మధుర

(IPLTOURS)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంనందు మథుర జిల్లాకేంద్రం మరియు మధురపట్టణం యమునానది తీరమున ఉంది, ఇది భారతీయ సంస్కృతికి గుండెగా పరిగణించబడుచున్నది. శ్రీకృష్ణుడు మధురనందే జన్మించాడు కాబట్టి మధురను ‘కృష్ణజన్మభూమి’ అనికూడా పిలుస్తారు. యమునా నదిఒడ్డున, విశ్రమఘాట్ వద్ద ప్రతిరోజూ సాయంత్రం యమునకు హారతి సమర్పిస్తారు.  శ్రీకృష్ణుడు మేనమామ కంసుడిని వధించిన తరువాత కృష్ణుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా పేర్కొనబడింది. ఇచ్చటనే యమునానది మరియు ఆమె సోదరుడు మృత్యుదేవత అయిన యమునిచిత్రాలు ఇక్కడ ఉన్నాయి. మథురలో ప్రేమమందిర్ బృందావనం, గోవింద్జీఆలయం, మదన్ మోహన్ ఆలయం, రాధాదామోదర్ ఆలయం, రాధాగోపీనాథ్ ఆలయం, బాంకేబిహారీ ఆలయం, కృష్ణబలరామ ఆలయం, రంగాజీ దేవాలయం వంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి మరియు సేవాకుంజా. కృష్ణుడు తన చిన్ననాటిరోజులు గడిపిన సమీపంలోని బృందావన్‌లో, దేవాలయాల గెలాక్సీఉంది. ఇది యాత్రికులకు చాలా పవిత్రమైన ప్రదేశం. మధుర మరియు బృందావన్ ఆవరణలో నిర్దేశించిన మార్గంలో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం గోవర్ధన్ పర్వతంచుట్టూ తిరగడంకూడా ఇందులోఉంది.

sri krishna at mathura