భార్గవ నృసింహ

(IPLTOURS)

భార్గవనృసింహక్షేత్రము నవనృసింహక్షేత్రములలో ఒకటి. ఈక్షేత్రము దిగువ అహోబిలమునకు రెండు కి.మీ. దూరములో దట్టమైన అడవిమధ్య ఒకకొండపై భార్గవతీర్ధం లేదా అక్షయతీర్ధం అనుకోనేటికి సమీపములో ఒకకొండపైఉన్నది. భార్గవరాముడు లేదా పరశురాముడు ఇచ్చట తపస్సు చేసినందువలన ఈస్వామికి భార్గవనృసింహుదని పేరువచ్చినది. విష్ణువు ఒకఅవతారమైన పరశురాముడు మరియొక అవతారమైన నృసింహుని పూజించిన ప్రదేశము. పరశురామ అవతారం ఉపఆవతారము కానీ నృసింహుడు ముఖ్యఆవతారము. భార్గవముని నృసింహుని దర్శనార్ధము తపస్సు చేసినాడు. పరశురాముడు ఇచ్చటనే తపస్సుచేసి హిరణ్యకశిపుని వధించిన నరసింహుని దర్శించుకొనినాడు.   

భార్గవనృసింహుని ఆలయము దర్శించుటకు సుమారు 130 మెట్లు ఎక్కవలసిన ఒకకొండ శిఖరముపై ఉన్నది. ఇచ్చట స్వామినాలుగుచేతులలో పైరెండుచేతులలో శంఖు, చక్రములు, దిగువరెండుచేతులతో హిరణ్యకశిపునిశరీరము చీల్చుచూకనపదును.

Lord Bhargava Narasimha Swamy Temple

ప్రహ్లాదుని స్వామి పాదములచెంత చూడవచ్చును. అక్షయతీర్ధమునందుస్నానముచేసి నృసింహుని సేవించిన లక్ష్మీకటాక్షము కలుగును అని చెప్పబడినది. స్థానికులు నృసింహుని భార్గోతి అని పిలిచేదరు. అందువలన దీనిని భార్గవనృసింహ (పరశురాముని మరోపేరు) అని పేరువచ్చినది.

భార్గవనృసింహక్షేత్రమునకు చదునైనరోడ్డుమార్గములేదు కావునజీపులోకానీ ఆటోనందుకాని ఈఆలయము చేరవలసి ఉన్నది.. భార్గవనృసింహుడు సూర్యగ్రమునకు అధిపతి. భార్గవనృసింహుని దర్శించి అర్చించిన సూర్యగ్రహము వలన నాయకత్వము లోపించుట, అధికారము లేకపోవుట ప్రభుత్వము, ప్రభుత్వాధికారులవలన మరియు అననుకూల శక్తులవలన కలుగుదోషములు తొలగునని చెప్పబడినది.

IPLTOURS Indian Pilgrim Tours