మహాలయ పక్షం
పితృపక్షం
(IPLTOURS)
ప్రతి సంవత్సరం చంద్రమానం ప్రకారం, పితృపక్షం లేదా మహాలయపక్షం భాద్రపద బహుళపక్ష ప్రతిపత్తి (పాడ్యమి) నుండి బహుళ అమావాస్యతో ముగుస్తుంది. పితృపక్షమునందు పిండప్రధానం స్వగృహములో చేసుకొనవచ్చును. పుణ్యక్షేత్రములలో చేసేదమని అభిలాష ఉన్నవారు వారణాశి (కాశీ), గయ, ప్రయాగ రాజ్ క్షేత్రములందు నిర్వహించుటకు వీలుగా క్షేత్రములలో సంప్రదించవలసిన క్షేత్ర పురోహితుల వివరములు అందించుచున్నాము. వారణాశినందు శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమంనందు బ్రాహ్మణ, బ్రాహ్మణేతరులకు బస, భోజనం లభ్యతతోపాటు స్వయముగా తీర్ధవీధి నిర్వహణ పవిత్ర కాశీక్షేత్రంలో శ్రేష్టమైన మణికర్ణికా ఘాట్ నందు పిండప్రధానం మరియు తర్పణములు జరిపించు అవకాశంకలదు. బ్రాహ్మణ మరియు బ్రాహ్మణేతరులకు విడిగా బస, భోజనవసతి కలిగియున్న ఈ ఆశ్రమమునకు lift సౌకర్యం కలదు. ఆశ్రమానికి ఇతర ఆశ్రమాల్తోనూ హోటళ్లతోనూ పరిచయాలు ఉన్నాయి. కావున అందరికీ బసకు సౌకర్యంగా ఉంటుంది.
కేదారేశ్వర ఘాట్ నందు పిండ ప్రధానం మరియు తర్పణములు జరిపించుటకు సోనాపుర ప్రాంతంలో అనేక వసతులు ఉన్నవి. అందు శ్రీ చల్లా లక్ష్మణ శాష్ట్రి మరియు శ్రీ రాజవరపు విశ్వనాధ శాష్ట్రి శ్రేష్టము. శ్రీ చల్లా లక్ష్మణశాష్ట్రి గృహమునందు బసచేయుటకు వసతి కలదు. ఇంతే కాక సోనాపురనందు శ్రీ కాశీ గాయత్రి సనాతన నిత్యాన్న దాన సత్రంఉన్నది. భోజనవసతి, బససౌకర్యం ఉన్ననూ lift సౌకర్యం లేదు. వీరు పౌరోహితులకు అప్పగించు ఏర్పాటు చేసేదరు. కావున వీక్షకులు తమయాత్రకు అనువైనవారిని సంప్రదించుటకు అందరి visiting cards జతపరచుచున్నాము. మరియు గయ మరియు ప్రయాగ్ రాజ్ వద్ద ఉన్న క్షేత్ర పురోహితుల వివరాలను కూడా అండ చేస్తున్నాము.
హిందువులు పాటించు తెలుగు క్యాలెండర్ నందు తమ పూర్వీకులకు లేదా పితరులకు ఆహారం సమర్పించండంతో నివాళులు అర్పించే పదిహేను రోజులకాలాన్ని పితృపక్షం లేదా మహాలయ పక్షమని అంటారు. పితృపక్షాన్ని ప్రాంతాలవారీగా విభిన్నమైనపేర్లతో పిలిచినా చేసే విధానంలో మార్పులేదు. భారతదేశంలో తెలుగునెల భాద్రపద మాసంలో లేదా ఇంగ్లీషు కాలెండర్ ప్రకారం సెప్టెంబరు నెలలో వచ్చు వినాయక చతుర్ధి గడచిన పిమ్మట బహుళ లేదా రెండవ పక్షంలో అనగా భాద్రపద శుద్ధ పౌర్ణమి నుండి బహుళ అమావాశ్య వరకు పదహారు రోజుల కాలాన్ని పితృపక్షం అంటారు. 16 రోజుల సమయాన్ని మహాలయ పక్షమని, అమావాస్యను పితృఅమావాస్య, మహాలయ అమావాస్యగా పిలుస్తారు. హిందూ పురాణాలప్రకారం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పితృపక్షం ప్రారంభమౌతుంది. ఈకాలంలో ఆత్మలు పిత్రులోకం విడిచి సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించేవరకు వారి వారసుల ఇండ్లలో తిరుగాడుతుంటారని నమ్ముతారు.
సూర్యుడు ఉత్తరమునుండి దక్షణానికి మారుకాలంలో మహాలయ పక్షం శరదృతువులో వస్తుంది. సౌరమానం ప్రకారం ఉత్తరాదివారు బాద్రపదమాసం నకు బదులుగా ఆశ్వీయుజమాసం నందు మహాలయ పక్షం పాటిస్తారు. హిందూ సంప్రదాయంనందు భూమిపై దక్షిణదిక్కు పూర్వీకులుదిగా చెప్పబడింది. కావుననే సూర్యుడు ఉత్తరమునుండి దక్షణమునకు మారుకాలం ప్రారంభం పితృదేవతల కాలమని తెలుప బడింది. చాంద్రమానం ప్రకారం భాద్రపద బహుళ పక్షం (పౌర్ణమి మరియు తర్వాత వచ్చే 15 రోజులు) మరియు సౌర క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసం బహుళ పక్షం పవిత్రమైన పితృ పక్షం లేదా మహాలయ పక్షంగా మరియు పురాణాలలో పేర్కొనబడింది. ఈ సమయంలో తల్లిదండ్రులతో పాటు పూర్వీకులను అర్చించాలి. అందువల్ల ఈపక్షంరోజులు పితృపక్షంగా హిందువులు ఈకాలంలో వంశంలో గతించిన పూర్వీకులను స్మరిస్తూ ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈపక్షం రోజులలో హిందువులు పూర్వీకుకు శ్రాద్ధకర్మలు ఆచరించి వారిని సంతృప్తిపరచి వారిదీవెనలు పొందాలని భావిస్తారు.
హిందూ ధర్మశాస్త్రంనందు మరణించిన పూర్వీకుల మూడుతరాల ఆత్మలు భూమికి స్వర్గానికి మధ్యకల పిత్రులోకంలో నివసిస్తాయని తెలుపబడింది. వంశంలో వ్యక్తి మరణం పిమ్మట, మరణించినవ్యక్తి ఆత్మ పితృలోకంలో ప్రవేశించి వంశములోని మొదటి తరం ఆత్మకు మోక్షం సిద్ధించి భగవంతునిలో ఐక్యమవుతుంది. భగవంతునిలో ఐక్యమైన వ్యక్తి యొక్క ఆత్మ పిండ శ్రాద్ధ నుండి తొలగింపబడి పితృలోకంలో మూడు తరాల ఆత్మలకు మాత్రమే శ్రాద్ధ కర్మ జరుగుతుంది. పితృపక్షంలో చేయు శ్రాద్ధకర్మలు ఆత్మలబాధ తగ్గించి తరువాతి జన్మలో వాటికి ఆనందాన్ని కలుగజేస్తుంది.
ఈవిషయమై పురాణకధనం ప్రకారం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించినప్పుడు అతని ఆత్మ స్వర్గానికి చేరుకోగా ఆత్మ ఆకలితో బాధపడ్డా అతనికికల దానగుణంవల్ల తాకినఆహారం వెంటనే బంగారమయ్యేది. అప్పుడు కర్ణుడు సూర్యునితో కలసి స్వర్గంలో ఇంద్రున వద్దకువెళ్ళి అందుకు కారణం ఈవిషయమై పురాణ కధనం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు మరణించి నప్పుడు అతని ఆత్మ స్వర్గానికి చేరుకోగా ఆత్మ ఆకలితో బాధపడి అతనికికల దానగుణం వల్ల తాకిన ఆహారం వెంటనే బంగారమయ్యేది. అప్పుడు కర్ణుడు సూర్యునితో కలసి స్వర్గంలో ఇంద్రుని వద్దకువెళ్ళి అందుకు కారణం అడిగారు. ఇంద్రుడు కర్ణుడితో కర్ణుడు తన పూర్వీకులకు శ్రాద్ధం చేయలేదని, జీవనపర్యంతం బంగారం దానంగా ఇచ్చినప్పటికీ తన పూర్వీకులవలన శాపగ్రస్తుడైనందున ఆకలితో అసంతృప్తిని పొందుతున్నాడని చెప్పాడు. కర్ణుడు తనకు విషయం తెలియక వారిజ్ఞాపకార్ధం పిండ ప్రధానం చేయలేదని తెలిపాడు. కర్ణుడు 15 రోజులపాటు భూమిపైకి తిరిగి రావడానికి అనుమతించబడి తన పూర్వీకుల జ్ఞాపకార్థం శ్రాద్ధకర్మ చేయడంద్వారా వారికి ఆహారం మరియు నీరు అందించి శాపం నుండి విముక్తి పొందాడు. మరికొన్ని పురాణములందు ఇంద్రునికి బదులు యమునిపేరు తెలుపబడింది.
గరుఢపురాణంనందు కుమారుడు లేని జీవికి ముక్తిలేదు అనితెలుపబడింది. పుత్రుడు చేసే శ్రాద్ధ కర్మతో తల్లిదండ్రులు మరియు పూర్వీకుల ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని హిందువులు నమ్ముతారు. గృహదైవాలు, పంచభూతాలతో పాటు పూర్వీకులను పూజించిన వారి ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుందని పురాణాలు తెలుపుతున్నాయి. మార్కండేయ పురాణంనందు పూర్వీకులను శ్రాద్ధకర్మలతో సంతృప్తి పరచిన వారు శ్రాద్ధకర్మ ఆచరించువార్కి ఆరోగ్యం, సంపద, జ్ఞానంతో పాటు ప్రసాదించి మోక్షాన్ని కలుగజేస్తారని చెపుతూంది. మహాలయ పక్షంలో చివరిరోజైన సర్వపితృ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మ జరిపి మరచిపోయిన లేదా విస్మరించబడిన వారి పిండ శ్రాద్ధ పూజను భర్తీచేయుటవల్ల ఆరోజును మరణించినవారి తిధిగా పరిగణిస్తారు. శ్రాద్ధకర్మ వంశంలోని గతించిన మూడుతరాల – గోత్రనామములను పలుకడంద్వారా అర్చన మరియు తర్పణలను కలిగి ఉంటుంది. శ్రాద్ధ కర్మలు చేసే వారు మరణించిన తల్లిదండ్రులు, అత్తమామలు, సోదరులు, సోదరీమణులు, కొడుకులు, కుమార్తెలు మరియు ఇతరులపేర్లను వారి గోత్రాలతోపాటు తెలుసుకోవడం మరియు పఠించడంద్వారా వారి కుటుంబ సంబంధాలను గుర్తు చేసుకుంటారు.
మహాలయపక్షం పదిహేను రోజులయందు ప్రతిరోజు ఎవరికి శ్రాద్ధకర్మ చేయవలేనో తెలుపబడింది. నియమాను సారంగా మరణించినవారి నిర్దిష్ట తిధి వచ్చినరోజు శ్రాద్ధ కర్మ చేయబడుతుంది. శ్రాద్ధకర్మ చతుర్ధి మరియు పంచమి తిధులు అనగా మహాలయపక్షంలో నాలుగు మరియు ఐదవ చాంద్రమాన రోజులలో ముందు సంవత్సరంలో మరణించిన వ్యక్తుల ఆరాధన నవమి ఆనగా తొమ్మిదవరోజున పుణ్యస్త్రీగా భర్తకంటే ముందే మరణించిన వివాహితస్త్రీలకు చేయబడుతుంది. భార్యనుకోల్పోయిన మగవారు భార్య శ్రాద్ధకర్మకు బ్రాహ్మణ స్త్రీలను ఆహ్వానిస్తారు. చతుర్దశి లేదా పద్నాలుగవరోజు హింసాత్మకంగా మరణించిన వ్యక్తులకు శ్రాద్ధకర్మ జరిపెదరు. పితృపక్షములో అతిముఖ్యమైన సర్వపిత్రు అమావాశ్య పూర్వీకులకోసం వారు మరణించిన తిధులు పరిగణించక, మరియు గతంలో పిండశ్రాద్ధం చేయుట మరచినవారు శ్రాద్ధకర్మ చేయుటకు ఉద్దేశించబడింది. పితృపక్ష కాలంలో అమావాశ్య రోజు ప్రత్యేక ప్రదేశంగా పరిగణించబడు పవిత్రమైన గయాక్షేత్రంలో చేయుశ్రాద్ధకర్మ ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. పితృపక్ష కాలంలో ఒక జాతరగా ఇచ్చట శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.
బెంగాల్ నందు మహాలయపక్షం దుర్గాపూజ ఉత్సవాలరోజు అనగా దుర్గాదేవి భూమిపై అవతరించిన అశ్వీయుజ శుద్ద పాడ్యమినాడు ప్రారంభమౌతుంది. మహాలయ పక్షములో బెంగాలీ ప్రజలు తెల్లవారుజామున మేల్కొని సాంప్రదాయకంగా దేవీమహాత్యం నుండి శ్లోకాలను పఠించి పూర్వీకులను ఇండ్లలోనూ తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మండపములందు ఆర్చిస్తారు.