యోగానంద నృసింహ

(IPLTOURS)

యోగానంద నృసింహక్షేత్రము అహోబిలమునందు నవనరసింహక్షేత్రములలో ఒకటి. కానీహిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట నృసింహుడు దిగువ అహోబిలంనకు ఆగ్నేయమువైపున 3కిలోమీటర్ల దూరములోనున్న ఈప్రదేశమునందు యోగముద్రనందు విశ్రమించినాడు. ఇచ్చటనేప్రహ్లాదునికి యోగమంత్రములు నేర్పుటవలన యోగానంద నృసింహుడు అయినాడు. బ్రహ్మ ఒకపర్యాయము ఆందోళనచెంది ఈప్రదేశమును సందర్శించి లక్ష్మీనృసింహుని స్తుతించి శాంతపడి బ్రహ్మలోకమునకు మరలినాడు. స్వామి ఒక లోతైన సొరంగమునందు ఉండేడివాడు. పిమ్మట స్వామిని సొరంగము బయటకు తెచ్చి ప్రతిష్టించినారు.

కాళ్ళను రెండింటినీ అడ్డముగా పద్మాసన ముద్రలో స్వామిచిత్రము చిత్రీకరించబడినది. ఇచ్చటస్వామి చాలా ప్రశాంతముగా ఉంటారు.

Lord Yogananda Narasimha Swami Temple -Ahobilam Andhra Pradesh

ఇదేఆలయ సముదాయములో ఒకఆలయమునందు ప్రతినారసింహుడు ఆదిపత్యము వహించు నవగ్రహములలతో నవనృసింహుల ప్రతిమలు పూజించబడుచున్నవి. నవనృసింహులు మరియు వారిని సేవించుటవలన దుష్పలితములు తొలగు నవ గ్రహముల వివరములుఉన్నవి. ఈఆలయము ప్రణవనృసింహుని ఆలయమునకు వెళ్ళుమార్గములో నున్నది. ప్రణవనృసింహుని మరియు యోగానందనృసింహుని  ఆలయములు ప్రయాసలేకుండా దర్శించవచ్చును.

యోగానంద నృసింహుడు శనిగ్రహమునకుఅధిపతి. శని జన్మకుండలిలో లేదా జాతకచక్రములో నీచస్థితినందు  ఉన్నట్లయిన మానవుని నైపుణ్యములపైనా మరియు ఆయువుపైన దుష్పరిమాణములు చూపు గ్రహము. యోగానంద నృసింహుని దర్శించి అర్చించినవారికి శనిగ్రహ దోషములన్నియు పరిహారమై ఉన్నతస్థితి కలుగునని తెలుపబడినది

IPLTOURS Indian Pilgrim Tours