స్వయంభూ క్షేత్రములు
(IPLTOURS)
(IPLTOURS)
అవిభక్త హిందూదేశం పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. ఈపవిత్ర క్షేత్రములందు స్వయంభూః ఆలయములు, ఋషులచే ప్రతిష్టించ బడిన ఆలయములు, మానవ ప్రతిష్టిత ఆలయములు ఉన్నవి. ఇందు ఋషిప్రతిష్ట మరియు మానవ ప్రతిష్టలకంటే స్వయంభూః ఆలయములు ఉన్నతమైనవి. మహావిష్ణువు స్వయంభూఃగా భువిపై అవతరించిన ఎనిమిది దివ్య క్షేత్రములు శ్రీరంగం, తిరుమల, కడలూర్, తిరునల్వేలి, నేపాల్, పుష్కర్, నైమిశారణ్యం మరియు బద్రినాధ్ క్షేత్రములని చెప్పబడింది. ఇందు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో భూమిపై అవతరించగా శ్రీరంగం రంగనాధుడు, కల్లహళ్లి భూః వరాహస్వామి, తిరునల్వేలి వద్ద శ్రీతోతాద్రినాథన్, గండకినదీతీరమున ముక్తినాధ్, పుష్కర్ నందు వరాహస్వామి, నైమిశారణ్యంనందు లక్ష్మీనారాయణుడు మరియు బద్రీనాధ్ నందు బదరీనారాయణులతోపాటు కర్ణాటక రాష్ట్రం కేసరగాడ్ నందు అనంతపద్మనాభ స్వామి ఆలయములు కలియుగముకంటే ముందుగా శ్రీమహావిష్ణువు వివిధ రూపములలో ఉద్భవించిన పుణ్యక్షేత్రములు. తొమ్మిది దివ్య స్వయంభూః క్షేత్రముల కధనములు.
శ్రీరంగం తమిళనాడు రాష్ట్రములో రంగనాయకితో రంగనాధుడు కొలువైఉన్న వైష్ణవ దివ్యక్షేత్రము. శ్రీరంగం ఆళ్వారులచే కీర్తించబడిన 108 దివ్యదేశములలో ప్రధానమైనది. భారతదేశములో అతిపెద్దదేవాలయ సముదాయములలో శ్రీరంగంలోని రంగనాధస్వామి ఆలయంఒకటి. ఇది తీరుచురాపల్లికి చేరువలో కావేరీనది మరియు దాని ఉపనది కొల్లిదాం నదుల మధ్యనున్నద్వీపము. ప్రపంచంలో భూలోక వైకుంఠంగా ప్రసిద్ది చెందిన అతిపెద్ద హిందూ దేవాలయం. శ్రీరంగం రామనాధ ఆలయం అహోబిలమఠమునకు చెందిన 44వ జీయర్ స్వామివారిచే మివారిచే నిర్మించబబడింది. అర్చకులు ప్రతిరోజూ “శ్రీమాన్ శ్రీరంగశ్రియ మనుపద్రవన్ అందనం సంవర్ధన” అనే కీర్తనతో జపిస్తారు. రంగనాధుదు ఆదిశేషునిపై విశ్రాంతితీసుకొనుచూ దర్శనంఇస్తాడు.
శ్రీకృష్ణుడు అవతార సమాప్తి కావించిన పిమ్మట కలియుగపప్రారంభంలో అయిదువేల వంద సంవత్సరములకుపూర్వం శ్రీ మహావిష్ణువుతో మహాలక్ష్మి వాగ్వివాదపడి వైకుంఠం వదలిన పిమ్మట మహావిష్ణువు వెంకటేశ్వరస్వామిరూపంలో ఆమెను వెదకుచూ భూలోకంలో తిరుమలకొండలకు వచ్చి స్థిరపడినాడు. మహాలక్ష్మిని కనుగొన లేకపోవుటవలన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని నాలుగువేల సంవత్సరములకుపూర్వం వివాహం చేసుకున్నాడు. యాభై సంవత్సరాల తరువాత, వేంకటేశ్వరుడు తనహృదయంపై లక్ష్మీదేవిని ప్రతిష్టించుకుని రాతివిగ్రహంగా మారాడు. కలియుగ వైకుంఠంగా పిలువబడు తిరుమలయందు శ్రీవెంకటేశ్వరస్వామి భూదేవి మరియు పద్మావతి అమ్మవార్లతో భక్తులను అనుగ్రహించుచున్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో నైమిశారణ్యం సీతాపూర్ నుండి 32 కి.మీ దూరములో ఆటవీప్రాంతములోఉన్నది. ఆటవీప్రాంతము వలన నైమిశారణ్యం చాలాప్రశాంతంగాఉంటుంది. నీమిసర్ ఆలయం లక్ష్మీనారాయణ ఆలయంగా ప్రాచుర్యం పొందింది. బ్రహ్మ, విష్ణు, సతి మరియు శివునికి నైమిశారణ్య ఆలయముతో భాంధవ్యం ఉన్నది. నైమిశారణ్య ఆలయం హిందూమతమునకు చెందిన 33 మంది దేవతల నివాసం. ఈఆలయం విష్ణుమూర్తి ఎనిమిది స్వయంభూః క్షేత్రములందు ఒకటిగా గుర్తింపు పొందినది.
బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రమునందు రుద్రప్రయాగ మరియు చామోలిజిల్లాలందు చార్ ధామ్ పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్, గంగోత్రి, యమునొత్రి మరియు బధ్రీనాథ్ లలో ఒకటిగానున్న నగరపంచాయితీ. బద్రి, నీలకంఠ తదితర పర్వతారోహణములకు ముఖద్వారమువంటిది. బద్రిఅనునది ఈప్రాంతమునందు పెరుగు ఒకచిన్నమరియు తినుటకు ఉపయోగపడు రుచికరమైనపండు (రేగుపండు) మరియు నాథ్ అనగా భర్త. స్థలపురాణం ప్రకారం శ్రీమహాష్ణువు జీవరాశులన్నిటి క్షేమంకోరి ఇక్కడ తపస్సుచేయ నారంభించినాడని ప్రతీతి. విష్ణువు తపస్సు చేసినప్పుడు వ్యతిరేక వాతావరణ పరిస్థితులు తట్టుకొనుటకు లక్ష్మీదేవి బద్రి (రేగు) వృక్షము రూపములో స్వామికి రక్షణగా ఉండుటవలన లక్షీదేవి భర్త కావున స్వామి బద్రినాధ్ అయినాడు.
ముక్తినాధ్ 108 దివ్య దేశములలో ఒకటి మరియు విష్ణుభగవానునికి ప్రీతికరమైన ముఖ్య ఆలయము. ఈఆలయం నేపాల్ నందు తోరంగ్ లా పర్వతమార్గములో మత్సంగ్ అనుచోట ముక్తినాథ్ లోయనందు సముద్రమట్టమునకు సుమారు 12000 అ ఎత్తులో ఉన్నది. నేపాల్ నందు చార్ ధామ్ క్షేత్రములు బార్షా, పశుపతి, మరియు రుహూ లతోపాటు నాలుగవక్షేత్రం. హిందువులకు మరియు బౌద్ధులకుకూడా యాత్రాస్థలం. విష్ణుపురాణంనందు గండకీమహత్యంలో ముక్తినాథ్ గురించి వివరించబడింది. శ్రీమహావిష్ణువు పూజింపబడు పవిత్రప్రదేశములలో ముక్తినాధ్ ఒకటిఅని ముక్తినాధ్ దర్శనం విష్ణుభగవానుని వరంగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవిసమెత విష్ణుభాగవనుడు ముక్తిని ప్రసాదించునని అందువలననే ఈక్షేత్రరమునకు ముక్తినాథ్ అనేపేరు వచ్చినట్లు ఆలయంలో గోదాదేవి, రామానుజ విగ్రహములు శ్రేశ్రెశ్రీ శతగోప రామానుజ జియ్యర్ స్వామిచే ప్రతిస్థించబడినట్లు తెలుస్తూంది.
శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చుటకు పురాణకధ ఉన్నది. జయవిజయులు వైకుంఠమునకు ద్వారపాలకులు. శ్రీమహావిష్ణుపై అమిత భక్తి కలవారై స్వామి దర్శనార్ధము వచ్చువారిని వైకుంఠంలోనికి పంపేడివారు. ఒకపర్యాయము బ్రహ్మ మానసపుత్రులైన సనాత్కుమారులుగా పిలువబడు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు శ్రీమహావిష్ణువు దర్శనమునకు రాగా స్వామి మహాలక్ష్మితో ఏకాంతంలో నుండుటవలన జయవిజయులు వారిని అడ్డగించారు. అందుకు ఆగ్రహించిన సనాత్కుమారులు వారిని మానవులుగా జన్మించి మహావిష్ణువు సేవకు దూరం ఆగుడురని శపించారు. ఆప్పుడు విష్ణుమూర్తివచ్చి తనపై భక్తితోవారు నిలిపినారు కావున శాపం ఉపసంహరించగొరినాడు. వారు ఉపసంహరణ వీలుకాదనిచెప్పగా శ్రీమహావిష్ణువు ఏడుజన్మలు భక్తులుగా జన్మించుట లేదా మూడుజన్మలు రాక్షసులుగాజన్మించి తనపై వైరంతో తనచే వధించబడి శాపవిమోచనం పొందేట్లు అనుగ్రహించాడు జయవిజయులు విష్ణువును వదలిఉండలేక మూడుజన్మలు రాక్షసులుగా జనించి విష్ణువుచేసంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతికోరారు. ముందుగా కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా అటుపిమ్మట త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా చివరిగా ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తులుగా జనించి శ్రీహరిచేసంహరించబడి వైకుంఠము చేరారు.
భూఃవరాహస్వామిఆలయం కర్ణాటక రాష్ట్రములో మైసూరువద్ద కట్టహళ్లి గ్రామమునందు హేమవతీ నదీతీరమునందు ఉన్నది. ఆలయం పురాతనమైనది. ఆలయము చతురస్రాకారములో ఎర్రరాతితో నిర్మించబడి ఉన్ననూ బయటనుండిచూచుటకు ఆవిధంగా కనపడదు. ఆలయము రెండుభాగములుగా గర్భగుడి మరియు మండపం కలిగిఉంటుంది. విష్ణుమూర్తి దశావతారాములలో వరాహావతారం మూడవది. స్వామిని ప్రళయ వరాహనృసింహస్వామి అనికూడా పిలిచేదరు. భూదేవిని హిరణ్యాక్షుడను రాక్షసునినుండి కాపాడుటకు విష్ణువు వరాహస్వామిగా అవతరించాడు. నల్లనిశాలిగ్రామశిలనందు ఒక కాలు భూమిపైన ఎడమకాలు మడిచితొడపై మూడున్నర అడుగులఎత్తుతో ఒకచేతితోకమలం పట్టుకొని మరియొకచేతితో స్వామినడుం చుట్టిఉన్న భూదేవిని కూర్చోపెట్టుకొని తెల్లటికోరలు మరియు ఎర్రటికనులతో పద్దెనిమిది అడుగులఎత్తుతో కిరీటముధరించి నాలుగు చేతులందు పైఎడమచేతిలో లోహముతోచేసిన శంఖము క్రిందిఎడమచేతితో భూదేవిని హత్తుకుపట్టుకొని క్రింది కుడిచేతితో అభయముద్రతో కూర్చొనిఉన్న భంగిమలో బూడిదరంగులో భూఃవరాహస్వామి దర్శనంఇస్తాడు.
వానమామలై పెరుమాళ్ ఆలయం విష్ణుమూర్తికి ప్రియమైన 108 దివ్యదేశములలో ఒకటి. విష్ణుమూర్తి స్వయంభూఃగా వెలసిన ఎనిమిది క్షేత్రములలో ఒకటి. ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తామ్రపర్ణి నదితీరంలో తిరునల్వేలివద్ద వానమామలై గ్రామంనందు ఉన్నది. వానమామలై ఇచ్చటనే ఆదిశేషునికి మరియు గరుడునికి దర్శనము ఇచ్చాడు. ఆలయం ద్రావిడ వాస్తుశాస్త్రము ప్రకారం నిర్మించబడి దివ్య ప్రభంధమునందు కీర్తింపబడినది. విష్ణుమూర్హి వానమామలై పెరుమాళ్ పేరుతో భార్య లక్ష్మీదేవి వారమనాగి పేరుతోనూ ఇచట పూజించ బడుచున్నారు. ఈఆలయము పాండ్యరాజుల కాలములో నిర్మింపబడి విజయనగర రాజులమరియు మధురై నాయకుల పాలనలో అభివృద్ధి పరచబడింది. ఆలయగోపురం అయిదుఅంతస్తులతో ఆలయం అయిదుఏకరముల విస్తీర్ణములో నిర్మించబడియున్నవి. ఆలయం గురించి బ్రహ్మాండ, స్కంధ మరియు నృసింహపురాణములందు ఉదహరించబడినది.
IPLTOURS – Indian Pilgrim Tours