గయ

(IPLTOURS)

వారణాశినుండి గయాక్షేత్రం సుమారు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్ననూ వారణాశి నుండి హౌరా రైలుమార్గములో నడుచు రైళ్ల నందు అధికాబాగము గయాక్షేత్రములో ఆగుతాయి. రైళ్ల రాకపోకలు అధికం కావున ఉదయమే వారణాశినందు బయలుదేరిన గయాక్షేత్రంనందు పిండప్రధాన కార్యక్రమం జరిపినపిమ్మట భుజించి తిరిగి రాత్రికి వారణాశి చేరవచ్చును. తక్కువఖర్చుతో ప్రయాణసౌకర్యం రైలుమాత్రమే. కానీ ముందుగా నియమిత పోగ్రాంద్వారా రైల్వే టికెట్ రిజర్వు చేయించుకొన వలసిఉంటుంది.                                                  

గయాక్షేత్రం నందు పిండ ప్రదానం చేయించు తీర్ధ పురోహితులు అనేకమందిఉన్నా శాస్త్రోక్తంగా జరిపించే తెలుగువారు అన్నిభాషలు తెలిసినవారు గోదావరి జిల్లాలకు చెందిన బ్రహ్మశ్రీ షోడషి అరునాచార్య మరియు రవిఆచార్య అనువారు పరిమిత ఖర్చుతో పిండప్రదానం కార్యక్రమములు వారి ఆధ్వర్యములో జరిపించుచున్నారు. వారే కార్యక్రమం చేసేవారికి పరిమితధరపై భోజనం ఏర్పాట్లు చేయుచున్నారు. క్రొత్తగా గయాక్షేత్రం వచ్చువారి సౌకర్యార్ధం వీరికి ముందుగా ఫోనుద్వారా తెలియపరచినట్లయిన రైల్వే స్టేషన్ నందు రిసీవ్ చేసుకుని మరలా కార్యక్రమం అయిన పిమ్మట స్టేషన్ నందు దిగబెట్టి సదుపాయం కలుగజేయుచున్నారు. శాస్త్రోక్తంగా జరిపించు కార్యక్రమమునకు సుమారు 3000 వరకు ఖర్చు అగుచున్నది. వీరిపూర్వీకుల కాలం నుండి సుమారు 5తరములనుంచి గయలో ఈ కార్యక్రమములు నిర్వహించుకున్నారు. వీరి ఫోన్ నెం. 09432224639 మరియు 09334718080. వీరి మెయిల్ ID yenchinravi@yahoo.co.in

temple gaya pinda pradhan

ఆచార్యులవారు తెలిపిన సమాచారం ప్రకారం గయ దైవక్షేత్రంతో పాటు పితృక్షేత్రం అని మరణించినవారికి దశదిన ఖర్మ చేయునప్పుడు మంత్రోచ్ఛారణ యందు గయ ప్రస్తావన వచ్చునని గయలో పిండప్రదానం చేసెదమని మరణించినవారికి కర్త వాగ్దానం చేయుటవలన మరణించినవారి ఆత్మ గయనందు చేయుకర్త కొరకు ఎదురు చూచునని గయనందు పిండప్రదానంచేసి మరణించిన వారిస్థానే పిండము గోవుకు పెట్టి విష్ణుపాదము మరియు విష్ణుపదమందిరంవద్ద అక్షయభట్ అను మర్రిచెట్టుక్రింద పిండము సమర్పించిన పిమ్మట ఆత్మ విష్ణుపథం చేరుకొని. పరమాత్మను చేరునని పిండప్రదానం చేయని ఆత్మలు వల్ల కలుగు పితృ శాపం వల్ల వంశం వృద్ధిచెందక పోవుట, కుటుంబంలో అకాల మరణములు సంభవించడం జరుగుతుంది అని తెల్పినారు.

గయా క్షేత్రంలో మంగళగౌరి ఆలయం దక్షణ ద్వారంవద్ద ఆంధ్రాశ్రమం పేరుతో మున్నాపాఠక్ అనువారు తాము దక్షణభారత పురోహితులను ఏర్పాటుచేసేడమని తెలుపుచున్నారు. ఇందు వాస్తవ మెంత అన్నది తెలియదు. బ్రహ్మశ్రీ షోడషి అరునాచార్య వారి కార్డునందు గయనందు ఆంధ్రఆశ్రమం పేరుతో ఏ ఆశ్రమంలేనది పేర్కొనినారు. ఆంధ్ర ఆశ్రమం ఫోన్ నెం. 09334987412, 0933875155, 09331878517 మరియు ఆశ్రమం తరపున వెంకటశాస్త్రి అనువారు 9031203639 అను దక్షణ భారత పురోహితులు లభ్యం అనిపేర్కొనినారు. గయనందు పిండ ప్రధానమునకు సాధారణ ఖర్చుమాత్రమే అవుతుంది. యాత్రికులు ముందుగా ఫోన్ ద్వారా సంప్రదించి క్షేతెరపురోహితుని నిర్ణయించు కొని పూర్వీకులకు పిండప్రధానంచేసి వారిఆత్మలకు ముక్తి కలిగించకోరుతున్నాం.

గయా శ్రాద్ధం ఆత్మలకు మోక్షం