కేదారనాధ్

(1వ కేదారి)
(IPLTOURS)

కేదార్నాథ్ జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలో పదకొండవ జ్యోతిర్లింగము మరియు పంచ కేదార్ లలో మొదటిది కేదార్ క్షేత్రము. ఋషీకేష్ నుండి రుద్రప్రయాగ అచ్చటి నుండి కేదార్నాథ్యాత్ర కొన సాగించవలెను రుద్రప్రయాగ నుండి గౌరీకుండ్ వరకు ఆగశ్యముని,గుప్తాక్షి, పాత, సీతాపూర్ మరియు సొనప్రయాగ (పంచ ప్రయాగల లోనిది కాదు) ద్వారా రోడ్డుమార్గముద్వారా టెంపోలో లేదా వేసవి కాలమైన బస్సులో చేరి ఆచటి నుండి 14 కి.మీ గుర్రముపై గాని, నడచిగాని, పల్లకీపై గాని కేదార్నాధ్ చేరవలయును. అట్లు ప్రయాణము చేయలేని వారు గుప్తాక్షి వరకు రోడ్డు ప్రయాణము చేసి అచట విశ్రమించి పాత హెలీపాడ్ నుండి హెలీకాప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళి రావచ్చును. హేలీ కాప్టర్ సౌకర్యము ఉదయము నుండి సాయంత్రం వరకు మాత్రమే లభించును. సముద్ర మట్టమునకు సుమారు 12000 అడుగుల ఎత్తులో ఉన్నయీ పవిత్ర శైవ పుణ్య క్షేత్రము నందు ఆక్సిజన్ అందుట కొంచెము కష్టతరము. కావున హుద్రోగులు దర్శనము చేసుకొనుటకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ సిలిండరు అందుబాటులో ఉంచుకొన వలయును.   

Kedarnath Temple in winters

కేదార్నాథ్ యాత్ర పెద్దవారికి పుణ్యము చిన్నవారికి ఆహ్లాదకరము. మొత్తముపై అన్నీ వయస్సుల వారిని ఆకర్షింపచేసేది హిమాలయన్ యాత్ర. శాస్త్రవచనం ప్రకారం  శ్రీహరియొక్క రెండు అంశలైన నర నారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం. 

హిమవత్పర్వతం మీద వుండి కేదారేశ్వరునిగా పేరు వహించినది. ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. కుంభరాశిలో జన్మించింన వారు కేదార్నాధ్ జ్యోతిర్లింగము దర్శించవలెనని చెప్పబడినది. ఇక్కడి కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరుమార్గమని ముని వాక్యం. జగద్గురు ఆది శంకరాచార్య కంచినందు నిర్యాణము చెందినారని నానుడి.  ఆ పరమాచార్యుడు కేదార్నాథ్ నందు పరమపదించినట్లు కేదారేశ్వర్ ఆలయము వెనుక భాగమున నున్నది వారి సమాధి అని అంటారు.                           

స్థల పురాణం ప్రకారం మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు  ఓడించి నిర్జించినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకుడు పరీక్షిత్తునకు ఆప్పగించి శివుని దర్శించి దీవెనలు పొందవలెనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్య క్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణ నష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించుకోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునందు అదృశ్యమైనాడు. వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు.  

భీముడు గుప్తాక్షి వద్ద రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినాడు. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండి అదృశ్యమై తరువాతప్రత్యక్షమై ఆరుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము  కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు జుట్టు కల్పెశ్వర్ లతో పాటు తల భాగము నేపాల్ నందు ఖాట్మండునకు 25 కి.మీ దూరములో కల చౌలి మహేశ్వర్ నందు పడినవి. 

పాండవులు శివుని కొలుచుటకు గాను  ఈ అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపముల నుండి విముక్తి పొందినారు. శివుని తల భాగము పడిన ప్రదేశము నేపాల్ లోని చౌలి మహేశ్వర్. పాండవులు చౌలిమహేశ్వర్ మినహా మిగిలిన పంచ కేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట ఈ ఆలయములందు కేదార్నాధ్ నందు తపస్సు మరియు యజ్ణము చేసి బదరీనాధుని దర్శించి మానా గ్రామమునుండి వారు స్వర్గారోహణ యాత్ర చేసినారు.