు నిమిత్తము ఈ ఆలయములో పూజారులు అవసరమైన సదుపాయములు కలుగ చేసేదరు. మహాలయ పక్షమునకు ముందు కృష్ణ పక్ష అస్తమినాడు ఇచట శారదీయ దుర్గాపూజ ప్రారంభమై అశ్వని శుక్లపక్ష నవమినాడు మురుస్తుంది. సింహద్వజగా పిలువబడు రధయాత్ర అనే పల్లకీ ఉత్సవములో జెండా యందు సింహము కలిగి యుంటుంది. నవరాత్రి ఇచట అపరాజిత పూజాగా నిర్వహించ బడుతుంది. ఇవే కాక నక్ష్త్ర, శ్రావణ తదితర పండుగలు చేసేదరు. ప్రతిరోజూ అమ్మవారిని మహిసాసుర మర్ధినిగా తంత్ర మరియు ఆగమ శాస్త్ర పద్ధతిలోజైపూర్ బ్రాహ్మలచే పూజలు జరుపబడతాయి.
ఆలయము ఉదయం 6-00 నుండి సాయంత్రం 5-00 వరకు భక్తులు దర్శించుటకు తెరచి ఉంటుంది. జాజిపూర్ వెళ్ళుటకు చెన్నై నుండి హౌరా రైలు మార్గములో గల రైల్వే స్టేషను జాజిపూర్ రోడ్ ఆచటినుండి టాక్సీ లేదా ఆటోలో వెల్లవలసి ఉంటుంది. లేదా కటక్ చేరి ఆచటి నుండి బస్సులో వెళ్లవచ్చును. కటక్ నుండి జాజిపూర్ సుమారు 3 గంటలు మరియు జాజిపూర్ రోడ్ నుండి సుమారు 1గంట సమయము పట్టును. భువనేశ్వర్ నుండి కూడా బస్సులు కలవు.
పిండప్రధానం పితృదేవతలకు మోక్షప్రదం